వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్టీ టికెట్ ఇవ్వ‌లేద‌ని అల‌క‌..! నిర‌స‌న‌గా స‌భ కోసం వేసిన కుర్చీల‌ను ఎత్తుకెళ్లిన ఘ‌నుడు..!!

|
Google Oneindia TeluguNews

ఔరంగాబాద్/హైద‌రాబాద్ : ఎన్నిక‌ల వేళ నేత‌లు వైఖ‌రి కామెడీ సినిమాను త‌ల‌పిస్తుంటుంది. టికెట్ ద‌క్కించుకున్న నేత‌ది ఒక‌ర‌క‌మైన బ‌దైతే టికెట్ రాని నేత‌ది మ‌రో బాధ‌. ఇక టికెట్ ఆశించి చివ‌ర‌కు రాక‌పోతే స‌ద‌రు అభ్య‌ర్థి తెలిపే నిర‌శ‌స‌న గ‌మ్మ‌త్తుగా ఉంటుంది. స‌రిగ్గా ఔరంగాబాద్ లో ఇలాంటి ఘ‌ట‌నే చోటుచేసుకుంది. ఎన్నికల వేళ సీట్ల కేటాయింపులో పార్టీలో అనేక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.

అయితే ఈ కేటాయింపులో ఆశించిన అందరికి టికెట్లు రాకపోవచ్చు..దీంతో అవకాశం దక్కని ఆశావాహులు అనేక రకాలుగా నిరసనలు కూడా చేస్తారు.కొందరు పార్టీలు మారితే..మరి కొందరు స్వతంత్రంగా బరిలోకి దిగుతారు..కొందరు అయితే సొంతంగా పార్టీ పెట్టటమో లేక తమ నాయకులపై విమర్శలు చేయటమో చేస్తారు. కానీ ఔరంగబాద్ కు చెందిన ఓ కాంగ్రెస్ నేత మాత్రం తన కోపాన్ని మరో రకంగా చూపించారు.

Party ticket not given..! The chairs for the protest was lifted up...!!

సిల్లోడ్ ఎమ్మెల్యేగా ఉన్న అబ్దుల్ సత్తార్ ఎంపీ టికెట్ ను ఆశించి భంగపడి అల‌క బూనాడు. ముఖ్య నేత‌ల‌పై నిర‌శ‌న గ‌ళం విప్పాడు. ముంబైలోని గాంధీభవన్ లో ఉన్న 300 కుర్చీలు తనవే అని, వాటిని తీసుకెళ్లిపోతానని చెబుతూ, అనుచరగణంతో వచ్చి కుర్చీలన్నింటినీ తీసుకెళ్లిపోయారు. అంతేకాదు తీవ్ర ఆగ్రహానికి లోనైన అబ్దుల్ సత్తార్, పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.

ఆ వెంటనే అనుచరులను వెంటేసుకుని గాంధీభవన్ కు వెళ్లిన ఆయన, తన డబ్బులతో తెచ్చిన కుర్చీలను ఎందుకు ఉంచాలని ప్రశ్నిస్తూ, వాటిని తీసుకెళ్లారు. ఆ సమయంలో కాంగ్రెస్, ఎన్సీపీ సంయుక్త సమావేశం జరగనుండగా, కార్యకర్తలు కూర్చునేందుకు కుర్చీలు లేక, సమావేశాన్ని ఎన్సీపీ ఆఫీసుకు మార్చుకోవాల్సి వచ్చింది. అబ్దుల్ స‌త్తార్ తెలిపిన వినూత్న నిర‌శ‌న‌కు అక్క‌డికి చేరుకున్న కొంత మంది నేత‌లు ముసిముసి న‌వ్వులు న‌వ్వుకున్న‌ట్లు తెలుస్తోంది.

English summary
Abdul Sattar, who is a Silild MLA, hopes for an MP ticket and tries to get it. Strangely, he was angry about the main leaders. The 300 chairs in Gandhinhavan in Mumbai ones that were going to take them away. Abdul Sattar, who was furious and angry, announced that he would resign from the party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X