అతను రేప్ చేశాడు, మీరు న్యాయం చేయండి: గవర్నర్‌కు పాయల్ ఘోష్ వినతి - అనురాగ్‌కు సమన్లు?
''సార్.. దర్శకుడు అనురాగ్ కాశ్యప్ నా పట్ల అతి క్రూరంగా వ్యవహరించాడు. నాపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పలు మార్లు లైంగిక దాడులు చేశాడు. సమాజంలో పాపులారిటీ ఉందని ఇలాంటి వాళ్లను వదిలిపెట్టడానికి వీల్లేదు. దయచేసి నాకు న్యాయం చేయండి. కీచకులను వెంటనే అరెస్టు చేసేలా ఆదేశాలివ్వండి..'' అని నటి పాయల్ ఘోష్.. మహారాష్ట్ర గవర్నర్ ను వేడుకున్నారు.
ఈసీ అనూహ్య నిర్ణయం: నాలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు నో - ఎందుకంటే..

రాజ్‌భవన్‌కు పాయల్..
దర్శక నిర్మాత అనురాగ్ కశ్యప్ గతంలో రేప్, సెక్సువల్ హరాస్మెంట్ కు పాల్పడ్డాడంటూ నటి పాయల్ ఘోష్ ఈనెల 22న ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారం గడుస్తున్నా అతనిపై చర్యలు తీసుకునే దిశగా పోలీసులు కదలకపోవడంతో బాధితురాలు పాయల్ మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీని ఆశ్రయించారు.
పవన్ కల్యాణ్ మూడుపెళ్లిళ్ల మాసికం - జైలు భయంతోనే జగన్ ఆ పని - బుద్ధి తక్కువై పొత్తు: సీపీఐ నారాయణ

కంగన్ ఫైర్..
కేంద్ర మంత్రి రాందాస్ అథవాలేతో కలిసి మంగళవారం ముంబైలోని రాజ్ భవన్ కు వెళ్లిన పాయల్.. అనురాగ్ ను వెంటనే అరెస్టు చేయాలంటూ గవర్నర్ కు మెమోరండం సమర్పించారు. గతంలో బిల్డింగ్ కూల్చివేత వివాదంపై నటి కంగనా రనౌత్ సైతం గవర్నర్ ను కలిసి వినతిపత్రం సమర్పించడం తెలిసిందే. మహారాష్ట్ర ప్రభుత్వంపై కామెంట్ చేసిన నేరానికి ఓ వ్యక్తిని గంటల వ్యవధిలోనే పోలీసులు అరెస్టు చేశారని, ఇప్పుడు మాత్రం ఎఫ్ఐఆర్ దాఖలైన వారం తర్వాత కూడా అనురాగ్ కశ్యప్ ను పోలీసులు అరెస్టు చేయకపోవడం దారుణమని కంగనా రనౌత్ అన్నారు.

దర్శకుడికి సమన్లు..
కంగన మద్దతు పలకడంపై నటి పాయల్ ఘోష్ సంతోషం వ్యక్తం చేశారు. కష్టకాలంలో తన వెనుక కంగన రాయిలా అండగా నిలిచిందని పాయల్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, అత్యాచారం, లైంగిక దాడుల ఆరోపణలకు సంబంధించి దర్శకనిర్మాత అనురాగ్ కశ్యప్ కు సమన్లు జారీచేసే దిశగా ముంబై పోలీసులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. సదరు ఆరోపణల్లో నిజం లేదని, మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకే కొందరు పనిగట్టుకుని తనపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని అనురాగ్ పేర్కొన్నారు.