వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హామీలపై రేపు: విజయసాయి, సుజన నోటీసులపై వెంకయ్య, శివప్రసాద్ వినూత్న నిరసన

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాలు సోమవారం ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమయ్యాయి. రాజ్యసభ ప్రారంభమైన కాసేపటికే వాయిదా పడింది. కాగా, సభలో తాము పలు అంశాలను లేవనెత్తుతామని కాంగ్రెస్ పార్టీ నేత మల్లికార్జున ఖర్గే అన్నారు.

కాగా, విభజన హామీల నోటీసులపై రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు స్పందించారు. రేపు (మంగళవారం) చర్చ చేపడతామన్నారు. టీడీపీ ఎంపీలు పార్లమెంటు ఒకటో నెంబర్ ప్రవేశ ద్వారం, గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఎన్డీయేకు మెజార్టీ ఉన్నప్పటికీ ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు.

Parliament Monsoon Session 2018: will raise issue in House today, says Congress leader Kharge

నోటీసులు ఇచ్చిన ఎంపీలు

Recommended Video

24న రాష్ట్రబంద్‌కు జగన్ పిలుపు

సమావేశాల ప్రారంభానికి ముందు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి రాజ్యసభలో ఏపీ విభజన హామీలపై చర్చకు నోటీసు ఇచ్చారు. అజెండాలో లేని అంశంగా చర్చ చేపట్టాలని ఆయన నోటీసులు ఇచ్చారు. సభలో విభజన హామీలపై చర్చ చేపట్టాల్సిందేనని ఆయన ఒత్తిడి తేనున్నారు.

Parliament Monsoon Session 2018: will raise issue in House today, says Congress leader Kharge

రాజ్యసభలో 267, 176 నిబంధనల కింద టీడీపీ ఎంపీ సుజనా చౌదరి నోటీసు ఇచ్చారు. విభజన హామీలపై చర్చ చేపట్టాలని పేర్కొన్నారు. పార్లమెంటు గాంధీ విగ్రహం వద్ద టీడీపీ ఎంపీలు నిరసన తెలపనున్నారు. లోకసభలో వెల్లోకి వెళ్లి నిరసన తెలపాలని టీడీపీ నిర్ణయించింది.

స్వామీ ఆగ్రహంతో ఉన్నారు.. అన్నమయ్య వేషధారణలో శివప్రసాద్

పార్లమెంట్ సమావేశాలకు ముందు చిత్తూరు ఎంపీ, టీడీపీ నేత శివప్రసాద్ తనదైన శైలిలో నిరసన తెలిపారు. ప్రధాని మోడీపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. అన్నమయ్య వేషధారణలో పార్లమెంట్‌కు వచ్చారు. అన్నమయ్య పాటలకు పారడీలు పాడారు. అదిగో అల్లదిగో పార్లమెంటు భవనం... మోసాల దిగ్గజమూ మోడీ ఉన్న స్థలమూ... అదిగో అల్లదిగో పార్లమెంటూ భవనం... అంటూ పాటలు పాడారు. నేను వెంకటేశ్వరునికి పరమ భక్తుడైన అన్నమయ్యను అని, ఎన్నో వేల పాటలను రచించిన పదకవితాపితామహుడను అని, తన స్వామి కాళ్ల వద్ద ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని హామీ ఇచ్చి, దానిని తుంగలో తొక్కిన మోడీ పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. రాష్ట్రానికి హోదా ఇవ్వాల్సిందేనని పేరడీ పాటలను పాడారు.

మోడీపై గల్లా జయదేవ్ ఆగ్రహం

తాము పార్లమెంటు సమావేశాల్లో వరుసగా అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చామని, దీనిపై ఎట్టకేలకు గత శుక్రవారం చర్చకు అంగీకరించారని, కానీ ప్రధాని మోడీ సమాధానం చెప్పలేదని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ మండిపడ్డారు. ఆయన పాత పాటే పాడారన్నారు. కాబట్టి మాకు సభలో నిరసనకు మించిన మార్గం లేదన్నారు.

English summary
After the showdown during the no-confidence motion last week, the Parliament will reconvene on Monday to discuss key legislative bills.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X