వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫైనల్ డే-16వ లోకసభలో ప్రధాని ఆఖరి స్పీచ్:రాఫెల్‌పై కేంద్రానికి కాగ్ క్లీన్‌చిట్, మోడీపై సోనియా అటాక్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు బుధవారం (ఫిబ్రవరి 13) ముగిశాయి. గత నెల 31వ (జనవరి) తేదీన ప్రారంభమైన సమావేశాలు ఈ రోజు ముగిశాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఇవే చివరి సమావేశాలు. ఆ తర్వాత రెండు మూడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలకు ముందు ఇవే చివరి సమావేశాలు.

Parliament Budget Session live updates: Budget Session of parliament to end today

Newest First Oldest First
5:52 PM, 13 Feb

లోక్‌సభ నిరవధిక వాయిదా పడింది.
5:26 PM, 13 Feb

తాను విమానం నడిపేందుకు కూడా ప్రయత్నించానని కానీ సాధ్యం కాలేదని మోడీ అన్నారు.
5:10 PM, 13 Feb

నేడు దేశం ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తోందని ప్రధాని మోడీ అన్నారు. అత్యధిక సంఖ్యలో శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపించామని చెప్పారు. పలు దేశాలకు భారత్ మానవీయ కోణంలో సాయం చేసిందని తెలిపారు.
5:09 PM, 13 Feb

ఈసారి పార్లమెంటులో మహిళా ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో ఉన్నారని మోడీ చెప్పారు. తాము ఇద్దరు మహిళలకు కీలక మంత్రి పదవులు ఇచ్చామని చెప్పారు.
5:08 PM, 13 Feb

మూడు దశాబ్దాల తర్వాత తమ పార్టీ పూర్తి మెజార్టీతో అధికారంలోకి వచ్చిందని మోడీ చెప్పారు.
5:08 PM, 13 Feb

నూటికి నూరు శాతం తాము ప్రజలు కోరుకున్న విధంగా పని చేశామని మోడీ చెప్పారు.
4:48 PM, 13 Feb

లోకసభలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తున్నారు. 16వ లోకసభలో మోడీ ఆఖరి ప్రసంగం
2:54 PM, 13 Feb

లోకసభ మధ్యాహ్నం మూడు గంటల వరకు వాయిదా పడింది.
2:25 PM, 13 Feb

పార్లమెంట్ చివరి రోజు సమావేశాల్లో భాగంగా అధికార, విపక్ష సభ్యుల మధ్య వాడీవేడి చర్చ జరిగింది. చివరకు రాజ్యసభ నిరవధిక వాయిదా పడింది.
1:44 PM, 13 Feb

కాగ్ రిపోర్ట్ ద్వారా విపక్షాలు చెబుతున్నవి అబద్దాలు అని అర్థమవుతోందని, దేశాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని జైట్లీ ట్వీట్ చేశారు. సత్యమేవ జయతే అంటూ కాగ్ రిపోర్టును ఉద్దేశించి వరుసగా ట్వీట్లు చేశారు.
1:41 PM, 13 Feb

రాఫెల్ డీల్ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి కాగ్ క్లీన్ చిట్ ఇవ్వడంపై కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం విమర్శలు గుప్పించారు.
1:10 PM, 13 Feb

కాగ్ నివేదికపై రాజ్యసభలో గందరగోళ పరిస్థితి నెలకొంది.
1:07 PM, 13 Feb

కాగ్ రిపోర్ట్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉందని విపక్షాలు మండిపడ్డాయి. ప్రస్తుత కాగ్ రాజీవ్ మెహర్షి అప్పట్లో ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్నారని, రాఫెల్ ఒప్పందంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారని, కాగ్ నివేదికను ఆయన వెలువరించేందుకు వీల్లేదని నిరసన వ్యక్తం చేశాయి.
1:05 PM, 13 Feb

రాఫెల్ యుద్ధ విమానాలలో 13 కీలకమైన మార్పులను భారత్ కోరిందని, ప్రస్తుత దేశ రక్షణ పారామితులకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారని, యుద్ధ విమానాల ఆధునికీకరణకు అయిన ఖర్చు కొత్త ఒప్పందంతో చాలా తగ్గిందని కాగ్ తెలిపింది. గత ఒప్పందం కంటే ఐదు నెలల ముందే 18 విమానాలు భారత్‌కు రానున్నాయని చెప్పింది.
1:05 PM, 13 Feb

వివాదానికి కేంద్ర బిందువైన యుద్ధ విమానాల ధరను మాత్రం నివేదికలో కాగ్ పేర్కొనలేదు. ధరలను బహిరంగపరచకూడదని రక్షణ శాఖ భావిస్తుండటమే దీనికి కారణం.
1:05 PM, 13 Feb

