• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ప‌థ నిర్దేశ‌కులు..ప‌త‌నం అయ్యారు! త‌మ‌ను తాము గెలిపించుకోలేక‌!

|

అమ‌రావ‌తి: పార్టీని విజ‌య తీరాల వైపు న‌డిపించాల్సిన అధ్యక్షులు ఘోరంగా ఓడిపోవ‌డం ఈ ఎన్నిక‌ల్లో చోటు చేసుకున్న మ‌రో విచిత్ర ప‌రిస్థితి. త‌మ‌ను తాము గెలింపించుకోలేక ప‌త‌నం అయ్యారు. ప్ర‌త్య‌ర్థుల చేతుల్లో చావుదెబ్బ‌లు తిన్నారు. ఒక‌రు కాదు, ఇద్ద‌రు కాదు.. న‌లుగురు అధ్య‌క్షుల‌ది ఇదే ప‌రిస్థితి. కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ కూడా ఓట‌మి పాలు కావ‌డం అస‌లు ట్విస్ట్‌.

ముఖ్య‌మంత్రులుగా ఉండీ వార‌సుల‌ను గెలిపించుకోలేకపోయారు!

కిమిడీ.. ఏమిటీ దుస్థితి?

కిమిడీ.. ఏమిటీ దుస్థితి?

తెలుగుదేశం స్వ‌యం ప్ర‌క‌టిత జాతీయ పార్టీ. రాష్ట్ర విభ‌జ‌న చోటు చేసుకున్న వెంట‌నే.. రెండు రాష్ట్రాల్లోనూ త‌మ పార్టీ కొన‌సాగుతోంద‌ని అంటూ జాతీయ‌పార్టీగా ప్ర‌క‌టించారు చంద్ర‌బాబు నాయుడు. అధికారంలోకి వ‌చ్చిన తొలి ఏడాది హైద‌రాబాద్ శివార్ల‌లోని గండిపేట్‌లో నిర్వ‌హించిన మ‌హానాడులో జాతీయ పార్టీగా డిక్ల‌రేష‌న్ చేశారు. జాతీయ పార్టీ అధ్య‌క్షునిగా చంద్ర‌బాబు, రాష్ట్ర‌పార్టీ అధ్య‌క్షునిగా కిమిడి క‌ళా వెంక‌ట్రావును నియ‌మించారు. ఆ కిమిడి క‌ళా వెంక‌ట్రావే.. ఇప్పుడు గెలుపు రుచి చూడ‌లేక‌పోయారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన వైఎస్ఆర్ సీపీ అభ్య‌ర్థి కిర‌ణ్ కుమార్ చేతిలో ఓడిపోయారు.

కంచుకోట‌ను కోల్పోయిన రాహుల్‌..

కంచుకోట‌ను కోల్పోయిన రాహుల్‌..

అఖిల భార‌త కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ త‌న కంచుకోట‌ను సైతం పోగొట్టుకోవాల్సి వ‌చ్చింది. ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌లోని అమేథీ నుంచి పోటీ చేసిన ఆయ‌న బీజేపీ అభ్య‌ర్థి స్మృతి ఇరానీ చేతిలో చావు దెబ్బ‌లు తిన్నారు. ఓడిపోతాన‌ని ముందే గ్ర‌హించ‌డం వ‌ల్లో, ఏమో ఆయ‌న కేర‌ళ‌లోని వాయ‌నాడ్ లోక్‌స‌భ‌ను కూడా ఎంచుకున్నారు. అక్క‌డి నుంచి లోక్‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు.

సీటు మారి..

సీటు మారి..

దేవేగౌడ ప‌రిస్థితీ అంతే. జ‌న‌తాద‌ళ్ (యునైటెడ్‌) అధ్య‌క్షుడిగా ఉన్న దేవేగౌడ‌.. తుమ‌కూరులో పోటీ చేసి, ఓట‌మి పాల‌య్యారు. మెజారిటీ త‌క్కువే అయిన‌ప్ప‌టికీ.. ఓటమి ఓట‌మే. నిజానికి ఈ సారి త‌న సీటును మార్చుకున్నారు. తాను పోటీ చేసే హ‌స‌న స్థానాన్ని మ‌న‌వ‌డు ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌కు ఇచ్చి, తాను తుమ‌కూరు నుంచి బ‌రిలో దిగారు. ఓడిపోయారు. హ‌స‌న నుంచి ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ గెలుపొందారు.

ప‌వ‌ర్ స్టార్ గా ఓకే.. కానీ

ప‌వ‌ర్ స్టార్ గా ఓకే.. కానీ

ఇక ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌రిస్థితి మ‌రీ దారుణం. ప‌వ‌ర్ స్టార్‌గా ల‌క్షలాది మంది అభిమానుల‌ను సంపాదించుకున్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఎన్నిక‌ల్లో స‌క్సెస్ కాలేక‌పోతున్నారు. పార్టీ అధ్య‌క్షుడిగా ఉంటూ ఆయ‌న ఏరి కోరి మ‌రీ ఎంపిక చేసుకున్న స్థానాల్లో విజ‌యం సాధించ‌లేక‌పోయారు. విశాఖ‌ప‌ట్నం జిల్లా గాజువాక‌, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా భీమ‌వ‌రం నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. రెండుచోట్లా ఓడిపోవ‌డం కొస‌మెరుపు.

English summary
Presidents of various Political Parties failed to achieve their Elections in Assembly and Lok Sabha Constituencies. In Andhra Pradesh, TDP State President K Kala Venkatrao was failed to win his Election from Etcherla in Srikakulam Disrict. AICC President Rahul Gandhi also lost his battle in Amethi to rival BJP Candidate Smrithi Irani. Jana Sena Party in Andhra Pradesh President Pawan Kalyan lost his Elections where He was contested in two Assembly Constituencies. As well as JDS in Karnataka, Party President and Former Prime Minister HD Deve Gowda was lost his Election from Tumakur.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X