వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సరిహద్దు ఉగ్రవాదంతో ముప్పు - సవాళ్లను అధిగమిస్తేనే శాంతి - సార్క్ సమావేశంలో జైశంకర్

|
Google Oneindia TeluguNews

సరిహద్దుల వెంబడి ఉగ్రవాద కార్యకలాపాలు, దొడ్డిదారుల్లో వాణిజ్యం వల్ల దేశాలు పెను ముప్పును ఎదుర్కొంటాయని, కూటములు పరిష్కరించుకోవాల్సిన ప్రధాన సవాళ్లు కూడా ఇవేనని, వీటిని అధిగమిస్తేనే దక్షియాసియాలో శాంతి, శ్రేయస్సు, భధ్రత శాశ్వతంగా ఉంటాయని విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు.

మంత్రి కొడాలి నానికి వైసీపీ హితవు - మోదీపై కామెంట్లు సరికాదన్న సజ్జల - ఢిల్లీ సీరియస్ అయినందుకేమంత్రి కొడాలి నానికి వైసీపీ హితవు - మోదీపై కామెంట్లు సరికాదన్న సజ్జల - ఢిల్లీ సీరియస్ అయినందుకే

ఐక్యరాజ్య సమితి 75వ సాధారణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా.. పలు దేశాల కూటములు సైతం సదస్సులు నిర్వహిస్తుండటం తెలిసిందే. ఆ క్రమంలోనే గురువారం ఆన్‌లైన్‌ ద్వారా జరిగిన సార్క్‌ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో జైశకంర్ పాల్గొన్నారు. గడిచిన మూడున్నర దశాబ్దాలుగా సార్క్ గణనీయమైన పురోగతి సాధించిందని ఆయన గుర్తుచేశారు. అయితే..

PE inflow in real estate down 85 percent in Jan to Aug at $866 million

పొరగు దేశాలతోపాటు యావత్ దక్షిణాసియాలో పరస్పర సహకారం, శ్రేయస్సు కోసం భారత్‌ చేస్తున్న ప్రయత్నాలకు ఉగ్రవాద చర్యలు అడ్డంకిగా మారాయని, పరోక్షంగా పాకిస్థాన్‌పై జైశంకర్ మండిపడ్డారు. దక్షిణాసియా పురోగతి, భద్రత, సమగ్రత కోసం పొరుగు దేశానికి మొదటి ప్రాధాన్యత అన్న విధానాలకు భారత్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుదని చెప్పారు.

కరోనా విలయకాలంలో భారత్ చురుకుగా వ్యవహరించిందని, సార్క్‌ దేశాలకు తక్షణ సహాయం కింద అత్యవసర మందులు పంపడంతోపాటు పరీక్ష కోసం కోసం పది మిలియన్‌ డాలర్ల అత్యవసర నిధి ఏర్పాటు చేస్తామనీ ప్రకటించిన విషయాన్ని మంత్రి పేర్కొన్నారు. కరోనాపై సమాచారం మార్పిడిని మరింత సులభతరం చేసేందుకు కోవిడ్ -19 ఇన్ఫర్మేషన్ ఎక్స్ఛేంజ్ ప్లాట్‌ఫామ్ (కోయినెక్స్)ను భారత్‌ ప్రారంభించిందని చెప్పారు. సార్క్ విపత్తు నిర్వహణ కేంద్రం ఆధ్వర్యంలో వినూత్న వెబ్‌సైట్ అభివృద్ధికి ఇది దోహదపడిందని అన్నారు.

1లక్ష జాబ్స్, 15లక్షల మందికి ఉపాధి - గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ టీఆర్ఎస్‌దే - కేటీఆర్ దిశానిర్దేశం 1లక్ష జాబ్స్, 15లక్షల మందికి ఉపాధి - గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ టీఆర్ఎస్‌దే - కేటీఆర్ దిశానిర్దేశం

కరోనా మహమ్మారి ప్రభావాన్ని తగ్గించేందుకు సార్క్ ఫుడ్‌ బ్యాంక్‌ విధానం కోసం కూడా ఉపయోగపడుతుందని, సభ్యదేశాలైన మల్దీవులకు 150 మిలియన్‌ డాలర్లు, భూటాన్‌కు 200 మిలియన్‌ డాలర్లు, శ్రీలంకకు 400 మిలియన్‌ డాలర్ల సహాయ నిధిని ఈ ఏడాది భారత్‌ అందజేస్తుందని విదేశాంగ మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషి కూడా పాల్గొన్నారు.

English summary
External Affairs Minister S. Jaishankar said Thursday that cross-border terrorism remains one of the main challenges that need to be overcome to make the South Asian Association for Regional Cooperation (SAARC) more meaningful. Jaishankar tweeted after the virtual SAARC foreign ministers’ meeting, held on the sidelines of the UN General Assembly, that “cross-border terrorism, blocking connectivity and obstructing trade are three key challenges that SAARC must overcome”. “Only then will we see enduring peace, prosperity and security in our south Asia region,” he said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X