వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇక మెహబూబా వంతు.. అధినేతతో పది మంది సభ్యుల భేటీ, స్థానిక సమరంపై డిస్కస్..

|
Google Oneindia TeluguNews

జమ్ముకశ్మీర్ విభజన తర్వాత రాజకీయ నేతలను గృహ నిర్భందించిన సంగతి తెలిసిందే. జమ్ముకశ్మీర్, లడాఖ్ కేంద్రపాలిత ప్రాంతాల్లో పంచాయతీ ఎన్నికలకు ఎన్నికల నగారా మోగంతో రాజకీయ నేతల గృహ నిర్బంధం నుంచి విముక్తి చేసేందుకు కశ్మీర్ ప్రభుత్వం అంగీకరించింది. దీంతో ఇవాళ నేషనల్ కాన్ఫరెన్స్ వ్యవస్థాపకులు ఫరూక్ అబ్దుల్లాను ఆ పార్టీ ప్రతినిధులు బృందం కలిసింది. తర్వాత పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ చీఫ్ మెహబూబా ముఫ్తీని కలిసేందుకు కశ్మీర్ ప్రభుత్వం అంగకీరించింది. సోమవారం పీడీపీ ప్రతినిధి బృందం ముఫ్తీని కలువబోతోంది.

శ్రీనగర్‌లోని తన ఇంట్లో పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ గృహనిర్బందంలో ఉన్న సంగతి తెలిసిందే. సోమవారం ఆమెను పీడీపీ ప్రతినిధి బృందం కలువనుంది. 10 మంది సభ్యులు గల టీం, కలిసి పంచాయతీ ఎన్నికల గురించి చర్చించే అవకాశం ఉంది. పంచాయతీ పోరును ఎలా ఎదుర్కొవాలి అనే అంశంతోపాటు, బీజేపీకి పై ఎత్తులు ఎలా చేయాలనే అంశంపై మెహబూబా ముఫ్తీ వ్యుహరచన చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

PDP delegation to meet party chief Mehbooba Mufti on Monday

రాజకీయ నేత హౌజ్ అరెస్ట్‌పై మెహబూబా ముప్తీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. కశ్మీర్ లక్ష్యంగా ప్రభుత్వం గొంతును అణచివేయాలని చూస్తుందని ఆరోపించారు. తమను అరెస్ట్ చేసి, కశ్మీర్‌లో శాంతి స్థాపనకు కృషి చేస్తామని కేంద్ర ప్రభుత్వం చిలుక పలుకులు పలుకుతుందని చెప్పారు. మరోవైపు మెహబూబా ముఫ్తీని కలేసేందుకు ఆమె కూతురు ఇల్తిజా ప్రయత్నించిన సంగతి తెలిసిందే. గతనెల 5వ తేదీన సుప్రీంకోర్టు ఆదేశాలతో మెహబూబా ముఫ్తీని ఇల్తిజా కలుసుకొని, బాగోగులను అడిగి తెలుసుకున్నారు.

English summary
Jammu and Kashmir administration allowed a 10-member delegation of the Peoples Democratic Party (PDP) to meet detained party chief and former Jammu and Kashmir (J&K) Chief Minister Mehbooba Mufti.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X