వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా కాటు: ఆ ఎయిరిండియా విమానంలో ప్రయాణించిన 40 మందీ క్వారంటైన్లోకి

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఢిల్లీ-లూధియానా ఎయిర్ ఇండియా విమానంలో మంగళవారం ప్రయాణించిన ప్రయాణికులకు కరోనావైరస్ పాజిటివ్ ఉందని తేలింది. దీంతో 36 మంది ప్రయాణికులతోపాటు నలుగురు విమాన సిబ్బందిని ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్‌కు తరలించారు.

అలియన్స్ ఎయిర్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్‌కు చెందినవారు టికెట్ కొనుగోలు చేసి మిగితా ప్రయాణికులతోపాటు విమానంలో ప్రయాణించారు. కాగా, పంజాబ్ ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో 36 మంది ప్రయాణికులు, నలుగురు విమాన సిబ్బంది క్వారంటైన్ లో ఉన్నారని ఎయిరిండియా తెలిపింది.

 Passenger on Delhi-Ludhiana Air India flight tests corona positive, 40 quarantined

లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో మంగళవారం ఏఐ 91837 ఢిల్లీ-లూధియానా విమానం తన సేవలను కొనసాగిస్తోంది. కాగా, ఇంతకుముందు చెన్నై-కోయంబత్తూరుకు వెళ్లిన విమానంలో ఓ ప్రయాణికుడికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో విమాన సిబ్బంది 14 రోజులపాటై క్వారంటైన్లో ఉన్నారు. ఈ విమానంలో ప్రయాణింంచిన ప్రయాణకులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
కరోనా వచ్చిన వ్యక్తిని కోయంబత్తూరులోని ఈఎస్ఐ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

మార్చి 25న లాక్‌డౌన్ విధించగా రెండు నెలల తర్వాత దేశీయ విమానాలు సోమవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. మొదటి రోజు 39వేల మంది విమానాల్లో ప్రయాణించగా, రెండో రోజు 42వేల మంది ప్రయాణించారు. పలు విమానాలు రద్దయినప్పటికీ సుమారు రెండు రోజుల్లో వెయ్యికిపైగా విమానాలు గాల్లో ఎగిరాయి.

Recommended Video

Supreme Court - 'Middle Seats On Flights Must Remain Vacant After June 6'

ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం నుంచి విమానాలు తమ సేవలను ప్రారంభించాయి. పశ్చిమబెంగాల్‌లో గురువారం నుంచి విమానాలు ఎగరనున్నాయి. దీంతో రద్దీ పెరగనుంది. కాగా, సోమవారం నడిచిన విమానాల్లో సగం సీట్లు ఖాళీగానే ఉన్నాయని విమానయాన సంస్థలు పేర్కొన్నాయి.

English summary
One passenger on Air India Delhi-Ludhiana flight on Tuesday has tested positive for coronavirus. Air India has said a total of 36 passengers on the flight along with 4 crew members have been put in institutional quarantine following the Punjab government rules.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X