వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మళ్లీ గూగుల్ ప్లేస్టోర్‌లో పేటీఎం - గంటల వ్యవధిలోనే యాప్ పున:ప్రత్యక్షం

|
Google Oneindia TeluguNews

డిజిటల్ పేమెంట్స్ దిగ్గజం పేటీఎంకు భారీ ఊరట లభించింది. టెక్ దిగ్గజం గూగుల్ సంస్థ.. తన ప్లేస్టోర్ నుంచి పేటీఎం యాప్ ను తొలగిస్తున్నట్లు శుక్రవారం మధ్యాహ్నం ప్రకటించడంతో వినియోగదారులు ఆందోళనకు గురయ్యారు. ఆన్ లైన్ గ్యాంబ్లింగ్, బెట్టింగ్ కలాపాలను ప్రోత్సహించేలా, చెల్లింపుల్లో నిబంధనలు పాటించని కారణంగానే పేటీఎం యాప్ ను తొలగించినట్లు గూగుల్ తెలిపింది. కానీ గంటల వ్యవధిలోనే.. శుక్రవారం రాత్రి నాటికి పేటీఎం యాప్ మళ్లీ ప్లేస్టోర్ లో ప్రత్యక్షమైంది.

పేటీఎంకు భారీ షాక్: గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్ తొలగింపు - గ్యాంబ్లింగ్‌ - ఐపీఎల్ టోర్నీ ఎఫెక్ట్?పేటీఎంకు భారీ షాక్: గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్ తొలగింపు - గ్యాంబ్లింగ్‌ - ఐపీఎల్ టోర్నీ ఎఫెక్ట్?

ప్లే స్టోర్ నుంచి యాప్ ను తొలగించిన తర్వాత పేటీఎం తన ఖాతాదారుల్ని ఉద్దేశించి కీలక ప్రకటన చేసింది. త్వరలోనే యాప్ ప్లేస్టోర్ లోకి వస్తుందని, వినియోగదారుల డబ్బులు సేఫ్ గా ఉన్నాయని, ఇప్పటికే యాప్ కలిగిఉన్నవాళ్లు చెల్లింపులను యధావిధిగా కొనసాగించుకోవచ్చని భరోసా ఇచ్చింది. సంస్థ చెప్పనట్లుగానే ఐదు గంటల వ్యవధిలోనే ప్లేస్టోర్ లో మళ్లీ పేటీఎం కనిపించింది.

Paytm app removed from Google Play Store for hours, now back

ఇండియన్ ఆర్మీ సంచలన ప్రకటన - షోపియాన్ ఎన్ కౌంటర్ చట్టవిరుద్ధం - జవాన్లపై చర్యలుఇండియన్ ఆర్మీ సంచలన ప్రకటన - షోపియాన్ ఎన్ కౌంటర్ చట్టవిరుద్ధం - జవాన్లపై చర్యలు

కాగా, పేటీఎంను ఉద్దేశించి గూగుల్ ఆరోపించిన.. ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ కు ప్రోత్సాహం, మోసపూరిత చెల్లింపులు.. తదితర అంశాలపై పేటీఎం ఎలాంటి వివరణ ఇవ్వలేదు. అటు గూగుల్ సైతం.. తొలగింపునకు కారణాలు చెప్పినా.. పునరుద్ధరణపై ప్రకటన చేయడకపోవడం గమనార్హం. మొత్తంగా దిగ్గజ సంస్థల మధ్య కొద్దిగంటలుగా సాగిన వ్యవహారాలు వినియోగదారులను ఆలోచింపజేశాయి.

English summary
Payment app Paytm has mysteriously disappeared from Google Play Store. The app, owned by One97 Communications Ltd, is not visible on being searched on Google Play Store whereas all the other apps including Paytm For Business, Paytm Money, Paytm Mall, and others owned by the company are still available on Play Store.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X