వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా మందుపై యూటర్న్ తీసుకున్న పతంజలి ... ఆ నోటీసుకు ఆసక్తికర సమాధానం

|
Google Oneindia TeluguNews

ఆయుర్వేదిక్ మందుతో కరోనాను తగ్గించవచ్చని పేర్కొన్న రాందేవ్ బాబా మార్కెట్లోకి పతంజలి సంస్థ తయారుచేసిన కరోనా మందులు విడుదల చేశారు.మూడు రోజుల్లోనే ఈ మందు ప్రభావవంతంగా పని చేస్తుందని కూడా తెలిపారు. ఇక దీనిపై ఆయుష్ అనుమతి తీసుకోలేదని, ఎలాంటి అప్రూవల్స్ లేకుండా మెడిసిన్ ను మార్కెట్ లో విడుదలచెయ్యటంపై నోటీసులు జారీ కావటంతో పతంజలి మందులకు బ్రేక్ పడింది. ఇక తాజాగా ఈ వ్యవహారంలో జారీ అయిన నోటీసులకు సమాధానంగా పతంజలి సమాధానం ఆసక్తికరంగా మారింది.

రాం దేవ్ బాబా వర్సెస్ కేంద్రం: ఇమ్యూనిటీ పేరు చెప్పి కరోనాకు మందు..? నోటీసులు జారీ...?రాం దేవ్ బాబా వర్సెస్ కేంద్రం: ఇమ్యూనిటీ పేరు చెప్పి కరోనాకు మందు..? నోటీసులు జారీ...?

 కరోనా నివారణ మెడిసిన్ ను మార్కెట్ లో విక్రయించలేదు

కరోనా నివారణ మెడిసిన్ ను మార్కెట్ లో విక్రయించలేదు


కరోనా మందుల విషయంలో పతంజలి యూ టర్న్ తీసుకుంది. ఉత్తరాఖండ్ డ్రగ్ డిపార్ట్‌మెంట్ దీనికి సమాధానం చెప్పాలని జారీ చేసిన నోటీసుపై స్పష్టత ఇస్తూ, పతంజలి మంగళవారం (జూన్ 30, 2020) కరోనావైరస్ కు కరోనా నివారణ మెడిసిన్ ను మార్కెట్ లో విక్రయించలేదని పేర్కొంది."కరోనా కిట్" అని పిలిచే మెడిసిన్ తయారు చేశామని "దివ్య స్వసరి", "దివ్య కరోనిల్ టాబ్లెట్" & "దివ్య తైలం " అనే మందులను మాత్రమే ప్యాక్ చేసి దాని ప్రయోజనాలను మాత్రమే చెప్పామని "కరోనిల్ కిట్" ను వాణిజ్యపరంగా విక్రయించలేదని సమాధానం ఇచ్చారు.

 కరోనా కోసమే ఈ మందు అని తాము చెప్పలేదన్న పతంజలి

కరోనా కోసమే ఈ మందు అని తాము చెప్పలేదన్న పతంజలి

కరోనా (కోవిడ్- 19) చికిత్సకు పని చేస్తుందని మేము ప్రచారం చెయ్యలేదని పేర్కొన్నారు. ఔషధ విభాగానికి రాసిన ఒక లేఖలో, పతంజలి మెడిసిన్ యొక్క ప్రయోజనాల గురించి మరియు ప్రజలపై దాని విజయవంతమైన పరీక్ష గురించి మాత్రమే చెప్పామని , కరోనా కోసమే ఈ మందు అని తాము చెప్పలేదని పేర్కొన్నారు. ఈ మందు ట్రయల్స్ విజయవంతమయ్యాయని మాత్రమే తాము మీడియా సమావేశంలో చెప్పామని తెలిపింది.

Recommended Video

Patanjali's Coronil: FIR Against Yoga Guru Ramdev ప్రజలను మోసం చేసారంటూ 420 కింద కేసు ! || Oneindia
 కరోనిల్ కిట్ విషయంలో పతంజలికి ఆయుష్ షాక్

కరోనిల్ కిట్ విషయంలో పతంజలికి ఆయుష్ షాక్

ఎంతో గొప్పగా బాబా రాం దేవ్,ఆచార్య బాలకృష్ణ పతంజలి ఆయుర్వేద సంస్థ ద్వారా కరోనాకు మందు తయారు చేశామని ,అతి తక్కువ ధరకే మెడిసిన్ లభిస్తుందని, చాలా మందిపై ఈ మెడిసిన్ ప్రయోగం సక్సెస్ అయిందని మార్కెట్ లోకి విడుదల చేశారు. ప్రారంభించిన గంటల్లోనే , ఉత్తరాఖండ్ ఆయుష్ మంత్రిత్వ శాఖ పతంజలికి నోటీసు జారీ చేసింది, జారీ చేసిన లైసెన్స్ కరోనావైరస్ నివారణను కాదని పేర్కొంది. రోగనిరోధక శక్తి బూస్టర్ కిట్లు మరియు జ్వరం మందుల ఉత్పత్తికి మాత్రమే లైసెన్స్ జారీ చేయబడిందని పేర్కొంది. సమాధానం చెప్పాలని నోటీసులు ఇవ్వగా నేడు కరోనా మెడిసిన్ తాము కరోనా మందు తయారు చెయ్యలేదని యూటర్న్ తీసుకుంది.

English summary
Patanjali on Tuesday (June 30, 2020) gave clarification on medicine claiming cure to coronavirus saying that it never said to have made any such medicine. Giving clarification on the notice issued by the Uttrakhand Drug department,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X