వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రికార్డు సృష్టించిన పేటీఎం... 100 మిలియ‌న్ల డౌన్‌లోడ్లు దాటిన ఏకైక పేమెంట్ యాప్‌!

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

Recommended Video

Paytm : 100 మిలియ‌న్ల డౌన్‌లోడ్లు : ఏకైక పేమెంట్ యాప్‌!

న్యూఢిల్లీ: రీఛార్జ్ యాప్‌గా అడుగుపెట్టి షాపింగ్ స్టోర్‌, పేమెంట్‌ బ్యాంక్‌గా ఎదిగిన పేటీఎం ఇప్పుడు స‌రికొత్త రికార్డును సృష్టించింది. గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియ‌న్ల డౌన్‌లోడ్లు దాటిన ఏకైక పేమెంట్ యాప్‌గా నిలిచింది.

ఈ విష‌యాన్ని ప్ర‌క‌టిస్తూ పేటీఎం ఒక అధికారిక ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసింది. డిసెంబ‌ర్ రెండో వారంలో తాము ఈ ఘ‌న‌త సాధించిన‌ట్లు ఆ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. ఈ సంద‌ర్భంగా సంస్థ సీనియ‌ర్ వైస్ ప్రెసిడెంట్ దీప‌క్ అబోట్ పేటీఎం ఉద్యోగుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

Paytm becomes India's first payments app to cross 100 mn downloads on Play Store

ఉద్యోగుల కృషి వల్లనే పేటీఎం ఈరోజు ఈ ఘ‌న‌త సాధించగ‌లిగిందని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఈ రికార్డును ఆద‌ర్శంగా తీసుకుని మున్ముందు వినియోగదారులకు మంచి సేవ‌ల‌ను అందిస్తామ‌ని ఆయ‌న పేర్కొన్నారు.

ఇటీవ‌ల నియ‌ర్‌బై.కామ్‌, లిటిల్ ఇంట‌ర్నెట్ సంస్థ‌లను పేటీఎం చేజిక్కించుకున్న సంగ‌తి తెలిసిందే. నిత్య జీవితంలో చెల్లింపులు అవసరమైన చాలాచోట్ల పేటీఎం ద్వారా చెల్లింపులకు అవకాశం ఉండడంతో ప్రజలకు కూడా ఈ యాప్ పట్ల అమిత ఆరణ కనబరుస్తున్నారు.

English summary
India's largest mobile-first financial services platform, Paytm on Wednesday announced that its app has crossed the 100 million milestone on Google Play Store in the second week of December 2017. This makes Paytm the country's first payments app to cross the 100 million downloads mark. "We are overwhelmed with the 100 million downloads mark, reaching this milestone is a testimony to the efforts of the incredible team at Paytm," said senior vice president Paytm, Deepak Abbot. "This achievement will offer us a strong boost as we work towards our goal of making India a digital-first economy," he added.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X