వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్లమెంటు క్యాంటీన్ సబ్సిడీ రద్దు: రూ. 3 నుంచి 700 వరకు, పెరిగిన ధరలు ఇలా!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పార్లమెంటు క్యాంటీన్‌లో ఎన్నో దశాబ్దాలుగా చట్టసభ సభ్యులకు అందిస్తోన్న రాయితీలకు స్వస్థి పలుకుతూ కేంద్రం ఇప్పటికే తీసుకున్న నిర్ణయం అమల్లోకి వచ్చింది. వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టడానికి కొద్ది రోజుల ముందుగానే.. లోక్‌సభ సెక్రటేరియట్ కొత్త ధరలతో కూడిన ఆహార పదార్థాల జాబితాను విడుదల చేసింది.

సబ్సిడీ రద్దైన క్రమంలో కొత్త మెనూలో ధరలు పెరుగుదల కనిపించింది. క్యాంటీన్‌లో అత్యంత చౌకగా ఒక చపాతీ రూ. 3కి లభిస్తుండగా, వెచ్ బెఫె ధర రూ. 500, నాన్‌వెజ్ బఫెను రూ. 700లకు పెంచారు. ఈ మార్పులకు సంబంధించిన వివరాలను సచివాలయం గురువారం వెల్లడించింది.

Parliament Canteen Subsidy Ends: Canteen Rates Out; New Menus Items Range From Rs 3 To Rs 700

ఇక హైదరాబాదీ మటన్ బిర్యానీని ఇప్పటి వరకు రూ. 65కే అందించగా.. ఇప్పుడు ఆ ధరను రూ. 150కి పెంచారు. అలాగే వెజ్ మీల్ ఇక నుంచి రూ. 100కు లభించనుంది. జనవరి 29 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపత్యంలో ఈ కొత్త ధరలు అమల్లోకి రానున్నట్లు తెలిపింది.

కాగా, ఈ చర్యతో ప్రతి సంవత్సరం రూ. 8 కోట్లు ఆదా కానున్నట్లు తెలుస్తోంది. ఈ క్యాంటీన్‌ను ఇక నుంచి ఇండియా టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నిర్వహించనుందని లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా తెలిపారు. కాగా, ఇప్పటి వరకు నార్తర్న్ రైల్వే దీని నిర్వహణ బాధ్యతలు చూసింది.

English summary
Ahead of the Budget Session of the Parliament, new prices of the canteen which will be run by India Tourism Development Corporation (ITDC) have been announced. Lok Sabha Speaker Om Birla had earlier announced that the food subsidy has ended.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X