వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్లమెంటు శీతాకాల సమావేశాలు: చారిత్రక ఘట్టాలకు సాక్షిభూతంగా నిలిచిన రాజ్యసభ

|
Google Oneindia TeluguNews

పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం ;ప్రారంభమయ్యాయి. అయోధ్య భూవివాదంలో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చిన తర్వాత తొలి పార్లమెంట్ సమావేశాలు కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సారి సమావేశాల్లో అధికార విపక్ష పార్టీల మధ్య వాడీవేడీ చర్చ జరిగే అవకాశముంది.ఈ సందర్భంగా కేంద్రం 27 బిల్లులను సభలో ప్రవేశ పెట్టనుంది. రాఫెల్ జమ్మూకశ్మీర్ అంశాలను అస్త్రాలుగా చేసుకుని విపక్షాలను అధికార బీజేపీ ఇరుకున పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక అధికార పక్షం, విపక్షాల మధ్య జమ్ము కశ్మీర్ అంశం, ఆర్థిక మాంద్యం, నిరుద్యోగం, సిటిజెన్‌షిప్ బిల్లులు అంశాలపై వాడీవేడీ చర్చ జరిగే అవకాశం ఉంది. నవంబర్ 18 నుంచి డిసెంబర్ 13 వరకు పార్లమెంటు సమావేశాలు జరుగుతాయి.

Parliament sessions Live: Heated debate expected on the first day between the ruling and opposition parties

తొలిరోజు పార్లమెంటు శీతాకాల సమావేశాలు మినిట్‌-టూ - మినిట్ హైలైట్స్ మీకోసం:

Newest First Oldest First
4:00 PM, 18 Nov

బీజేపీ అవలంబిస్తున్న విధానాలతోనే ఆర్థిక మాంద్యం తలెత్తింది:మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్
3:58 PM, 18 Nov

భారత్‌లో నెలకొన్న ఆర్థిక మాంద్యంపై చిన్నపాటి చర్చకు సమయం కేటాయించాలంటూ రాజ్యసభ ఛైర్మెన్ వెంకయ్యనాయుడకు నోటీసులు ఇచ్చిన టీఎంసీ శివసేన ఎంపీలు
3:08 PM, 18 Nov

సభలో ఎన్సపీ బీజేపీ ఎంపీలను కొనియాడిన ప్రధాని మోడీ. వారెప్పుడూ వెల్‌లోకి వచ్చి తమ నిరసనలు తెలపలేదు. చర్చలో పాల్గొన్నారు. వారినుంచి తనతో పాటు ఇతర పార్టీలు కూడా నేర్చుకోవాల్సి ఉంది: ప్రధాని మోడీ
2:45 PM, 18 Nov

1991 నుంచి ఆగస్ట్ హౌస్‌కు తాను ప్రాతినిధ్యం వహిస్తున్నాను: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్
2:44 PM, 18 Nov

సభ్యులందరికీ ధన్యవాదాలు అంటూ ప్రసంగం ముగించిన ప్రధాని మోడీ
2:44 PM, 18 Nov

కాలంతోపాటు మారేందుకు రాజ్యసభ కృషిచేస్తోంది: ప్రధాని మోడీ
2:43 PM, 18 Nov

కశ్మీర్‌కు సంబంధించి ఆర్టికల్ 370 రద్దు సమయంలో కూడా రాజ్యసభకు తమ ప్రభుత్వం అదిక ప్రాధాన్యం ఇచ్చింది: ప్రధాని మోడీ
2:42 PM, 18 Nov

త్రిపుల్ తలాక్, జీఎస్టీ లాంటి చట్టాలు ఎగువసభ ఆమోదంతోనే దేశంలో అమల్లోకి వచ్చాయి: ప్రధాని మోడీ
2:39 PM, 18 Nov

