వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓటు వేసిన బిహారీ వీణా-వాణి: శ‌రీరం ఒక్క‌టే: ఓట్లు వేర్వేరు!

|
Google Oneindia TeluguNews

పాట్నా: తుది ద‌శ సార్వ‌త్రిక ఎన్నిక‌ల ప్ర‌క్రియ ఓ చారిత్ర‌క ఘ‌ట్టానికి తెర తీసింది. అవిభ‌క్త క‌వ‌ల‌లు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. బిహార్ రాజ‌ధాని పాట్నాలో వారు ఆదివారం ఓటు వేశారు. శ‌రీరం ఒక్క‌టే అయిన‌ప్ప‌టికీ.. ఇద్ద‌రికీ వేర్వేరుగా ఓటు హ‌క్కు ఉండటం విశేషం. అవిభ‌క్త క‌వ‌ల‌లు ఒకే శ‌రీరంతో, రెండు ఓట్ల‌ను వేయ‌డం దేశ ఎన్నిక‌ల చ‌రిత్ర‌లో ఇదే తొలిసారి. 2015లో బిహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అవిభ‌క్త క‌వ‌ల‌లు ఇద్ద‌రికీ ఓటు హక్కు క‌ల్పించ‌డానికి అప్ప‌ట్లో నిరాకరించారు. శ‌రీరం ఒక్క‌టే కావ‌డం వ‌ల్ల అవిభ‌క్త క‌వ‌ల‌ల్లో ఒక‌రికే ఓటు వేసే అవ‌కాశాన్ని ఇచ్చారు. ఈ సారి దీనికి భిన్నమైన దృశ్యం అక్క‌డ క‌నిపించింది.

కొట్టి.. కేసు పెట్టి.. ఫొటోగ్రాఫర్‌పై తేజ్ ప్రతాప్ బౌన్సర్ల ప్రతాపం..కొట్టి.. కేసు పెట్టి.. ఫొటోగ్రాఫర్‌పై తేజ్ ప్రతాప్ బౌన్సర్ల ప్రతాపం..

ఆ అవిభ‌క్త క‌వ‌ల‌ల పేర్లు స‌బా, ఫ‌రా. మ‌న వీణా-వాణిల్లాగే వారికి కూడా త‌ల‌లు అతుక్కుని జ‌న్మించారు. అలాగే ఉండిపోయారు. పాట్నా సాహిబ్ లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని దిఘా సెగ్మెంట్‌లో వారికి ఓటు హ‌క్కు ఉంది. ఈ మ‌ధ్యాహ్నం ఆటోలో పోలింగ్ కేంద్రానికి వ‌చ్చిన వారికి అక్క‌డి సిబ్బంది పుష్ప‌గుచ్ఛాలు ఇచ్చి స్వాగ‌తించారు. పాట్నా సాహిబ్ లోక్‌స‌భ స్థానంలో ఈ ఎన్నిక‌ల్లో అంద‌రి దృష్టినీ ఆక‌ర్షిస్తోంది. మొన్న‌టి దాకా బీజేపీలో కొన‌సాగిన షాట్‌గ‌న్‌ శ‌తృఘ్న‌సిన్హా కాంగ్రెస్ అభ్య‌ర్థిగా బ‌రిలో నిల్చున్నారు. బీజేపీ అభ్య‌ర్థిగా కేంద్ర మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ పోటీ చేస్తున్నారు.

Patna’s conjoined twins cast their votes as separate individuals

ఓటు వేసి వ‌చ్చిన వెంట‌నే- ఫొటోగ్రాఫ‌ర్లు స‌బా, ఫ‌రాల‌ను త‌మ కెమెరాల్లో బంధించ‌డానికి పోటీ ప‌డ్డారు. వారిని ఫొటోలు తీయ‌డానికి బారులు తీరి నిల్చున్నారు. ఓటు వేసిన అనంత‌రం వారు చిరున‌వ్వులు చిందిస్తూ ఓటరు కార్డును, ఇంకు మార్క్ ప‌డిన వేలిని చూపుతూ ఉత్సాహంగా క‌నిపించారు. పోలింగ్ గురించి విన్నామే గానీ, ఓటు వేయ‌లేద‌ని అన్నారు. తొలిసారిగా ఓటు హ‌క్కును వినియోగించుకోవ‌డం ఆనందంగాద ఉంద‌ని చెప్పారు.

English summary
Conjoined twins, Sabah and Farah, cast their votes today as separate individuals with independent voting rights for the first time in India’s election history. During the 2015 assembly polls in Bihar, the 19-year-old sisters had cast their votes on a single voter identity card. This time, however, the twins earned the right to be treated as separate individuals, reported PTI. Saba and Farah were enrolled in the electoral roll for Digha assembly segment under Patna Sahib Lok Sabha seat which went to poll today in the 7th phase of Lok Sabha elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X