వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పంజాబ్ ఉగ్రదాడి: 4గురు హతం, వచ్చింది ఎంతమంది?

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

పఠాన్‌కోట్: పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్ ముగిసింది. ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పులు ముగిసినట్లు పంజాబ్ పోలీస్ అడిషనల్ డీజీ హెచ్‌ఎస్ థిల్లాన్ తెలిపారు. అయితే కూంబింగ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నట్లు ఆయన వెల్లడించారు.

అయితే నలుగురు ఉగ్రవాదులను ఏరివేశాం, ఎన్‌కౌంటర్ ముగిసిందని అధికారులు ప్రకటించిన కాసపేటికే ఎయిర్ బేస్‌లో రెండు భారీ పేలుళ్లు సంభవించాయి. ఆ పేలుడు గ్రెనేడ్ దాడి అయి ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీంతో ఆపరేషన్ ఇంకా ముగియలేదని, ఐదో టెర్రరిస్టు కోసం ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు ప్రకటించారు.

Pathankot Attack

ఈ నేపథ్యంలో అసలు ఉగ్రదాడికి ఎంత మంది వచ్చి ఉంటారనే చర్చ మొదలైంది. ఆరుగురి వరకు ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో భద్రతా దళాలు విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. స్వాట్ టీమ్ ఎయిర్‌బేస్‌ను స్వాధీనం చేసుకుంది.

పంజాబ్ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్, డిఐజీ సహా ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై జరిగిన దాడిలో ఇప్పటికే నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. తాజాగా ఉగ్రదాడిలో తీవ్రంగా గాయపడిన జవాను చికిత్స పొందుతూ మృతి చెందాడు.

దీంతో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు జవాన్లు చనిపోగా మరో ఆరుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. పంజాబ్ లోని కీలకమైన ప్రాంతాన్ని ఎంచుకున్న ఉగ్రవాదులు పక్కా ప్లాన్ ప్రకారమే దాడికి దిగినట్టు స్పష్టమవుతోందని శివసేన ఆరోపించింది.

ఇది జాతికి పెద్ద హెచ్చరిక అని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. కాశ్మీర్ తర్వాత పాక్ ఉగ్రవాదులు పంజాబ్‌ను టార్గెట్‌గా చేసుకున్నారన్నారు. పాక్ ఉగ్రదాడులకు వారి భాషలోనే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. మరోవైపు ఉగ్రవాదుల దాడికి నిరసనగా స్థానికులు ఆందోళనకు దిగారు.

English summary
The terrorists who attacked the Pathankot air force station today were first detected at 3 AM when they tried to gain entry into the premises. The first terrorist was killed as he was gaining entry into the area. He was attempting to scale a wall which was around 10 to 15 metres when he was shot dead by the security personnel.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X