వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉరుములు, మెరుపులతో స్వల్పంగా దెబ్బతిన్న అపురూప కళాఖండం..

|
Google Oneindia TeluguNews

అపురూప కళాఖండం తాజ్‌మహల్ స్వల్పంగా దెబ్బతింది. తాజ్‌మహల్‌కి పర్యావరణ ముప్పు ఉండగా.. ఉరుములు, మెరుపులు ప్రభావం చూపాయి. శుక్రవారం రాత్రి ఉరుములతో ప్రధాన సమాధి మార్బుల్, ఎర్ర ఇసుకరాయి దెబ్బతిందని అధికారులు పేర్కొన్నారు. అంతేకాదు సమీపంలో ఉన్న చెట్లు వేర్లు బయటకొచ్చాయని.. తాజ్‌మహల్‌లో గల ఒక తలుపు కూడా స్వల్పంగా పలుగు వచ్చిందని పురవాస్తు శాఖ అధికారి బసంత్ కుమార్ తెలిపారు.

12 అంగుళాల వెండి 'కీ’తో ఆగ్రా ముఖద్వారం తెరవనున్న ట్రంప్, తాజ్‌మహల్ రూపంలో తాళం చెవి..12 అంగుళాల వెండి 'కీ’తో ఆగ్రా ముఖద్వారం తెరవనున్న ట్రంప్, తాజ్‌మహల్ రూపంలో తాళం చెవి..

సమాధిలో ఉన్న పై కప్పు కూడా దెబ్బతిందని వివరించారు. మెహతాబ్ బాగ్, మక్కారాలో ఒక చెట్టు నెలకొరింని పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి మెయిన్ పురి, ఆగ్రా, లఖీమ్ పూర్ ఖేరీ, ముజఫర్ నగర్ జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసిందని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఉరుముల వల్ల చనిపోయిన కుటుంబసభ్యులకు పరిహారాన్ని సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు, గాయపడ్డవారికి వైద్య చికిత్స అందజేస్తామని తెలిపారు.

Parts of Taj Mahal damaged in thunderstorm..

Recommended Video

Namaste Trump: Trump Once Had A 'Taj Mahal' Of His Own, Now Got Emotional

మరికొద్దిరోజులు కూడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తోందని అధికారులు తెలిపారు. ఏకాంత ప్రదేశాలు.. చెట్లు ఉన్న చోట్ల ప్రజలు ఉండొద్దని సూచించారు. అప్రమత్తంగా ఉండాలని కోరారు.

English summary
marble railing of the taj mahal main mausoleum and red sandstone railings suffered damage due to thunderstorm, officials said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X