గొప్ప నాయకులు రాజ్యసభ నుంచి ప్రాతినిధ్యం వహించారు
2:39 PM, 18 Nov

దేశాభివృద్ధి కోసం రాజ్యసభ తన పాత్రను పోషిస్తోంది: ప్రధాని మోడీ
2:38 PM, 18 Nov

సెకండ్ హౌస్.. సెకండరీ సభ కాదని మాజీ ప్రధాని అటల్ బీహరి వాజ్‌పేయి చెప్పారు: ప్రధాని మోడీ
2:35 PM, 18 Nov

బీఆర్ అంబేద్కర్ రాజ్యసభ సభ్యునిగానే పార్లమెంట్‌కు వచ్చారు: మోడీ
2:32 PM, 18 Nov

మహిళ సాధికారతకు కట్టుబడి ఉన్నామని మోడీ స్పష్టీకరణ
2:31 PM, 18 Nov

ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధం లేనివారికి రాజ్యసభ అవకాశం కల్పిస్తోంది: మోడీ
2:27 PM, 18 Nov

రాజ్యసభలో అనుభవజ్ఞులు, మేధావులు ఆశీనులవుతారు: ప్రధాని మోడీ
2:26 PM, 18 Nov

రాజ్యసభ ఆవిర్భానికి కారణం బాబా సాహెబ్ అంబేద్కర్, ఇతర మహానేతలు కారణం: మోడీ
2:26 PM, 18 Nov

చారిత్రక ఘట్టాలకు రాజ్యసభ సాక్షిభూతంగా నిలిచింది: ప్రధాని మోడీ
2:25 PM, 18 Nov

పార్లమెంట్‌లో లోక్‌సభ, రాజ్యసభ చరిత్ర సృష్టించాయి, కీలక బిల్లులకు ఆమోదం తెలిపాయి: మోడీ
2:24 PM, 18 Nov

భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగి ఉంది: మోడీ
2:23 PM, 18 Nov

రాజ్యసభకు మహా నేతలు ప్రాతినిధ్యం వహించారు: మోడీ
2:21 PM, 18 Nov

రాజ్యసభ సభ్యులందరికీ అభినందనలు: మోడీ
2:21 PM, 18 Nov

భారత అభివృద్ధికి రాజ్యసభ ప్రతీక: మోడీ
2:21 PM, 18 Nov

250వ సభ జరుపుకుంటున్న రాజ్యసభకు అభినందనలు: మోడీ
2:20 PM, 18 Nov

రాజ్యసభ 250వ సమావేశంలో మాట్లాడుతున్న ప్రధాని నరేంద్ర మోడీ
2:19 PM, 18 Nov

రాజ్యసభ 250వ సమావేశాల సందర్భంగా ప్రత్యేక చర్చలో చైర్మన్ వెంకయ్యనాయుడు
2:19 PM, 18 Nov

నిరక్షరాస్యత, అభివృద్ధి, పేదరికం తదితర కీలక అంశాలను రాజ్యసభ వేదికగా చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు: వెంకయ్యనాయుడు
2:16 PM, 18 Nov

1952 ఆగస్టు నుంచి రాజ్యసభ అమల్లోకి వచ్చింది: చైర్మన్ వెంకయ్య నాయుడు
2:01 PM, 18 Nov

రాజ్యసభలో మార్షల్స్ యూనిఫారం మార్పు
1:41 PM, 18 Nov

బారికేడ్లు దాటి వచ్చిన విద్యార్థులు, ఢిల్లీ పోలీసుల నుంచి సీఆర్‌పీఎఫ్ చేతుల్లోకి భద్రత, పలువురు విద్యార్థులు అరెస్టు
1:10 PM, 18 Nov

ఫరూఖ్ అబ్దుల్లాను గృహనిర్బంధంలో ఉంచి 108 రోజులు గడుస్తున్నాయి. నిరసన తెలపడం ఆయనకు రాజ్యాంగం కల్పించిన హక్కు: కాంగ్రెస్ ఎంపీ రంజన్ చౌధరి
READ MORE

English summary
The Winter Session of Parliament, which is all set to start on Monday, is likely to witness heated discussions as the Opposition looks to raise issues of economic slowdown, job crisis and the lockdown in Jammu and Kashmir as the Modi dispensation seeks to push through the contentious Citizenship (Amendment) Bill.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X