వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పేటీఎం వాడుతున్నారా? అయితే జాగ్రత్త.. ఫోన్‌కాల్, మెసేజ్ వస్తే..

|
Google Oneindia TeluguNews

మోసపూరిత మేసేజ్, కాల్స్ నుంచి అప్రమత్తంగా ఉండాలని పేటీఎం వ్యవస్థాపకులు విజయ్ శేఖర్ ఖాతాదారులను కోరారు. తమ సంస్థ పేరుతో ఎవరూ ఫోన్లు చేయరని, నకిలీ ఎస్ఎంఎస్ రాదని స్పష్టంచేశారు. ఖాతానంబర్, పిన్ వివరాలను కంపెనీ ప్రతినిధులు ఎవరూ ఫోన్ చేసి అడగరని తెలిపారు. అలా ఫోన్ చేశారంటే వాళ్లు సైబర్ కేటుగాళ్లు అని గ్రహించాలని సూచించారు.

ఫేక్ మేసేజ్‌లు..

ఫేక్ మేసేజ్‌లు..

ఇటీవల సోషల్ మీడియా వేదికగా నకిలీ మేసేజ్‌లు వస్తున్నాయి. దీంతో విజయ్ శేఖర్ స్పందించారు. మీ పేటీఏం ఖాతాదారులకు ఏమైనా సమస్య ఉంటే పేటీఎం కేంద్రాలను ఆశ్రయించాలని కోరారు. కానీ మేసేజ్, ఫోన్లు చేసేవారని విశ్వసించొద్దని సూచించారు. ఈ మేరకు విజయ్ శేఖర్ గురువారం ట్వీట్ చేశారు.

బురిడీ కొట్టించే ప్రయత్నం..

బురిడీ కొట్టించే ప్రయత్నం..

మోసగాళ్లు ఖాతాదారులను బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తున్నారని విజయ్ శేఖర్ తెలిపారు. ఎస్ఎంఎస్‌లను విశ్వసించొద్దని తెలిపారు. మరికొందరు బరితెగించి మీ ఖాతా బ్లాక్ చేస్తామని మేసేజ్ చేస్తారని గుర్తుచేశారు. అప్పుడు మీ ఖాతా వివరాలు అడుగుతారని పేర్కొన్నారు. ఇది ఒక పన్నాగం తప్ప.. కంపెనీ ప్రతినిధులు కాంటాక్ట్ అవరని చెప్పారు.

ట్రాప్‌లో కొందరు..

ట్రాప్‌లో కొందరు..

ఇప్పటికే కొందరు కస్టమర్లు తాము మోసగాళ్ల బారిన పడ్డామని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ శేఖర్ స్పందించడం ప్రాధాన్యం సంతరించుకుంది. మీ కేవైసీ సమస్య పరిష్కరిస్తామని చెప్పి మొబైల్ లేదా కంప్యూటర్‌లో ఏనీ డెస్క్, క్విక్ సపోర్ట్ డౌన్‌లోడ్ చేసుకోవాలని కోరతారు. అలా నమ్మి మీరు డౌన్‌లోడ్ చేశారో అంతే.. మీ ఐపీ వివరాలు అడిగి రిమోట్ ద్వారా తీసుకుంటారు. మీ పిన్ వివరాలు కూడా తీసుకొని.. మెల్లగా డబ్బులు విత్ డ్రా చేసుకుంటారు.

1997 ఫిర్యాదులు

1997 ఫిర్యాదులు

దేశంలో ఆన్‌లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ ఏడాది జూలై నుంచి నవంబర్ వరకు పేమెంట్స్ బ్యాంక్ నుంచి 1997 ఫిర్యాదులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అందాయి. ఈ వివరాలను మంగళవారం లోక్‌సభలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆ ఫిర్యాదులను బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ పరిశీలిస్తుందని వివరించారు. ఈ క్రమంలోనే విజయ్ శేఖర్ ఖాతాదారులను అప్రమత్తం చేసేందుకు ట్వీట్ చేశారు.

English summary
Paytm founder Vijay Shekhar has urged consumers against fake messages, emails and calls from scammers pretending to be company officials and duping them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X