వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్లమెంటును కుదిపేసిన ఢిల్లీ అల్లర్ల అంశం... ఇలాగైతే సమావేశాలను రద్దు చేస్తానన్న స్పీకర్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పార్లమెంటులో మళ్లీ అదే సీన్ రిపీట్ అయ్యింది. ఉభయసభలు వాయిదా పడ్డాయి.బడ్జెట్ సమావేశాల సందర్భంగా 11 గంటలకు ప్రారంభమైన పార్లమెంట్‌ను విపక్షాలు అడ్డుకునే ప్రయత్నం చేశాయి. విపక్ష పార్టీ సభ్యులు లోక్‌సభ స్పీకర్ వెల్‌లోకి దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఢిల్లీ అల్లర్లకు సంబంధించి విపక్ష పార్టీ సభ్యులు నిరసన తెలిపారు. ఢిల్లీ అలర్లకు సంబంధించి చర్చ చేపట్టాలంటూ విపక్ష పార్టీ సభ్యులు డిమాండ్ చేశారు. అయితే ఇందుకు స్పీకర్ ముందుగా సభ్యులు తమ స్థానాల్లో కూర్చోవాలంటూ చెప్పారు. కానీ సభ్యులు ఎంత సేపటికి వినకపోవడంతో స్పీకర్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

సోమవారం రోజున పార్లమెంటును కుదిపేసిన ఢిల్లీ అల్లర్ల ఘటన మంగళవారం రోజున కూడా కొనసాగింది. లోక్‌సభ ప్రారంభం కాగానే విపక్ష పార్టీ సభ్యులు స్పీకర్ పోడియం దగ్గరకు దూసుకొచ్చే ప్రయత్నం చేయగా వారిపై స్పీకర్ ఓంబిర్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రమశిక్షణ తప్పితే సభ్యులను సస్పెండ్ చేసేందుకు వెనకాడబోనని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అయినప్పటికీ విపక్ష పార్టీ సభ్యులు పట్టించుకోలేదు. ఢిల్లీ అల్లర్లపై చర్చ జరగాల్సిందేనంటూ పట్టుబట్టారు. ఈ క్రమంలోనే ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్ ఓంబిర్లా... సభ్యులు తమ సీట్లలో కూర్చోకుంటే సమావేశాలనే వాయిదా వేస్తానంటూ గట్టిగా హెచ్చరించారు. మధ్యాహ్నం 12 గంటల వరకు సభను వాయిదా వేశారు.

Parliament sessions: Both houses adjourn over Delhi riots

ఇక రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి తలెత్తింది. ప్రారంభమైన కొద్ది సేపటికే సభను ఢిల్లీ అలర్ల అంశం కుదిపేయడంతో సభను రాజ్యసభ ఛైర్మెన్ వెంకయ్యనాయుడు మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు. సభ ప్రారంభం కాగానే అధికార విపక్ష పార్టీల సభ్యుల మధ్య చిన్నపాటి మాటల యుద్ధమే నడిచింది. సభ క్రమశిక్షణతో వ్యవహరించాలని వెంకయ్యనాయుడు పదేపదే కోరారు. అయినప్పటికీ విపక్ష పార్టీల సభ్యులు వినకపోవడంతో సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

Recommended Video

Rajya Sabha Election Schedule Released,Political Heat Starts In Telugu States! | Oneindia Telugu

అంతకుముందు బీజేపీ ఎంపీలతో భేటీ అయిన ప్రధాని సభలో సభ్యులు వ్యవహరించాల్సిన తీరును వివరించారు. అభివృద్దే ప్రభుత్వం మంత్ర అని చెప్పారు. శాంతి, ఐక్యత, సామరస్యత ఉంటేనే అభివృద్ధి సాధ్యమని హితబోధ చేశారు. సమాజంలో శాంతి నెలకొనేందుకు ఎంపీలు కీలక పాత్ర పోషించాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. కొన్ని పార్టీలకు రాజకీయప్రయోజనాలు ముఖ్యమని చెప్పిన ప్రధాని... బీజేపీకి మాత్రం దేశప్రయోజనాలే ముఖ్యమని చెప్పారు.

English summary
Both the Lok Sabha and the Rajya Sabha saw disruption and adjournments on Tuesday.In the Lok Sabha, MPs of the Congress and the ruling BJP pushed and shoved each other over the Opposition’s insistence that Home Minister Amit Shah should resign, taking responsibility for last week’s riots in Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X