వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరో ఆస్పత్రి అమానుషం: తల్లి ఆక్సిజన్ సిలిండర్‌ను భుజాలపై మోసిన కొడుకు

|
Google Oneindia TeluguNews

ఆగ్రా: రోగుల పట్ల ఆస్పత్రుల నిర్లక్ష్య దోరణి వీడటం లేదు. దేశంలో ఏదో ఓ మూల అమానవీయ ఘటనలు తరచూ చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది.

స్ట్రెచర్‌ లేకపోవడంతో ఓ కొడుకు తన తల్లికి పెట్టిన ఆక్సిజన్‌ సిలిండర్‌ను భుజాన వేసుకొని మోసుకెళ్లాడు. దీనికి సంబంధించిన ఫొటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆగ్రా మెడికల్‌ వైద్య కళాశాలలో చోటు చేసుకున్న ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Patients carry their oxygen cylinders as SN Medical College staff pays no heed

ఆ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. అంగురాదేవి అనే మహిళ అస్వస్థతకు గురి కావడంతో ఆమెను కొడుకు గురువారం ఆగ్రా మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేర్పించాడు. ఊపిరి అందడం లేదని చెప్పడంతో వైద్యులు ఆమెకు ఆక్సిజన్‌ పెట్టారు. తదుపరి చికిత్స నిమిత్తం వైద్యులు అంగురాదేవిని వేరే భవనంలోని వార్డుకు తరలించమన్నారు. ఆస్పత్రి నుంచి వేరే వార్డు కొద్దిగా దూరం ఉండటంతో అంబులెన్స్‌ ఏర్పాటు చేశారు.

అయితే, ఆమెను అంబులెన్స్‌ దాకా తీసుకొచ్చేందుకు స్ట్రెచర్‌ లేకపోవడంతో సిబ్బంది బాధితురాలిని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో ఆమె కొడుకు ఆక్సిజన్‌ సిలిండర్‌ను తన భుజాన వేసుకొని ఆసుపత్రి బయటకు వచ్చి అంబులెన్స్‌ కోసం వేచి చూడ సాగాడు. కాగా, ఈ ఫొటో వైరల్ కావడంతో ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని ఆస్పత్రి యాజమాన్యం తెలిపింది.

English summary
SN Medical College in Agra is marred with irregularities that are causing serious inconvenience to the visitors of the out-patients department (OPD) and emergency cases, reports Zee Media Bureau.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X