వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎదురు దాడులు చేయకపోతే మీరు బీజేపీ కార్యకర్తలే కాదు : కోల్‌కతా బీజేపీ ఎంపీ

|
Google Oneindia TeluguNews

టీఎంసీ కార్యకర్తలు దాడి చేస్తే... ఏడ్చుకుంటూ నా దగ్గరకి రాకండి...తిరిగి వారిని చితక్కోట్టండి అంటూ బీజేపీ ఎంపీ తమ పార్టీ కార్యకర్తలకు సూచించారు. దీంతో సదరు ఎంపీ చేసిన వ్యాఖ్యలు వివాద్పదమయ్యాయి..బహిరంగగానే మీడీయా ముందు తమ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి చేయడంతో కోల్‌కతాలోని బీజేపీ ఎంపీపై పోలీసులు కేసు నమోదు చేశారు.

బెంగాల్ బీజేపీ ఎంపీ వివాదస్పద వ్యాఖ్యలు

బెంగాల్ బీజేపీ ఎంపీ వివాదస్పద వ్యాఖ్యలు

పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య నువ్వా నేనా అన్నట్టు తయారైంది... లోక్‌సభ ఎన్నికల నుండి రెండు పార్టీల మధ్య రాజకీయ విమర్శలు ఎక్కువయిన విషయం తెలిసిందే.. నేరుగా పీఎం నరేంద్రమోడీ, బెంగాల్ సీఎం మమతాబెనర్జీల మధ్య తీవ్ర రాజకీయ యుద్దం నెలకొంది.. ఉన్నత స్థాయిలోనే నేతలు తీవ్రంగా వ్యతిరేకించుకోవడంతో రెండు పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య కూడ రాజకీయ వైరం తీవ్రం అయింది. దీంతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతోపాటు కేసులు పెట్టుకోవడం తీవ్రం అయింది.

టీఎంసీ కార్యకర్తలను కొట్టిన తర్వాతే నా వద్దకు రండీ...

టీఎంసీ కార్యకర్తలను కొట్టిన తర్వాతే నా వద్దకు రండీ...

ఈనేపథ్యంలోనే పార్టీ కోల్‌కతాలోని ఓ కార్యక్రమంలో పాల్గోన్న బీజేపీ ఎంపీ, బెంగాల్ పార్టీ చీఫ్ అయిన దిలిప్ ఘోష్ వివాస్పద వ్యాఖ్యలు చేశారు. తరచూ టీఎంసీ కర్యాకర్తలు తమపై దాడులు చేస్తున్నారంటూ తరచూ బీజేపీ కార్యకర్తలు తనవద్దకు రావద్దని, టీఎంసీ దాడులు చేసినప్పుడు తిరిగి వారిపై దాడులు చేయాలని పిలుపునిచ్చారు. అప్పుడే తన వద్దకు రావాలని చెప్పారు. టీఎంసీ కార్యకర్తలను దెబ్బకు దెబ్బ ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పారు. హింసను హింసతోనే ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. అప్పుడే దానికి ఫుల్‌స్టాప్ పడుతుందని అన్నారు. మరోవైపు ప్రతిసారి టీఎంసీ కార్యకర్తలు బీజేపి కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని, అయితే పోలీసులు కూడ బీజేపీ కార్యకర్తలపైనే కేసులు పెడుతున్నారని చెప్పారు.

ఎంపీపై కేసు నమోదు చేసిన పోలీసులు

ఎంపీపై కేసు నమోదు చేసిన పోలీసులు

కాగా కోల్‌కతాలోని ఈస్ట్‌మదీనాపూర్‌‌లోని బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు సుమోటా తీసుకుని కేసు నమోదు చేశారు. దీంతో తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని మరోసారి స్పష్టం చేశారు. బీజేపీ కార్యకర్తలపై దాడులు చేసేది పోలీసులైనా, టీఎంసీ కార్యకర్తలైన వదిలిపెట్టకుండా వారిపై తిరిగి దాడులు చేయాలని పిలుపునిచ్చాడు, అలా చేయకపోతే మీరు బీజేపీ కార్యకర్తలే కాదని రెచ్చగొట్టాడు. అలా ఉండేవాళ్లు పార్టీని వీడీ వెళ్లండి అంటూ ప్రసంగించారు. దీంతో ఆయనపై పలు విమర్శలు చెలరేగాయి. ముఖ్యమంత్రి మమతాబెనర్జీ నాయకత్వంలో రాష్ట్రంలో ప్రశాంత వాతవరణం నెలకొందని, దాన్ని చెడగొట్టేందుకే బీజేపీ ప్రయత్నాలు చేస్తుందని టీఎంసీ నేతలు విమర్శించారు.

English summary
Medinipur MP and Bengal BJP president Dilip Ghosh has asked party workers to take revenge when attacked by Trinamool Congress supporters. Speaking to mediapersons on Tuesday, Ghosh asked workers not to spare TMC workers or policemen.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X