• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోనియాగాంధీ పావులు... ప్రియాంక అంగీకారం?? ఆ రాష్ట్రంపై పట్టుకు పడుతున్న అడుగులు

|
Google Oneindia TeluguNews

ఈనెల 21వ తేదీ నుంచి కాంగ్రెస్ పార్టీకి ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. రాహుల్ గాంధీ దేశ‌వ్యాప్తంగా నిర్వ‌హిచ‌బోతున్న జైబోడో యాత్ర‌పై దృష్టిసారించ‌డంతో పార్టీ ప‌గ్గాలు స్వీక‌రిస్తారా? లేదా? అనేదానిపై స్ప‌ష్టత రాలేదు. గాంధీయేత‌ర వ్య‌క్తికి అవ‌కాశం ఇవ్వాల‌నుకుంటున్న‌ప్ప‌టికీ పార్టీ బ‌లోపేతానికి అది ఏ మాత్రం స‌హ‌క‌రించ‌ద‌ని కొంద‌రు సీనియ‌ర్ నేత‌లు చెబుతున్నారు. దీంతో అధ్య‌క్ష స్థానానికి ఎవ‌రు ఎంపిక‌వుతార‌నేది కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ప్ర‌శ్నార్థ‌కంగా మారింది.

ప్రియాంకపై దృష్టిసారించిన సోనియా

ప్రియాంకపై దృష్టిసారించిన సోనియా

ద‌క్షిణాది రాష్ట్రాల్లో స‌రైన నాయ‌క‌త్వ‌లేమి కొర‌డ‌వ‌డంవ‌ల్ల బ‌లం ఉండి కూడా నిరూపించుకోలేక‌పోతున్నామ‌ని, ఓట్లుగా మ‌లుచుకోలేక‌పోతున్నామ‌ని పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అభిప్రాయంగా ఉంది. బ‌ల‌మైన రాష్ట్రాల్లో పార్టీ ప‌ట్టు పోకుండా చూడాలంటే బ‌ల‌మైన నేత‌ల అవ‌స‌రాన్ని ఆమె గుర్తించారు. తాజాగా సోనియా ప్రియాంక‌గాంధీకి ద‌క్షిణాది రాష్ట్రాల ఇన్‌ఛార్జి గా నియ‌మించాల‌ని భావిస్తున్న‌ట్లు పార్టీ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

ఎన్నిక‌ల స‌మ‌యంలోకానీ, ఎన్నిక‌ల్లోపుకానీ ఆమెకు ప‌ద‌విని క‌ట్ట‌బెట్టాల‌నే యోచ‌న చేస్తున్న‌ట్లు స‌మాచారం. మంచి వాగ్ధాటి, ఇందిరాగాంధీ పోలిక‌ల‌తో ఉండే ప్రియాంక‌కు ప్ర‌జ‌ల్లో ఆద‌ర‌ణ ఎక్కువ‌గా ఉంటుంది. మొద‌టి నుంచి కాంగ్రెస్ పార్టీ శ్రేణుల‌కు కూడా ఆమెపై ఎంతో న‌మ్మ‌కం ఉంచేవారు. వారి న‌మ్మ‌కాన్ని వ‌మ్ము కాకుండా చూడాల్సిన బాధ్య‌త‌ను అధిష్టానం స్వీక‌రించింది. కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీలో ఈ నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

కర్ణాటకు సులువుగా దక్కించుకోవచ్చు..

కర్ణాటకు సులువుగా దక్కించుకోవచ్చు..

ద‌క్షిణాదిలో కీల‌క రాష్ట్ర‌మైన క‌ర్ణాట‌క‌కు త్వ‌ర‌లోనే ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. కాంగ్రెస్ చెమ‌టోడిస్తే ఈసారి ఎన్నిక‌ల్లో గెలుపు సునాయాస‌మ‌వుతుంద‌ని భావిస్తున్నారు. తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రాన్ని ఇచ్చికూడా రెండుసార్లు అధికారంలోకి రాలేక‌పోవ‌డానికి ఆ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేక‌పోతున్నాయి.

దీనికి కార‌ణం పార్టీలోని నేత‌ల మ‌ధ్య ఉన్న అంత‌ర్గ‌త ఉమ్ములాటే కార‌ణ‌మ‌ని నివేదిక తెప్పించుకుంది. వీరి వివాదాల‌ను ప‌రిష్క‌రించి ఎన్నిక‌ల‌కు పార్టీని స‌మాయ‌త్తం చేయాలంటే ప్రియాంకే స‌రైన వ్య‌క్తి అని సోనియా భావిస్తున్నారు. అంతేకాకుండా కేర‌ళ‌లో వ‌రుస‌గా రెండుసార్లు ఓట‌మిపాలైన‌ప్ప‌ట‌కీ ఈసారి ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించాల‌నే దిశ‌గా కాంగ్రెస్ అడుగులు ప‌డుతున్నాయి. త‌మిళ‌నాడులోను బ‌ల‌మైన డీఎంకేతో మిత్ర‌ప‌క్షంగా కొన‌సాగుతోంది.

Recommended Video

మునుగోడు ఉప ఎన్నిక... కాంగ్రెస్ కార్యాచరణ *Politics | Telugu OneIndia
సాంప్రదాయ ఓటుబ్యాంకు కోసం

సాంప్రదాయ ఓటుబ్యాంకు కోసం


ఆంధ్ర‌ప్ర‌దేశ్ విష‌యానికొస్తే కాంగ్రెస్ పార్టీకి సాంప్ర‌దాయ ఓటుబ్యాంకు ఇప్ప‌టికీ ఎటు మ‌ళ్ల‌లేద‌ని, కొంద‌రు మాత్రం వైసీపీవైపు మొగ్గుచూపిన‌ట్లు కాంగ్రెస్ అంచ‌నా వేస్తోంది. దీన్ని నివారించాల‌టే రాబోయే ఎన్నిక‌ల్లో ఓటుబ్యాంకు శాతం పెంచుకునే దిశ‌గా ప్ర‌యత్నాలు సాగిస్తోంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు ఎన్నికలు జరిగినప్పటికీ బీజేపీ కంటే కాంగ్రెస్ కే ఏపీలో ఓటింగ్ శాతం అధికంగా ఉంది. రానున్న ఎన్నికల్లో అది 10 శాతంగా ఉండాలనే లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నారు.

English summary
Recently, party circles have revealed that they want to appoint Priyanka Gandhi as the in-charge of southern states.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X