• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
LIVE

పార్లమెంటు శీతాకాల సమావేశాలు: సాగుచట్టాల రద్దు నుంచి క్రిప్టోకరెన్సీ వరకు..కీలక బిల్లులు ఇవే..!

|
Google Oneindia TeluguNews

పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబర్ 29న ప్రారంభం అవుతున్నాయి. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పలు బిల్లులను ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది. మొత్తంగా 26 బిల్లులను ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెడుతుంది కేంద్రం. ఇందులో మోదీ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని తీసుకువచ్చిన సాగు చట్టాలను తిరిగి రద్దు చేస్తున్నట్లుగా తెలుపుతూ బిల్లు పెట్టనుంది. ఇక క్రిప్టోకరెన్సీ బిల్లును కూడా సభలో ప్రవేశపెట్టనుంది. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 23 వరకు శీతాకాల సమావేశాలు జరుగుతాయి.

Parliament winter sessions 2021 live updates in telugu: From repealment of farmlaws to crypto currency bills to be tabled in the house

క్రిప్టో కరెన్సీ మరియు డిజిటల్ కరెన్సీల రెగ్యులైజేషన్ 2021 బిల్లును కేంద్రం ప్రవేశపెడుతుంది. ఈ బిల్లును పాస్ చేయించడం ద్వారా దేశంలో ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలను రద్దు చేస్తున్నట్లు అవుతుంది. బిల్లు పాసయ్యాక అవి చెల్లుబాటులో ఉండవు. ఇక అదే సమయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసే డిజిటల్ కరెన్సీ అధికారిక వినియోగం కోసం మార్గం సుగుమం చేయనుంది. ఇక పార్లమెంటు శీతాకాల సమావేశాలకు సంబంధించి మినిట్‌-టూ-మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం

