• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఏపీపై మాట్లాడతా, మీకివ్వాల్సింది ఇంకా రెండే: ఏపీకి-బాబుకు జైట్లీ షాక్, సభలో ఏం చెప్పారంటే

|
  Sujana Chowdary Argument with Arun Jaitley

  న్యూఢిల్లీ: బడ్జెట్‌పై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం లోకసభలో మాట్లాడారు. ప్రపంచ దేశాలతో భారత్ పోటీ పడే పరిస్థితి ఇప్పుడు ఉందని చెప్పారు. యూపీఏ హయాంలో ఒక్క సంస్కరణ చేపట్టలేదన్నారు. తమ హయాంలో ఆర్థిక పరిస్థితి బాగున్నట్లు యూపీఏ చెబుతోందని, కానీ ఇప్పుడున్న జోరు లేదన్నారు.

  వచ్చే రెండేళ్లలో కూడా భారత్ మెరుగైన ర్యాంకులు సాధిస్తుందన్నారు. ఏ ప్రాతిపదికన చూసినా ప్రపంచ దేశాలకంటే మనం ముందు ఉంటామని చెప్పారు. సంస్కరణలు ఇప్పుడు కఠినంగా ఉన్నా ముందు మంచి ఫలితాలు ఉంటాయన్నారు. జైట్లీ మాట్లాడుతుండగా ఏపీ విభజన సమస్యల గురించి మాట్లాడాలని నినాదాలు చేశారు.

  విభజన గురించి పూర్తిగా మాట్లాడుతా

  విభజన గురించి పూర్తిగా మాట్లాడుతా

  దీనిపై జైట్లీ మాట్లాడుతూ.. ఏపీ విభజన సమస్యలపై తనకు సానుభూతి ఉందని చెప్పారు. వాటి గురించి విఫులంగా మాట్లాడుతానని, అప్పటి వరకు కాస్త ఓపిక పట్టండని విజ్ఞప్తి చేశారు. అయితే ఏపీ ఎంపీలు మాత్రం ఇప్పుడే మాట్లాడాలంటూ పట్టుబట్టారు. హమీలపై మాట్లాడేకే మిగతాది మాట్లాడాలన్నారు. తర్వాత ఏపీకి ఏమిచ్చామో సవివరంగా చెబుతా అని జైట్లీ చెప్పారు.

  కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి

  కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి

  జీఎస్టీ అమలులో కాంగ్రెస్ పార్టీది ద్వంద్వ వైఖరి అని జైట్లీ అన్నారు. ప్రపంచంలో చాలా దేశాల్లో జీఎస్టీ అమలులోకి రావడానికి చాలా ఏళ్లు పట్టిందని చెప్పారు. సింగపూర్‌లో ఆహారపదార్థాల పైన, కార్ల పైన కూడా 7 శాతం జీఎస్టీ ఉందని చెప్పారు. కేంద్ర, రాష్ట్రాల పురోగతితోనే దేశం ముందుకు పోతుందన్నారు. ఆధార్, జీఎస్టీపై కాంగ్రెస్ రాజకీ��ం చేస్తోందన్నారు. జీఎస్టీ వల్ల ఆదాయం సమకూరుతుందన్నారు. ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలనే విషయమై ప్రభుత్వానికి కొన్ని విధానాలు ఉన్నాయన్నారు. ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో మా ప్రభుత్వానికి తెలుసునని చెప్పారు. యూపీఏకు మాకు తేడా అదే అన్నారు.

  నోట్ల రద్దు ఫలితాలు కనిపిస్తున్నాయి, జీఎస్టీతో లాభం

  నోట్ల రద్దు ఫలితాలు కనిపిస్తున్నాయి, జీఎస్టీతో లాభం

  నోట్ల రద్దు భలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని జైట్లీ చెప్పారు. నాలుగేళ్ల పాలనలో ఆర్థిక వ్యవస్థను సుస్థిరం చేశాయని చెప్పారు. జీఎస్టీ వల్ల లాభపడతామని అన్ని రాష్ట్రాలకు తెలుసునని చెప్పారు. యూపీఏ హయాంలో ద్రవ్యోల్భణం రెండంకెల్లో ఉండేదన్నారు. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్భణం కొంత అవసరమని, లేదంటే మాంద్యంలోకి వెళ్లిపోతామన్నారు. ద్రవ్యోల్భణం హద్దులు దాటకుండా ఉండేందుకు నిరంతరం ప్రయత్నించాలన్నారు.

