వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొలువుదీరిన 17వ లోక్‌సభ.. ప్రమాణస్వీకార సమయంలో మోడీ.. మోడీ నినాదాలు హోరెత్తిన సభ..

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : 17వ లోక్‌సభ కొలువుదీరింది. ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో ఎన్డీఏ 2 సర్కారు ఏర్పడిన అనంతరం తొలిసారి లోక్‌సభ సమావేశాలు ప్రారంభమైంది. కొత్త ఎంపీల ప్రమాణ స్వీకారంతో మొదటి రోజు సభ షురువైంది. తొలుత ప్రధాని నరేంద్రమోడీ లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ వీరేంద్రకుమార్ మోడీతో ప్రమాణం చేయించారు. మోడీ ప్రమాణ స్పీకారం చేస్తున్న సమయంలో లోక్‌సభ మోడీ మోడీ నినాదాలతో దద్దరిల్లింది. ఆ తర్వాత ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ సీనియర్ నేత సురేశ్ కొడికున్నిల్, రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా వరుసగా ప్రమాణం చేశారు.

సంఖ్య తక్కువుందన్న ఆందోళన వద్దు..విపక్షాల సలహాలు అమూల్యమైనవి: ప్రధాని మోడీసంఖ్య తక్కువుందన్న ఆందోళన వద్దు..విపక్షాల సలహాలు అమూల్యమైనవి: ప్రధాని మోడీ

సోమ, మంగళవారాల్లో ఎంపీల ప్రమాణస్వీకారం కొనసాగనుంది. కేంద్ర మంత్రులు, ప్యానెల్ ఛైర్మన్ల అనంతరం ఆంగ్ల అక్షర క్రమంలో రాష్ట్రాల ఎంపీలు ప్రమాణం చేస్తారు. ఏపీ నుంచి లోక్‌సభకు ఎన్నికైన ఎంపీల్లో పలువురు తెలుగులో ప్రమాణం చేశారు. ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం బుధవారం స్పీకర్ ఎన్నిక జరగనుంది. స్పీకర్ రేసులో మేనకాగాంధీ, రాధా మోహన్ సింగ్, అహ్లూవాలియా, జువెల్ ఓరామ్ పేర్లు వినిపిస్తున్నాయి.

Parliaments first session began today

అంతకు ముందు బీజేపీ సీనియర్ ఎంపీ వీరేంద్ర కుమార్ లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణం చేయించారు.

English summary
Prime Minister Narendra Modi was greeted by loud chants and thunderous applause this morning as he took oath as a member of the 17th Lok Sabha. several members of loksabha too oath as MPs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X