వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తొందరలేదు: ముఫ్తీ, షాకిచ్చిన అమిత్‌-ఒమర్, జార్ఖండ్ సీఎం రేస్‌లో

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ (పీడీపీ) చీఫ్ ముఫ్తీ మొహమ్మద్ సయీద్ షాకిచ్చారు. తాము పీడీపీకి మద్దతిచ్చేందుకు వ్యతిరేకం కాదని కాంగ్రెస్ పార్టీ చెప్పిన విషయం తెలిసిందే. దానిపై ముఫ్తీ మొహమ్మద్ మంగళవారం స్పందించారు.

ప్రభుత్వ ఏర్పాటుకు తమకు ఎలాంటి తొందర లేదని చెప్పారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు కొంత సమయం పడుతుందని వ్యాఖ్యానించారు. తమ పార్టీ అంచనాల మేరకు ఫలితాలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విశ్వసనీయ ప్రభుత్వ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరిశీలన చేస్తామని చెప్పారు.

పీడీపీ, ఎన్సీపీతో సిద్ధమని అమిత్ షా

PDP chief Mehbooba Mufti says not in a hurry to form govt in J&K

ఓ వైపు కాంగ్రెస్ పార్టీకి పీడీపీ షాకివ్వగా.. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కాశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు పీడీపీ లేదా నేషనల్ కాన్ఫరెన్స్‌తో పొత్తుకు తాము సిద్దమని ప్రకటించారు.

పొత్తులకు అన్ని దారులు తెరిచే ఉన్నాయన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే పార్టీకి బయటి నుండి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. జమ్మూ కాశ్మీర్‍‌లో గతంతో పోలిస్తే బీజేపీ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో బీజేపీకి ఆదరణ లభించిందని, 25 స్థానాలు సాధించి తాము కీలక స్థానంలో ఉన్నామన్నారు.

ఒమర్ షాక్

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత ఒమర్ అబ్దుల్లా మరో షాకిచ్చారు! అవసరమైతే తమ రైవల్ పార్టీ అయిన పీడీపీకి మద్దతిచ్చే అంశాన్ని పరిశీలిస్తామని ఒమర్ చెప్పారు.

జార్ఖండ్ సీఎం ఎవరో..?

జార్ఖండ్ ముఖ్యమంత్రిని భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ బోర్డు బుధవారం నిర్ణయించనుంది. బీజేపీ సీనియర్ నేత ధర్మేంద్ర ప్రదాన్ మాట్లాడుతూ.. పార్టీ పార్లమెంటరీ బోర్డు, ఎమ్మెల్యేలు రేపు నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ట్రైబల్ డామినేట్ అయిన జార్ఖండ్‌లో తొలిసారి నాన్ ట్రైబల్ సీఎం రావొచ్చునని అంటున్నారు.

జార్ఖండ్ ముఖ్యమంత్రి రేసులో రఘుభర్ దాస్ మొదటి వరుసలో ఉన్నారు. ఇతను నాన్ ట్రైబల్ నేత. అతను బీజేపీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్. ఇతను 2009లో శిబూసోరెన్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా చేశారు. మాజీ ముఖ్యమంత్రి అర్జున్ ముండా ఓటమి చెందారు. ఆయన ట్రైబల్ నేత. ఈయన ఓటమి నేపథ్యంలో ప్రధానంగా రఘుభర్ పేరు వినిపిస్తోంది.

English summary
Peoples Democratic Party (PDP) leader Mehbooba Mufti Sayeed said on Tuesday that her party is not in a hurry and will take time in exploring possibilities to form government after it emerged as the single largest party in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X