• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Pegasus: బీజేపీని దొరకబుచ్చుకున్నట్టేనా: కాంగ్రెస్ పక్కా ప్లాన్: 22న రాజ్‌భవన్‌ల ముట్టడి

|

న్యూఢిల్లీ: దేశంలో రాజకీయంగా ప్రకంపనలను సృష్టిస్తోన్న పెగాసస్ స్పైవేర్ (Pegasus spyware) ఉదంతం మరింత ముదురుతోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను అట్టుడికిస్తోంది. ఈ స్కాండల్ వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తోంది. దేశవ్యాప్త ఉద్యమాలకు శ్రీకారం చుట్టింది. పోరుబాట పట్టింది. ఆందోళనలకు పిలపునిచ్చింది. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని ఇరుకున పెట్టడానికి అందుబాటులో ఉన్న అన్ని వనరులను ఉపయోగించుకోనుంది. ఈ విషయంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలకు దిశా నిర్దేశాలను జారీ చేసింది.

రాహుల్ పేరు రావడంతో..

రాహుల్ పేరు రావడంతో..

2019 నాటి సాధారణ ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతలు వినియోగించే ఫోన్లను హ్యాక్ చేయడానికి బీజేపీ పెగాసస్ స్పైవేర్‌ను ప్రయోగించిందనే ఆరోపణలు దేశంలో కలకలం రేపుతోన్నాయి. రాహుల్ గాంధీ, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ.. వంటి కీలక నేతల ఫోన్ నంబర్లు పెగాసస్ స్పైవేర్ ద్వారా హ్యాకింగ్‌కు గురైనట్లు తేలడంతో కాంగ్రెస్ ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తోంది. ఈ విషయాన్ని పార్లమెంట్ ఉభయ సభల్లో దీన్ని ప్రస్తావించదలచుకుంది.

22న అన్ని రాజ్‌భవన్‌ల ముట్టడి..

22న అన్ని రాజ్‌భవన్‌ల ముట్టడి..

పెగాసస్ స్పైవేర్ స్కాండల్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. గురువారం దేశంలోని అన్ని రాజ్‌భవన్‌లను ముట్టడించనుంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలకు దిశా నిర్దేశాలను జారీ చేసింది. అన్ని రాష్ట్రాల్లో ఏక కాలంలో రాజ్‌భవన్‌లను ముట్టడించాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చింది పార్టీ అధిష్ఠానం. దీనితోపాటు- పెగాసస్ స్పైవేర్ స్కాండల్‌పై ప్రతిరోజూ విలేకరుల సమావేశాలను నిర్వహించాలని సూచించింది. ఈ స్కాండల్ వల్ల కలిగిన నష్టాన్ని ప్రజలకు వివరించేలా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది.

పెగాసస్‌పై వాయిదా తీర్మానం..

పెగాసస్‌పై వాయిదా తీర్మానం..

పెగాసస్ స్పైవేర్ స్కాండల్‌పై కొద్దిసేపటి కిందటే కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ సభ్యుడు, తెలంగాణ ఇన్‌ఛార్జ్ మాణిక్కం ఠాగూర్.. స్పీకర్ ఓం బిర్లాకు వాయిదా తీర్మానాన్ని ఇచ్చారు. దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఈ అంశంపై లోక్‌సభలో సమగ్ర చర్చ జరగాలని డిమాండ్ చేశారు. ఈ వాయిదా తీర్మానంపై స్పీకర్ చర్చకు అనుమతి ఇవ్వకపోతే.. సభను స్తంభింపజేయాలని కాంగ్రెస్, దాని మిత్రపక్ష సభ్యులు తీర్మానించుకున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ ఉభయసభల తొలిరోజే ఈ అంశంపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడివేడిగా వాగ్యుద్ధం చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

బీజేపీ జాసూసీ పార్టీగా..

బీజేపీ జాసూసీ పార్టీగా..

2014 సాధారణ ఎన్నికల సమయంలో ప్రశాంత్ కిషోర్ అప్పటి ఎన్డీఏ కూటమికి రాజకీయ వ్యూహకర్తగా పనిచేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఆయన బీజేపీకి దూరం కావడంతో నిఘా పెరిగినట్టు అనుమానాలు వ్యక్తమౌతోన్నాయి. ఎన్నికల మాజీ కమిషనర్ అశోక్ లావా, ఎలక్షన్స్ వాచ్‌డాగ్ ఏడీఆర్ వ్యవస్థాపకుడి ఫోన్ నంబర్లు హ్యాక్ కావడం.. ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని పెగాసస్ స్పైవేర్‌ను ప్రయోగించినట్లు వెల్లువెత్తుతోన్న విమర్శలు, తలెత్తుతోన్న అనుమానాలకు బలం కలిగించినట్టయిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. బీజేపీని భారతీయ జాసూసీ పార్టీగా ప్రత్యర్థులు విమర్శిస్తోన్నారు.

English summary
Congress to hold press conferences in every state tomorrow on the 'Pegasus Project' media report. State units of the party will stage protest march to Raj Bhavans across the country on July 22.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X