Newest First Oldest First
10:07 AM, 2 Dec
లోక్‌సభలో ఈ రోజు కరోనాపై చర్చ జరగనుంది
10:06 AM, 2 Dec
పెరుగుతున్న ద్రవ్యోల్బణంపై వాయిదా తీర్మానం ఇచ్చిన కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ
10:06 AM, 2 Dec
బిజినెస్ నోటీస్‌ను రూల్ 267 కింద సస్పెండ్ చేసి పెరుగుతున్న ధరలపై చర్చ చేపట్టాలంటూ లోక్‌సభలో నోటీసులు ఇచ్చిన కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్
10:04 AM, 2 Dec
కులగనణ పై చర్చకు జీరోహవర్ నోటీసు ఇచ్చిన రాజ్యసభ ఎంపీ మనోజ్ కుమార్ ఝా
1:02 PM, 1 Dec
రాజ్యసభలో రసాభాస. మధ్యాహ్నం 2 గంటలకు సభ వాయిదా
9:56 AM, 1 Dec
ఎల్పీజీ సిలిండర్ ధరల పెంపు, అధిక ద్రవ్యోల్బణం రేటుపై లోక్‌సభలో వాయిదా తీర్మానం ఇచ్చిన కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ
9:53 AM, 1 Dec
మరికాసేపట్లో ప్రారంభం కానున్న మూడవ రోజు పార్లమెంటు శీతాకాల సమావేశాలు
1:02 PM, 30 Nov
క్రిప్టో కరెన్సీ చాలా రిస్క్‌తో కూడుకున్నది. అందుకే ఆర్బీఐ సెబీ ద్వారా అవగాహన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఈ మేరకు త్వరలోనే బిల్లును ప్రవేశపెడతాం:కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్
11:59 AM, 30 Nov
పార్లమెంటులోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ ఎంపీలు
11:49 AM, 30 Nov
కాంగ్రెస్ పార్టీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేయడంతో సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసిన స్పీకర్
11:49 AM, 30 Nov
రాజ్యసభలో సస్పెండ్ అయిన 12మంది ఎంపీలను తిరిగి సభలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వాకౌట్ చేసిన విపక్షాలు
11:03 AM, 30 Nov
లఖీంపూర్‌ఖేరీ ఘటనపై చర్చ పెట్టాలంటూ వాయిదా తీర్మానం ఇచ్చిన సీపీఎం ఎంపీ ఆరిఫ్
11:02 AM, 30 Nov
12 మంది రాజ్యసభ ఎంపీలను సస్పెండ్ చేసి విపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది: మల్లికార్జున ఖర్గే
10:27 AM, 30 Nov
12 మంది విపక్ష పార్టీల సభ్యుల సస్పెన్షన్ కు నిరసన తెలియజేయనున్న ప్రతిపక్ష పార్టీలు
10:27 AM, 30 Nov
తెలంగాణ ధాన్యం కొనుగోలు పై కేంద్ర వివక్షతకు నిరసనగా వాయిదా తీర్మానంతో పాటు ఉభయసభలలో ఆందోళనను కొనసాగించనున్న టీఆర్ఎస్ పార్టీ.
10:27 AM, 30 Nov
ధరల పెరుగుదల అంశం పై చర్చను కోరుతూ వాయిదాతీర్మానం నోటీసు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ
10:26 AM, 30 Nov
మరికాసేపట్లో ప్రారంభం కానున్న పార్లమెంటు రెండో రోజు సమావేశాలు
3:40 PM, 29 Nov
ఢిల్లీ
12 మంది రాజ్యసభ సభ్యులు సస్పెండ్ అయ్యారు. ఎలామరం కరీం-సీపీఎం, ఫులో దేవి నేతం, ఛాయా వర్మ, ఆర్ బోరా, రాజమణి పటేల్, సయ్యద్ నాజిర్ హుస్సేన్, అఖిలేష్ ప్రసాద్ సింగ్-కాంగ్రెస్, బినోయ్ విశ్వం-సీపీఐ, డోలా సేన్, శాంతి ఛత్రి-తృణమూల్ కాంగ్రెస్, ప్రియాంక చతుర్వేది, అనిల్ దేశాయ్- శివసేన సస్పెండ్ అయ్యారు.
3:36 PM, 29 Nov
ఢిల్లీ
వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గడానికి ప్రధాన కారణం ఉప ఎన్నికల్లో ఎదురైన చేదు ఫలితాలేనని వ్యాఖ్యానించిన ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ. పౌరసత్వ సవరణ చట్టాన్ని కూడా కేంద్రం ఇదే తరహాలో ఉపసంహరించుకోవాలని డిమాండ్.
2:47 PM, 29 Nov
ఢిల్లీ
మూడు వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లుపై ఉభయసభల్లో ఎలాంటి చర్చను కేంద్ర ప్రభుత్వం చేపట్టకపోవడాన్ని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తప్పు పట్టారు. దీనిపై చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం భయపడుతోందని విమర్శించారు.
2:17 PM, 29 Nov
ఢిల్లీ
రాజ్యసభలోనూ ఆమోదం పొందిన మూడు వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లు. లోక్‌సభ తరహాలో ఇక్కడా దీనిపై ఎలాంటి చర్చ సాగలేదు. మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఈ బిల్లును టేబుల్ చేసిన కొద్దిసేపటికే అది ఆమోదం పొందినట్లు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ప్రకటించారు.
2:14 PM, 29 Nov
ఢిల్లీ
మంగళవారం నాటికి వాయిదా పడ్డ లోక్‌సభ. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమౌతుంది. మధ్యాహ్నం 2 గంటలకు సభ పునఃప్రారంభమైన తరువాత సభ సజావుగా సాగలేదు. సభా కార్యకలాపాలు సాగనివ్వకుండా ప్రతిపక్ష సభ్యులు అడ్డు పడ్డారు. దీనితో స్పీకర్ ఓం బిర్లా సభను మంగళవారానికి వాయిదా వేశారు.
2:10 PM, 29 Nov
ఢిల్లీ
మూడు వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్.
1:48 PM, 29 Nov
ఢిల్లీ
పార్లమెంట్ శీతాకాల సమావేశాలను సజావుగా కొనసాగేలా సహకరించాలంటూ సభ్యులకు సూచించిన రాజ్యసభ ఛైర్మన్ ఎం వెంకయ్య నాయుడు. చర్చల ద్వారా అనేక సమస్యలు పరిష్కారమౌతాయని వెల్లడి.
1:26 PM, 29 Nov
ఢిల్లీ
మూడు వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లుపై డిస్కషన్స్ చేపట్టాల్సిందే. ఇదేదో మన్ కీ బాత్ తరహాలో ప్రోగ్రామ్ కాదు. వ్యవసాయ చట్టాల రద్దుపై చర్చ కోసం పట్టుబడతాం: లోక్‌సభలో కాంగ్రెస్ సభా పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి
1:17 PM, 29 Nov
ఢిల్లీ
రాజ్యసభలో వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లుపై చర్చించి తీరాల్సిందే. లోక్‌సభలో నిబంధనలకు విరుద్ధంగా ఈ బిల్లు ఆమోదం పొందింది. రైతులు తమవెంట ఉన్నారని కేంద్ర ప్రభుత్వం చెప్పుకొనే ప్రయత్నం చేస్తోంది- రాజ్యసభలో కాంగ్రెస్ సభా పక్ష నేత మల్లికార్జున ఖర్గె
1:02 PM, 29 Nov
ఢిల్లీ
బిట్‌కాయిన్ లావాదేవీలకు సంబంధించిన ఎలాంటి డేటా తమ వద్ద లేదని ప్రకటించిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ. దీన్ని కరెన్సీగా అధికారికంగా గుర్తించే ప్రతిపాదనలు కూడా తమ వద్ద లేవని స్పష్టీకరణ. లోక్‌సభలో లిఖితపూరకంగా ప్రశ్నకు సమాధానం ఇచ్చిన ఆర్థిక శాఖ.
12:59 PM, 29 Nov
ఢిల్లీ
మధ్యాహ్నం 2 గంటలకు రాజ్యసభ సమక్షానికి రానున్న మూడు వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లు. ఈ విషయాన్ని వెల్లడించిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. కొద్ది సేపటి కిందటే ఇది లోక్‌సభ ఆమోదం పొందింది.
12:40 PM, 29 Nov
ఉత్తర్‌ప్రదేశ్
మూడు వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందడాన్ని స్వాగతించిన భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేష్ తికాయత్. ఇతర డిమాండ్లను పరిష్కరించేంత వరకు ఉద్యమం కొనసాగిస్తామని వెల్లడి. ఉత్తర ప్రదేశ్‌లోని కౌషంబిలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
12:34 PM, 29 Nov
ఢిల్లీ
ఎలాంటి చర్చ లేకుండానే లోక్‌సభ ఆమోదం పొందిన మూడు వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లు. దీన్ని ఆమోదించినట్లు ప్రకటించిన స్పీకర్ ఓం బిర్లా. ఈ బిల్లుపై చర్చ జరగాలంటూ పట్టుబట్టిన ప్రతిపక్ష పార్టీలు. నిరాకరించిన స్పీకర్. సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా.
READ MORE

English summary
Parliament winter sessions will begin on 29th November and end on 23 rd December. As many as 26 bills will be tabled during this sessions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X