వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

1000 బస్సులు: బీజేపీ జెండాలు, స్టిక్కర్లు అతికించండి.. కానీ తిప్పాలంటోన్న ప్రియాంక

|
Google Oneindia TeluguNews

వలసకూలీల కోసం బస్సుల తరలింపుపై ప్రియాంక వర్సెస్ యోగి ఆదిత్యనాథ్ మధ్య వివాదం కొనసాగుతోంది. వలసకూలీలను తరలించేందుకు వెయ్యి బస్సులను పంపిస్తానని ప్రియాంకగాంధీ ప్రకటించిన తర్వాత నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. తాజాగా ప్రియాంక మరోసారి యోగి ఆదిత్యనాథ్‌పై ఫైరయ్యారు. కావాలంటే బస్సులపై బీజేపీ పార్టీ జెండాలు పెట్టుకోవాలని సూచించారు. కానీ వలసకూలీలను మాత్రం స్వస్థలాలకు పంపించాలని ప్రియాంక గాంధీ కోరారు.

12 కాదు 5 పీఎం : 1000 బస్సులు పంపడంపై ప్రియాంక గాంధీ యూపీ సర్కార్‌కు ప్రతీ లేఖ12 కాదు 5 పీఎం : 1000 బస్సులు పంపడంపై ప్రియాంక గాంధీ యూపీ సర్కార్‌కు ప్రతీ లేఖ

24 గంటలు..

24 గంటలు..

బస్సులు పంపించాలని యూపీ సర్కార్ కోరడంతో నిన్ననే పంపించామని, 24 గంటలు గడిచింది.. కానీ ఒక్క బస్సును తిప్పలేదు అని ప్రియాంకగాంధీ ఆరోపించారు. బీజేపీ జెండాలు, స్టిక్కర్లు వేసుకొని తిప్పిన తమకు అభ్యంతరం లేదు అని ప్రియాంక గాంధీ వీడియో మేసెజ్‌లో కోరారు. కానీ బస్సులను మాత్రం తిరగనీయాలని.. లేదంటే తమకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు.

కదలని బస్సులు..

కదలని బస్సులు..

వలసకూలీల తరలింపు తమ బాధ్యత అని ప్రియాంక చెప్పారు. వారు భారతీయులే కాదు.. వెన్నెముక అని పేర్కొన్నారు. దేశం కోసం రక్తాన్ని ధారపోసి, చోమటోడ్చి పనిచేస్తున్నారని తెలిపారు. కానీ ఈ సమయంలో రాజకీయాలు చేయడం మాత్రం సరికాదని హితవు పలికారు. వలసకూలీల కోసం బస్సులను పంపిస్తానని ప్రియాంక గాంధీ చెప్పడంతో వివాదం చెలరేగింది. యోగి ఆదిత్యనాథ్ అనుమతి ఇవ్వకముందే 500 బస్సులను పంపించడంతో అగ్గిరాజేసింది. తర్వాత యోగి ఓకే చెప్పినా.. సమయం లిమిట్ పెట్టడంతో అదీ కూడా వీలుకాలేదు.

రిజిస్ట్రేషన్ల రగడ..

రిజిస్ట్రేషన్ల రగడ..


నిన్న యూపీ మంత్రి సిద్దార్థ.. బస్సులు రిజిస్ట్రేషన్‌పై కామెంట్ చేశారు. టూ వీలర్, ఆటో, గుడ్స్ క్యారియర్స్‌తో రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపించారు. మరోవైపు నిన్నటి నుంచి ఘజియాబాద్, నోయిడాలోనే 500 చొప్పున బస్సులు ఉన్నాయి. వాటిని వలసకూలీల తరలింపు కోసం ఉపయోగించకపోవడంతో... ప్రియాంక మరోసారి స్పందించారు.

English summary
Congress leader Priyanka Gandhi Vadra Wednesday asked the Yogi Adityanath government to allow the buses to ply even if it means “pasting BJP flags on these buses
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X