వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పఠాన్‌కోట్ దాడి: పాక్‌కు ఎల్ఆర్ పంపనున్న భారత్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పంజాబ్ రాష్ట్రంలోని పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాదుల దాడి వెనుకున్న కుట్రదారులను చట్టం ముందు నిలబెట్టాలని పాకిస్థా‌న్‌ను భారత్ కోరింది. ఈ మేరకు పాకిస్థాన్ ప్రభుత్వానికి లెటర్ రొగేటరీ(ఎల్ఆర్) పంపనుంది.

సైనిక ఆపరేషన్‌లో హతమైన ఉగ్రవాదుల డిఎన్ఏ నమూనాలు, ఫోన్ కాల్స్ తదితర వివరాలను పాకిస్థాన్‌కు భారత్ అందజేయనుంది. పఠాన్‌కోట్‌లో సైనిక బలగాల చేతిలో హతమైన ఆరుగురు ఉగ్రవాద మృతదేహాలకు వీలైనంత త్వరగా డిఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని భావిస్తోంది.

Pathankot attack: Letter Rogatory to be sent to Pak with details of terrorists

అంతేగాక, పాకిస్థాన్‌లోని సూత్రధారుల నుంచి ఉగ్రవాదులకు వచ్చిన ఫోన్ కాల్స్ వివరాలు ఎల్ఆర్ ద్వారా పొరుగు దేశానికి పంపించనుంది. ఈ వివరాలతో కుట్రదారులను పట్టుకోవాలని పాక్ ప్రభుత్వ వర్గాలకు భారత్ అధికారికంగా విజ్ఞప్తి చేయనుందని అధికార వర్గాలు వెల్లడించాయి.

Pathankot attack: Letter Rogatory to be sent to Pak with details of terrorists

ఇది ఇలా ఉండగా, పఠాన్‌కోట్ ఉగ్రవాద దాడిని అమెరికా ఖండించింది. పాకిస్థాన్ ఉగ్రవాదులపై కఠినంగా వ్యవహరించాలని, వారిని అంతం చేయాలని పిలుపునిచ్చింది. కాగా, పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్.. భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేసి పఠాన్‌కోట్ ఘటనపై మాట్లాడారు. ఘటనకు పాల్పడిన ఉగ్రవాదులపై కఠినంగా వ్యవహరిస్తామని హామి ఇచ్చినట్లు తెలిసింది.

English summary
India is expected to send to Pakistan Letter Rogatory (LR) along with DNA samples of slain terrorists who attacked Pathankot air base, their phone call details, numbers of handlers based in that country and other information to help nab the mastermind of the crime.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X