• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పెగాసస్ నిఘా: భారత్‌ను కించపర్చే కుట్ర -స్పైవేర్ వాడినట్లు ఆధారాల్లేవు -రాజ్యసభలో కేంద్ర ఐటీ మంత్రి ప్రకటన

|

దేశ రాజకీయాలను కుదిపేస్తోన్న పెగాసస్ స్పైవేర్ ఉదంతంపై భారత ప్రభుత్వం మరోసారి స్పష్టత ఇచ్చింది. కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం నాడు రాజ్యసభలో అధికారిక ప్రకటన చేశారు. రాజకీయ, మీడియా ప్రముఖులపై కేంద్రం నిఘా పెట్టిందని, అందుకోసం ఇజ్రాయెల్ కు చెందిన పెగాసస్ స్పైవేర్ ను వాడిందంటూ మీడియాలో వచ్చిన రిపోర్టులు అవాస్తవమని మంత్రి పునరుద్ధఘించారు. పెగాసస్ వివాదంపై సోమవారంనాడు లోక్ సభలో ఇదే ప్రకటన చేసిన ప్రభుత్వం.. విపక్షాల ఆందోళనల నడుమ ఇవాళ రాజ్యసభలోనూ అదే మాటను రిపీట్ చేసింది.

  Pegasus Spyware: RS లో BJP VS TMC MPs రచ్చ... భారత్‌ను కించపర్చే కుట్ర | Oneindia Telugu

   పార్లమెంట్‌లో పెగాసస్ రచ్చ: ఐటీ మంత్రి చేతిలో స్టేట్మెంట్ లాక్కొని చింపిపారేసిన టీఎంసీ ఎంపీలు పార్లమెంట్‌లో పెగాసస్ రచ్చ: ఐటీ మంత్రి చేతిలో స్టేట్మెంట్ లాక్కొని చింపిపారేసిన టీఎంసీ ఎంపీలు

  గత మూడు రోజులుగా పార్లమెంట్ ఉభయ సభల్లో పెగాసస్ స్పైవేర్ ఉదంతంపై రచ్చ కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ రాజ్యసభ వేదిక స్పందించారు. కేంద్రం నిఘాకు పాల్పడిందంటూ మీడియాలో వచ్చిన రిపోర్టులను ప్రభుత్వం సహా సుప్రీంకోర్టు కూడా ఖండించిందని, మీడియా రిపోర్టులు వాస్తవదూరంగా ఉన్నాయని, స్పైవేర్ వాడినట్లు ప్రాథమిక ఆధారాలేవీ సదరు రిపోర్టుల్లో లేవని మంత్రి చెప్పారు.

  Pegasus row: No factual basis, an attempted to malign Indian democracy: it min Vaishnaw in RS

  పెగాసస్ ఉదంతంపై అసలు ఆ రిపోర్టులో ఏముందో విపక్ష ఎంపీలు చదివితే బాగుంటుందని, పెగాసస్‌పై గతంలోనూ ఇలాంటి ఆరోపణలే వచ్చాయని, అలాంటి వాటికి ఎలాంటి ఆధారాలు లేవని మంత్రి వైష్ణవ్ గుర్తుచేశారు. సరిగ్గా పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలకు ఒక రోజు ముందే కొన్ని వెబ్ సైట్లలో పెగాసస్ స్పైవేవర్ నివేదికలు వచ్చాయని, బహుశా ఇదేమీ యాదృచ్చికం కాదని, భారత ప్రజాస్వామ్యాన్ని, ఇతర రాజ్యాంగబద్ధ సంస్థలను కించపరిచే కుట్రలో భాగంగానే ఇలాంటి ప్రయత్నాలు జరిగిఉండొచ్చని ఐటీ మంత్రి వ్యాఖ్యానించారు.

  pegasus నిఘా కుట్ర: అసలు రహస్యం చెప్పేసిన విజయశాంతి -7వేల ఫోన్లు ట్యాపింగ్ -దెయ్యాలు:వేదాలుpegasus నిఘా కుట్ర: అసలు రహస్యం చెప్పేసిన విజయశాంతి -7వేల ఫోన్లు ట్యాపింగ్ -దెయ్యాలు:వేదాలు

  పెగాసస్ ఉదంతంపై రాజ్యసభలో ప్రభుత్వ ప్రకటన సందర్భంగా కనీవినీ ఎరుగని గలాటా చోటుచేసుకుంది. టీఎంసీ ఎంపీ శాంతను సేన, ఆ పార్టీకే చెందిన పలువురు ఎంపీలు మంత్రి చేతిలో నుంచి స్టేట్మెంట్ పేపర్లు లాగేసి, వాటిని చింపేసి సభాపతి చైర్ పైకి విసిరారు. ఈ క్రమంలో బీజేపీ, టీఎంసీ ఎంపీల మధ్య ఘర్షణపూరిత వాతావరణం ఏర్పడింది. చివరికి మార్షర్స్ రంగప్రవేశం చేశాకగానీ పరిస్థితి అదుపులోకి రాలేదు. ఈ ఘటనను తీవ్రంగా భావిస్తోన్న ప్రభుత్వం.. టీఎంసీ ఎంపీలపై చర్యలు కోరే అవకాశముంది.

  English summary
  Union Electronics and Information Technology Minister Ashwini Vaishnaw on Thursday reiterated that the media report about the use of Pegasus spyware is a carefully-timed attempt to malign the Indian democracy. “These allegations have been dismissed in the past by all parties involved, including the Supreme Court. There is no factual basis to these allegations,” he said in Rajya Sabha amid protests by Opposition parties.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X