కాగ్ నివేదికలో వెల్లడించింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్న డీల్ కంటే మోడీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందమే బెస్ట్ అంటూ కాగ్ తెలిపింది. 126 యుద్ద విమానాల కోసం గతంలో చేసుకున్న ఒప్పందం కంటే ప్రస్తుత ప్రభుత్వం 36 విమానాల కోసం చేసుకున్న ఈ ఒప్పందం 2.8 శాతం తక్కువ అని పేర్కొంది.
12:41 PM, 13 Feb

రాష్ట్రపతి ప్రసంగానికి రాజ్యసభ ఎలాంటి చర్చలేకుండానే ధన్యవాద తీర్మానానికి ఆమోదం తెలిపింది. అలాగే, 2019-20 మధ్యంతర బడ్జెట్, వినియోగ బిల్లులకు కూడా రాజ్యసభ ఎలాంటి చర్చ లేకుండా ఆమోదం తెలిపింది.
12:27 PM, 13 Feb

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని, మోడీ బాబు పోవాలని (అధికారం నుంచి దిగిపోవాలి), దేశాన్ని కాపాడాలని, అప్పుడే అందరూ క్షేమంగా ఉంటారని తాము పార్లమెంటు సమావేశాల చివరి రోజు పార్లమెంటు ప్రాంగణంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించి కోరుకున్నామని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు.
12:16 PM, 13 Feb

కాగ్ రిపోర్ట్ నివేదిక ప్రతిపక్షాల వైఖరిని తేల్చిందని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు.
12:10 PM, 13 Feb

రాఫెల్ డీల్ అంశంపై కేంద్రానికి కాగ్ క్లీన్ చిట్ ఇచ్చింది. 2.86 శాతం తక్కువ ధరకు డీల్ కుదిరినట్లు కాగ్ నివేదిక తేల్చింది.
12:03 PM, 13 Feb

యూపీఏ హయాంలో కుదిరిన డీల్ కంటే రాఫెల్ డీల్ ఉత్తమమైనది ఏమీ కాదని, ఈ డీల్ ద్వారా కేవలం డబ్బు మాత్రమే ఆదా అయినట్లు కాగ్ రిపోర్ట్ వెల్లడించిందని అన్నారు.
12:02 PM, 13 Feb

రాఫెల్ డీల్ ఉత్తమం అని చెప్పడంపై ప్రతిపక్షాలు విమర్శలు కురిపించాయి.
11:54 AM, 13 Feb

యూపీఏ హయాంలో కుదిరిన డీల్ కంటే రాఫెల్ డీల్ ఏ రకంగా చూసిన మంచిదని, దేశానికి ఉపయోగకరమని బీజేపీ నేతలు మొదటి నుంచి చెబుతున్నారు.
11:41 AM, 13 Feb

రాజ్యసభలో ప్రవేశపెట్టిన కాగ్ రిపోర్టులో.. 126 ఎయిర్ క్రాఫ్ట్స్ ఒప్పందంతో పోల్చి చూస్తే, 36 రాఫెల్ కాంట్రాక్ట్ ద్వారా భారత్ 17.08 శాతం డబ్బును ఆదా చేసిందని ఉంది.
11:37 AM, 13 Feb

ఎదురుదాడి చేయడం, భయపెట్టడం, బుకాయింపు... ఇవి ప్రధాని నరేంద్ర మోడీ ఫిలాసపీ అని సోనియా గాంధీ మండిపడ్డారు.
11:30 AM, 13 Feb

పార్లమెంటు ప్రాంగణం ప్రతిపక్షాల నిరసనలతో దద్దరిల్లుతోంది. నిరసనలో విపక్షాలు పాల్గొన్నారు. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మోడీపై నేరుగా మండిపడ్డ సోనియా గాంధీ. మోడీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎంసీ కూడా ఆందోళనలో పాల్గొంది.
11:28 AM, 13 Feb

పార్లమెంటు ప్రాంగణంలో రాఫెల్ డీల్ పైన కాంగ్రెస్ పార్టీ నిరసనలు
11:20 AM, 13 Feb

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కాపిడల్ అక్వైజేషన్ పైన కాగ్ రిపోర్టును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఇందులో రాఫెల్ డీల్ అంశాలు కూడా ఉన్నాయి.
11:15 AM, 13 Feb

లోకసభ ప్రారంభమైన ఐదు నిమిషాలకే వాయిదా పడింది.
11:15 AM, 13 Feb

కాగ్ రిపోర్టులు పార్లమెంటుకు చేరుకున్నాయి.
READ MORE

English summary
The Budget Session of Parliament which began on 31st January will come to end today. Yesterday the Lok Sabha passed the Finance Bill, 2019 by a voice vote.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X