వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫేక్ టీఆర్పీ రేటింగ్ రచ్చ: పార్లె జీ సంచలన నిర్ణయం: వాటికి దూరం?: జనానికి విషం పంచేలా

|
Google Oneindia TeluguNews

ముంబై: నకిలీ టీఆర్పీ రేటింగుల వ్యవహారం సృష్టించిన దుమారం ఇంకా తగట్లేదు. నకిలీ టీర్పీ రేటింగ్స్‌‌ కోసం అక్రమాలకు పాల్పడుతున్న న్యూస్ ఛానళ్లపై ముంబై పోలీసులు కేసు నమోదు చేసిన అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వీక్షకులకు డబ్బులు ఇచ్చి మరీ అక్రమంగా రేటింగ్స్‌ పెంచుకుంటున్న ఛానల్స్‌‌పై కిందటి వారం పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రముఖ జాతీయ మీడియాతో మహారాష్ట్రకు చెందిన మరో రెండింటిపై కేసు పెట్టారు. టీవీ రేటింగ్స్‌ కుంభకోణంపై పోలీసులు విస్తృత దర్యాప్తు సాగిస్తున్నారు.

ఈ వ్యవహారం తెర మీదికి వచ్చిన తరువాత.. పార్లె జీ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. న్యూస్ ఛానళ్లకు వ్యాపార ప్రకటనలను ఇవ్వడాన్ని నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. న్యూస్ ఛానళ్లు ప్రజలకు విషాన్ని పంచుతున్నాయనే భావన పార్లె యాజమాన్యంలో వ్యక్తమౌతోందని, అందుకే వాటికి అడ్వర్టయిజ్‌మెంట్లను నిలిపివేయాలని నిర్ణయానికి వచ్చిందని ఇండియన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ వెల్లడించింది. ఈ మేరకు ఓ ట్వీట్ చేసింది. న్యూస్ ఛానళ్లకు ఎలాంటి వ్యాపార ప్రకటనలను ఇవ్వకూడదని పార్లె నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

 Parle Products has decided not to advertise on news channels

ప్రజలకు విషాన్ని పంచే న్యూస్ ఛానళ్లపై తాము వాణిజ్య ప్రకటనల రూపంలో డబ్బును ఎందుకు ఇవ్వాలనే అభిప్రాయం పార్లె సంస్థ యాజమాన్యం అభిప్రాయపడుతోందని సివిల్ లిబర్టీస్ తెలిపింది. బజాజ్, పార్లె వంటి సంస్థలకు మద్దతుగా మరిన్ని కంపెనీలు ముందుకు రావాల్సిన అవసరం ఉందని పేర్కొంది. నకిలీ టీఆర్పీ రేటింగుల వ్యవహారం బార్క్‌ సంస్థ ఇచ్చిన ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. బార్క్‌ మాజీ ఉద్యోగులతో పాటు మరికొంత మంది టాప్ ఎగ్జిక్యూటివ్స్ ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే రెండు ఛానళ్ల యాజమానులను పోలీసులు అరెస్టు చేశారు.

English summary
Indian Civil Liberties Union tweeted that, Parle Products has decided not to advertise on news channels that broadcast toxic aggressive content. These channels are not the kinds that the company wants to put money into as it does not favour its target consumer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X