వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వడ్డీ లేకుండా రూ. 20 వేల లోన్, పేటీఎం, ఐసిఐసిఐ బంపర్ ఆఫర్

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పేటీఎం, ఐసీఐసీఐ బ్యాంకులు తమ కష్టమర్లకు మంచి ఆఫర్‌ను ప్రకటించాయి. 45 రోజుల స్వల్పకాలిక వ్యవధిలో రూ. 20 వేల నగదును అప్పు ఇవ్వనున్నట్టు ప్రకటించాయి. అయితే ఎలాంటి వడ్డీ లేకుండానే ఈ రూ. 20వేలను ఇవ్వనున్నట్టు ప్రకటించాయి.

మార్కెట్లో నిలదొక్కుకొనేందుకుగాను కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు వస్తుంటాయి కార్పోరేట్ సంస్థలు. ప్రత్యర్థులను చిత్తు చేయడంతో పాటు మార్కెట్లో సుదీర్ఘ కాలం నిలబాలంటే వినూత్నమైన ఆలోచనలతో ముందుకు రావాల్సిన అవసరం ఉంటుంది.

ఇదే తరహ ఆలోచనలతో ఐసీఐసీఐ, పేటీఎంలు చేశాయి. ఈ రెండు భాగస్వామ్యంతో కొత్త పథకంతో ముందుకు వచ్చాయి,. ఈ పథకం ద్వారా క్షణాల్లో రుణం పొందే అవకాశం దక్కనుంది. అయితే క్రెడిట్ కార్డు తరహలోనే 45 రోజుల వరకు ఎలాంటి వడ్డీ లేకుండానే రూ. 20 వేల రుణం పొందే అవకాశం ఉంది.

వడ్డీ లేకుండానే రూ.20వేల నగదు

వడ్డీ లేకుండానే రూ.20వేల నగదు

దేశంలోనే అతిపెద్ద పేమెంట్స్‌ ప్లాట్‌ఫామ్‌ పేటీఎం, ప్రైవేట్‌ రంగ దిగ్గజ బ్యాంకు ఐసీఐసీఐ బ్యాంకుతో భాగస్వామ్యం మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా పేటీఎం యూజర్లకు ఐసీఐసీఐ బ్యాంకు వడ్డీరహిత స్వల్పకాలిక డిజిటల్‌ రుణాలను అందిస్తోంది. గరిష్టంగా 45 రోజల వ్యవధిలో రూ.20వేల వరకు రుణం ఆఫర్‌ చేస్తోంది.

45 రోజులు దాటితే రూ. 50 ఫైన్

45 రోజులు దాటితే రూ. 50 ఫైన్

ఒకవేళ 45 రోజులు దాటినా రూ. 20వేలు చెల్లించకపోతే బ్యాంకు జరిమానా కింద రూ.50 విధిస్తోంది. అదేవిధంగా నెలకు 3 శాతం వడ్డీ వేస్తోంది. పేటీఎం, ఐసీఐసీఐ బ్యాంకు కామన్‌ కస్టమర్లకు ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్‌ పేటీఎం పేమెంట్స్‌ బ్యాంకు లేదా ఐసీఐసీఐ బ్యాంకు వాలెట్‌ ప్యాకెట్‌ కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

క్రెడిట్ స్కోర్ ఆధారంగా లోన్

క్రెడిట్ స్కోర్ ఆధారంగా లోన్

ఇతర బ్యాంకుల వాలెట్‌ కస్టమర్లకు ఈ రుణం అందుబాటులో ఉండదు. కస్టమర్‌ క్రెడిట్‌ స్కోర్‌ ఆధారంగా బ్యాంకు ఈ రుణాన్ని ఆఫర్‌ చేస్తోంది. ఈ కొత్త ఆఫర్‌ ఇన్‌స్టాంట్‌ క్రెడిట్‌ పొందాలనుకుంటున్న మిలియన్ల కొద్దీ పేటీఎం కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. సినిమాలు, విమాన ఛార్జీల చెల్లింపుల నుంచి రోజువారీ వినియోగ వస్తువులకు చెల్లించడానికి ఈ ఇన్‌స్టాంట్‌ క్రెడిట్‌ లభ్యమవుతుంది అని ఐసీఐసీఐ బ్యాంకు, పేటీఎం ప్రకటించాయి

పేటీఎం-పేటీఎం-ఐసీఐసీఐ బ్యాంకు పోస్టు పెయిడ్‌ స్కీమ్

పేటీఎం-పేటీఎం-ఐసీఐసీఐ బ్యాంకు పోస్టు పెయిడ్‌ స్కీమ్


పేటీఎం-ఐసీఐసీఐ బ్యాంకు పోస్టు పెయిడ్‌ అనే పేరుతో దీన్ని లాంచ్‌ చేశారు. ఇన్‌స్టాంట్‌ యాక్టివేషన్‌తో ఇది డిజిటల్‌ క్రెడిట్‌ అకౌంట్‌. ఆన్‌లైన్‌ ద్వారానే దీన్ని పూర్తి చేసుకోవచ్చు. లావాదేవీలకు ఎలాంటి ఫీజులు చెల్లించాల్సినవసరం లేదు. రూ.3వేల నుంచి రూ.10వేల వరకు రుణం ఇవ్వనున్నారు. రీపేమెంట్‌ హిస్టరీ ఆధారంగా ఈ రుణాన్ని రూ.20వేల వరకు కూడా ఆఫర్‌ చేస్తోంది. పేటీఎం యాప్‌ వాడుతున్న ఐసీఐసీఐ బ్యాంకు కస్టమర్లకు ఇది ప్రస్తుతం అందుబాటులో ఉంది. త్వరలోనే పేటీఎం యాప్‌ వాడుతున్న నాన్‌-ఐసీఐసీఐ బ్యాంకు కస్టమర్లు ఇది అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు.

English summary
Digital payment player Paytm has partnered with ICICI Bank, country’s largest private sector bank, to jointly launch ‘Paytm-ICICI Bank Postpaid’, offering interest-free short-term digital loans up to Rs 20,000 for a maximum of 45 days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X