వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బంధువులు కాదు రాబంధువులు: వెంటిలేటర్ ప్లగ్ తీసి, కూలర్ ప్లగ్ పెట్టి ఆన్, మృతి..

|
Google Oneindia TeluguNews

నిర్లక్ష్యమో.. లెక్కలేనితనమో తెలియదు కానీ.. అప్పుడప్పుడు కుటుంబసభ్యులు చేసే తప్పులు రోగులపాలిట శాపాలవుతాయి. రాజస్థాన్‌లోని కోటాలో అచ్చం ఇలాంటి ఘటనే జరిగింది. మహారావు భీమ్ సింగ్ ఆస్పత్రిలో 40 ఏళ్ల రోగి చేరారు. అయితే అతనితోపాటు ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు. అయితే వేసవి అని ఉక్కపోస్తుందో ఏమో తెలియదు గానీ.. అతని వెంటిలేటర్ ప్లగ్ తీసి.. కూలర్ ప్లగ్ పెట్టారు.

 Patient Dies in Kota Govt Hospital..

ఈ నెల 15వ తేదీన రోగిన ఐసీయూ నుంచి ఐసోలేషన్ వార్డుకు తరలించారు. అక్కడే అతని బంధువులు కూడా ఉన్నారు. అయితే వారు ఇటీవల ఓ కూలర్ కూడా కొనుగోలు చేశారు. గదిలో వేడి ఉండటంతో.. ఓపెన్ చేయాలని భావించారు. కానీ అక్కడ ప్లగ్ కనిపించలేదు. దీంతో ఏం చేయాలా అని ఆలోచించారు. వెంటిలేటర్ పెట్టిన ప్లగ్ పెట్టి కూలర్ ఆన్ చేశారు. ఇంకేముంది కూలర్ నడుస్తోంది.. వెంటిలేటర్ ఆగిపోవడంతో రోగి చనిపోయాడు.

Recommended Video

Family Recovered From Corona Without Going To Hospital

ఘటనపై డిప్యూటీ సూపిరింటెండెంట్, నర్సింగ్ సూపరింటెండెంట్, చీఫ్ మెడికల్ ఆఫీసర్‌తో కమిటీ వేశారు. సిబ్బంది, బంధువుల నుంచి కమిటీ సమాచారం సేకరించింది, శనివారం రోజు నివేదిక సమర్పించే అవకాశం ఉంది.

English summary
40-year-old man died at a government hospital here after his family members allegedly unplugged the ventilator he was on to plug in an air cooler.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X