వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముగిసిన సమావేశాలు: రాజ్యసభలో నిలిచిపోయిన ట్రిపుల్ తలాక్, పౌరసత్వ బిల్లులు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పార్లమెంటు ఉభయ సభలు నిరవధిక వాయిదాపడ్డాయి. బుధవారం బడ్జెట్ సమావేశాలు చివరి రోజు. కాగ్ రిపోర్ట్ ప్రవేశపెట్టిన అనంతరం లోకసభ, రాజ్యసభలు వాయిదా పడ్డాయి. మళ్లీ 2019 సార్వత్రిక ఎన్నికల అనంతరమే సమావేశాలు జరగనున్నాయి.

నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఇవి చివరి సమావేశాలు కావడంతో ఈ సమావేశాల్లోపు ట్రిపుల్ తలాక్ బిల్లును, సిటిన్‌షిప్ బిల్లును ఆమోదింప చేసేందుకు ప్రయత్నించింది. రాజ్యసభలో విపక్షాల బలం ఎక్కువగా ఉండటంతో పార్లమెంటు ఆమోదం లభించలేదు.

ట్రిపుల్ తలాక్ బిల్లుకు మోక్షం లభించలేదు

ట్రిపుల్ తలాక్ బిల్లుకు మోక్షం లభించలేదు

దీంతో, ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుకు ఈ సమావేశాల్లోను మోక్షం లభించలేదు. పౌరసత్వ సవరణ బిల్లు, ట్రిపుల్ తలాక్‌ బిల్లుపై ఎటువంటి చర్చలు జరగకుండానే రాజ్యసభ నిరవధికంగా వాయిదా పడింది. గత ఏడాది లోక్‌సభలో ఆమోదం పొందిన ట్రిపుల్ తలాక్‌ వ్యతిరేక బిల్లును రాజ్యసభ ముందుకు తీసుకు వచ్చారు.

దడ పుట్టించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సభకు హాజరు.. రాజీనామాకు ఇప్పటికీ రెడీ దడ పుట్టించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సభకు హాజరు.. రాజీనామాకు ఇప్పటికీ రెడీ

ముస్లీం మహిళల హక్కుల పరిరక్షణ కోసం

ముస్లీం మహిళల హక్కుల పరిరక్షణ కోసం

ముస్లిం మహిళల హక్కుల పరిరక్షణ కోసం తీసుకు వచ్చిన ట్రిపుల్ తలాక్ బిల్లును డిసెంబర్ నెలలో జరిగిన పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టారు. సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. దీంతో బడ్జెట్‌ సమావేశాల సమయంలో ఈ బిల్లుకు ఆమోదం లభించేలా చేయాలని ఎన్డీయే ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలిందలు.

ప్రయత్నాలు విఫలం

ప్రయత్నాలు విఫలం

ట్రిపుల్ తలాక్ బిల్లుతో పాటు పౌరసత్వ సవరణ బిల్లు (సిటిజన్‌షిప్ బిల్లు) కూడా నిలిచిపోయింది. ఈ రెండు బిల్లులు లోకసభలో ఆమోదం పొందాయి. కానీ రాజ్యసభకు వచ్చి నిలిచిపోయాయి. సార్వత్రిక ఎన్నికలలోపు ఈ బిల్లులు ఆమోదం పొందేలా చేయాలని ఎన్డీయే ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రాఫెల్ డీల్ పైన కాంగ్రెస్‌, ఇతర పార్టీల నేతలు ఆందోళన చేపట్టాయి. దీనికి తోడు ఎస్పీ నేత అఖిలేశ్ యాదవ్‌ను విమానాశ్రయంలో అడ్డుకోవడంపై రాజ్యసభలో ఆ పార్టీ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడటంతో సభను నిరవధిక వాయిదా వేశారు.

English summary
The Citizenship (Amendment) Bill and the Triple Talaq Bill lapsed in Rajya Sabha on Wednesday after the House was adjourned sine die on the last day of the Budget session. The bills had been facing strong resistance from the Opposition and some of BJP's own allies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X