వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేడు పాక్షిక సూర్యగ్రహణం... గ్రహణం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు

|
Google Oneindia TeluguNews

ఆగష్టు 11న పాక్షిక సూర్యగ్రహణం రానుంది. మొత్తం మూడున్నర గంటల పాటు ఈ సూర్యగ్రహణం ఉండనుంది. భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5:02 గంటల వరకు ఉంటుంది.

భూమికి సూర్యుడికి మధ్యలో చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ సమయంలో చంద్రుడి నీడ భూమిపై పడటం తద్వారా సూర్యకిరణాలు భూమిపైకి చేరకుండా అడ్డుకుంటుంది. ఈ ప్రక్రియనే సూర్యగ్రహణం అంటాము. ఇక సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు ప్రయాణించినప్పుడు అదే సమయంలో భూమి లూనార్ పెనంబ్రా పై పయనించినప్పుడు పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ సమయంలో సూర్యడిని చంద్రుడు పూర్తిగా అడ్డుకోదు కాబట్టి దీన్ని పాక్షిక సూర్యగ్రహణం అని అంటాము.

 Partial solar eclipse to occur on August 11th

గ్రహణాన్ని వీక్షించాలంటే ఎప్పుడూ నేరుగా వీక్షించకూడదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గ్రహణాన్ని వీక్షించేందుకు ప్రత్యేక కళ్లజోడు కానీ నెగిటివ్ ఫిల్మ్‌కానీ ఉపయోగించాలని వారు సూచిస్తున్నారు. ఇలా నేరుగా చూడటం వల్ల కంటి చూపు దెబ్బ తింటుందని చెబుతున్నారు. సూర్యగ్రహణంపై చాలా ఆసక్తి కర విషయాలున్నాయి. సూర్యగ్రహణం ఎప్పుడూ అమావాస్య రోజునే వస్తుంది.ఎందుకంటే సూర్యగ్రహణం ఏర్పడాలంటే చంద్రడు భూమికి సూర్యుడికి మధ్యలో ఉండాలి. గ్రహణం ఉండే సమయం ఎప్పుడూ ఒకలా ఉండదు. ఎందుకంటే సూర్యుడి నుంచి భూమి ఎప్పుడూ ఒకే దూరంలో ఉండదు అనేది ఒక కారణమైతే.. చంద్రుడు కూడా భూమికి ఎప్పుడూ ఒకే దూరంలో ఉండదు అనేది రెండో కారణం.

ఇప్పటి వరకు అత్యధిక సూర్యగ్రహణాలు చైనాలో నమోదయ్యాయి. గ్రహణం అనేది భగవంతుడి నుంచి వచ్చే హెచ్చరిక అని ఆ సమయంలో ప్రజలు చేసిన పాపాలకు శిక్షించబడుతారని పూర్వం నమ్మేవారు. గ్రీకులో గ్రహణంకు అర్థం పడిపోవడం. గ్రహణం గురించి తెలుసుకునేందుకు కెనడా వ్యోమగామి జే.డబ్ల్యూ క్యాంబెల్ ప్రపంచవ్యాప్తంగా తిరిగి 12 వేర్వేరు గ్రహణాలను స్టడీ చేశారు. ఇక చైనా పరిభాషలో సూర్యగ్రహణాన్ని షి అని పిలుస్తారు. అంటే దాని అర్థం తిను అని. పూర్వం గ్రహణం ఏర్పడినప్పుడు చైనీయులు పెద్ద డప్పులను వాయించేవారు. అలా వాయించడం వల్ల సూర్యుడిని తినేందుకు వస్తున్న ఓ స్వర్గ శునకం డప్పు శబ్దం విని బెదిరిపోయి సూర్యుని దగ్గరకు రాదనేది వారి నమ్మకం. గతేడాది ఆగష్టు 21న అమెరికా ఖండంలో సంపూర్ణ సూర్యగ్రహణం దర్శనమిచ్చింది. గత 38 ఏళ్లలో అదే సంపూర్ణ సూర్యగ్రహణం కావడంతో దాన్ని ది గ్రేట్ అమెరికన్ ఎక్లిప్స్ అని పిలిచారు.

English summary
A partial solar eclipse shall take place on August 11, and will last for around 3 hours 30 minutes. The eclipse will begin from 1:32 PM Indian Standard Time (IST) and last till 5:02 PM IST.A solar eclipse takes place when the moon passes in a direct line between the earth and the sun. The moon’s shadow travels above the earth’s surface, and the sun’s light (as seen from earth) is blocked out.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X