  ఆయుధాల గురించి చెబితే శత్రువులకు తెలిసిపోతుంది

  ఆయుధాల గురించి చెబితే శత్రువులకు తెలిసిపోతుంది

  రాఫెల్ గురించి మాట్లాడే వాళ్లు ప్రణబ్ ముఖర్జీ వద్దకు వెళ్లి మాట్లాడాలన్నారు. ఎన్డీయేపై పని గట్టుకొని ఆరోపణలు చేస్తున్నారని జైట్లీ అన్నారు. ఇప్పుడు రాఫెల్ విషయంలోను అదే జరుగుతోందన్నారు. రక్షణ ఒప్పందాలపై పూర్తిస్థాయి వివరాలు బయటపెట్టవద్దని కాంగ్రెస్‌కు తెలియదా అని ప్రశ్నించారు. ఎలా కొన్నాము, ఎంతకు కొన్నాము, చెబితే మన దగ్గర ఎన్ని ఆయుధాలున్నాయో శత్రువులకు తెలిసిపోతుందన్నారు. రాఫెల్ విషయంలో చేసిన విమర్శలను బీజేపీ వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. దానికి శశిథరూర్ మాట్లాడుతూ.. తాము భద్రతా వివరాలు అడగటం లేదని చెప్పారు. రాఫెల్ వివరాలు ఇవ్వాల్సిందే అన్నారు.

  నిధులు ఇస్తూనే ఉంటాం

  నిధులు ఇస్తూనే ఉంటాం

  జైట్లీ మాట్లాడుతుండగా ఏపీ ఎంపీలు నిరసన తెలిపారు. జైట్లీ స్పందిస్తూ.. రాజధాని నిర్మాణానికి ఇప్పటికే కొన్ని నిధులు ఇచ్చామని చెప్పారు. ఏపీలో ఏర్పాటు చేసిన సంస్థలకు నిధులు ఇచ్చామని, ఇంకా ఇస్తూనే ఉంటామన్నారు. విభజన చట్టంలోని అంశాలను ఇప్పటికే కొన్ని అమలు చేశామని చెప్పారు. కొన్ని ప్రోగ్రెస్‌లో ఉన్నాయని తెలిపారు. నాబార్డు ద్వారా పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇస్తున్నామని చెప్పారు. విపక్షాలు, ఏపీ ఎంపీల అల్లర్ల మధ్య లోకసభ శుక్రవారానికి వాయిదా పడింది.

  లెక్కల్లో తేడా, బాబు ప్రభుత్వానికి షాక్

  లెక్కల్లో తేడా, బాబు ప్రభుత్వానికి షాక్

  వెనుకబడిన జిల్లా అభివృద్ధికి నిధులు ఇస్తున్నామని జైట్లీ చెప్పారు. అనేక విద్యా సంస్థలను ఇప్పటి వరకు ఇచ్చామని, ఇంకా ఇస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు ఖర్చు మొత్తం కేంద్రమే భరిస్తుందన్నారు. రెవెన్యూ లోటుకు సంబంధించి కొన్ని తేడాలు ఉన్నాయని జైట్లీ.. చంద్రబాబు ప్రభుత్వానికి షాకిచ్చారు. ఏపీ ప్రజలు సంతృప్తి చెందేలా అన్ని హామీలు నెరవేరుస్తామని చెప్పారు.

  మరో రెండు అంశాలే మిగిలాయి

  మరో రెండు అంశాలే మిగిలాయి

  ఏపీలో ఏర్పాటు చేసిన సంస్థలకు నిధులు ఇచ్చామని జైట్లీ చెప్పారు. విభజనకు మద్దతిచ్చినా ఏపీ హక్కుల కోసం నాడు తాము పోరాడామని చెప్పారు. ఏపీకి ఇక రెండు అంశాలే మిగిలి ఉన్నాయని చెప్పారు. ఒకటి స్పెషల్ ప్యాకేజీ కింద రావాల్సిన నిధులు, రెండు రెవెన్యూ లోటు పూడ్చడం అన్నారు. ఈ అంశాలు కూడా రెండు మూడు రోజుల్లో తేలుతుందన్నారు. నాబార్డు ద్వారా పోలవరానికి రూ.4వేల కోట్లు ఇచ్చామన్నారు.

  ఏపీకి షాకిచ్చిన జైట్లీ

  ఏపీకి షాకిచ్చిన జైట్లీ

  విభజనతో ఏపీకి ఆర్థికంగా నష్టం జరిగిందని, అందుకే ప్యాకేజీ ప్రకటించామని జైట్లీ చెప్పారు. రెవెన్యూ లోటు ఎంత అనే దానిపై కైంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారుల మధ్య చర్చ జరుగుతోందన్నారు. అధికారుల మధ్య గ్యాప్ ఉందని, కొద్ది రోజుల్లో అది తేలిపోతుందన్నారు. ప్యాకేజీలో ఇప్పటికే అనేకం అమలు చేశామని చెప్పారు. కాగా, జైట్లీ పాతపాటనే పాడి ఏపీకి, చంద్రబాబుకు షాకిచ్చారు. కానీ ప్రత్యేక హోదా, ప్యాకేజీపై పూర్తి స్పష్టత ఇవ్వలేదు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Arun Jaitley questions UPA role in hurting Indian economy, Oppn asks ‘acche din kab aayenge?’
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more