వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వామ్మో.. మృతదేహం పక్కనే రెండురోజులు, ఐసోలేషన్ వార్డులో దుస్థితి, వీడియో తీసిన రోగి..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ విజృంభిస్తోన్న క్రమంలో వైరస్ సోకిన వారు రకరకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. కొందరికీ సరైన వైద్యం అందడంలో ఆలస్యమవుతుంటే.. మరికొందరు విచిత్ర పరిస్థితులను చవిచూస్తున్నారు. వైరస్ సోకి చనిపోయిన వారి మృతదేహాల పక్కన కూడా ఉండాల్సి వస్తోంది. అదేవిధంగా పశ్చిమబెంగాల్‌లో ఒకరు ఉన్నారు. తన బాధను పట్టించుకోవడం లేదు అని వీడియో తీసి షేర్ చేయడంతో.. వెలుగుచూసింది.

 Patient made to sleep next to dead body at isolation ward..

ఉత్తర పరగణ జిల్లాకు చెందిన ఒకరికి కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయి. దీంతో ఆయన నడియా జిల్లాలో గల జవహర్ లాల్ నెహ్రూ మెమోరియల్ కాలేజీ ఆఫ్ మెడిసిన్ ఆస్పత్రి ఐసోలేషన్ వార్డులో బుధవారం చేరారు. అయితే తన పక్కనే ఒకరు వైరస్‌తో చనిపోయారని తర్వాత తెలుసుకున్నారు. బుధవారం రాత్రి నుంచి గురువారం మధ్యాహ్నం వరకు మృతదేహం అలానే ఉంది.

మృతదేహం ఉంచిన విషయంపై వైద్య సిబ్బందికి చెప్పిన పట్టించుకోలేదని ఆస్పత్రిలో చేరిన వ్యక్తి చెప్పారు. లాభం లేదు అని వీడియో తీసి షేర్ చేశారు. అది వైరలవడంతో.. వార్తల్లోకి వచ్చింది. తనకు కూడా దగ్గు, జలబు ఉంది అని.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నానని చెప్పారు. ఈ పరిస్థితుల్లో తనకు ఆస్పత్రిలో ఉండాలని అనిపించడం లేదు అని చెప్పారు.

Recommended Video

KL Rahul Is Missing Cricket, క్రికెట్ కిట్ చూసి కేఎల్ రాహుల్ భావోద్వేగం || Oneindia Telugu

జరిగిన ఘటనపై ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను వివరణ కోరగా స్పందించారు. తమకు తక్కువ వనరులు ఉన్నాయని, గదులు కూడా లేవని చెప్పారు. అందుకోసమే ఐసోలేషన్ వార్డు నుంచి రోగి మృతదేహం తరలించడం ఆలస్యమైందని చెప్పారు. ఆలస్యానికి చింతిస్తున్నామని పేర్కొన్నారు.

English summary
patient from North 24 Parganas who was shifted to Nadia after he exhibited symptoms of Covid-19, had no idea that he would have to spend the next day in close proximity with a dead body.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X