• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Pegasus spyware: ప్రశాంత్ కిషోర్ వ్యూహాలపై గూఢచర్యం: రాహుల్, మమత: బయటికొచ్చిన పేర్లు ఇవే

|

న్యూఢిల్లీ: దేశంలో రాజకీయంగా ప్రకంపనలను సృష్టిస్తోన్న పెగాసస్ స్పైవేర్ (Pegasus spyware) ఉదంతం మరింత ముదురుతోంది. సమయం గడిచే కొద్దీ ఇది మరింత రాజుకుంటోంది. రాజకీయాలను వేడెక్కిస్తోంది. పెగాసస్ స్పైవేర్ స్కాండల్‌లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత రాహుల్ గాంధీ, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌లను కూడా ఈ స్పైవేర్ టార్గెట్ చేసినట్లు తేలింది. ఈ స్కాండల్‌లో వారిద్దరితో పాటు సాయంత్రానికి కొన్ని పేర్లు వెలుగులోకి వచ్చాయి. వారందరి ఫోన్ నంబర్లను ఈ స్పైవేర్ టార్గెట్ చేసినట్లు జాతీయ మీడియా వెల్లడించింది.

యాపిల్ ఐఫోన్లు సులువుగా..

యాపిల్ ఐఫోన్లు సులువుగా..

బిగ్ హ్యాకింగ్ స్కాండల్ చోటు చేసుకుంది. పలువురు వేర్వేరు రంగాలకు చెందిన బిగ్ షాట్స్ ఫోన్లు హ్యాక్ అయ్యాయి. బాధితుల జాబితాలో కొందరు కేంద్రమంత్రులు, ప్రతిపక్ష పార్టీల నేతలు, ప్రభుత్వ అధికారులు, వ్యాపార, పారిశ్రామికవేత్తలు ఉన్నారు. జర్నలిస్టుల ఫోన్లనూ వదల్లేదు హ్యాకర్లు. మొత్తంగా 300 మందికి బాధితులు ఉన్నారు. ఈ జాబితాలో దేశ అత్యున్నత న్యాయస్థానం సిట్టింగ్ న్యాయమూర్తి కూడా ఉన్నారు. ప్రత్యేకించి- యాపిల్ ఐఫోన్ వినియోగించే వారి నంబర్లను సులభంగా హ్యాక్ చేసినట్లు సమాచారం.

కేంద్రమంత్రులు వీరే..

కేంద్రమంత్రులు వీరే..

ఇజ్రాయెల్‌కు చెందిన స్పైవేర్ పెగాసస్ (spyware Pegasus)ను ప్రయోగించడం ద్వారా హ్యాకర్లు.. వారి ఫోన్ నంబర్లను హ్యాక్ చేసినట్లు జాతీయ మీడియా వెల్లడించింది. ఇటీవల చోటు చేసుకున్న పునర్వ్యవస్థీకరణలో భాగంగా కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న రైల్వే, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, జల్‌శక్తి సహాయ మంత్రి ప్రహ్లాద్ పటేల్ ఫోన్ నంబర్లు కూడా హ్యాక్‌కు గురైనట్లు ది వైర్ వెబ్‌సైట్ పేర్కొంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని ప్రచురించింది. కేంద్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ అశోక్ లావాస, ఎన్నికల వాచ్‌డాగ్ అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ వ్యవస్థాపకుడు జగ్‌దీప్ ఛోఖర్ ఫోన్ నంబర్లను టార్గెట్ చేసినట్లు తేలింది.

మమతా బెనర్జీ మేనల్లుడు కూడా..

మమతా బెనర్జీ మేనల్లుడు కూడా..

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పేరు కూడా ఈ జాబితాలో ఉన్నట్లు పేర్కొంది. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మహిళ కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్లు కూడా పెగాసస్ స్పైవేర్ టార్గెట్‌లో ఉన్నట్లు స్పష్టం చేసింది. ఆమె కుటుంబానికి చెందిన 11 ఫోన్ నంబర్లు హ్యాక్‌కు గురైనట్లు ది వైర్ తెలిపింది.

ప్రశాంత్ కిషోర్‌ ఫోన్‌పై

ప్రశాంత్ కిషోర్‌ ఫోన్‌పై

2014 సాధారణ ఎన్నికల సమయంలో ప్రశాంత్ కిషోర్ అప్పటి ఎన్డీఏ కూటమికి రాజకీయ వ్యూహకర్తగా పనిచేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఆయన బీజేపీకి దూరం కావడంతో నిఘా పెరిగినట్టు అనుమానాలు వ్యక్తమౌతోన్నాయి. ఎన్నికల మాజీ కమిషనర్ అశోక్ లావా, ఎలక్షన్స్ వాచ్‌డాగ్ ఏడీఆర్ వ్యవస్థాపకుడి ఫోన్ నంబర్లు హ్యాక్ కావడం.. ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని పెగాసస్ స్పైవేర్‌ను ప్రయోగించినట్లు వెల్లువెత్తుతోన్న విమర్శలు, తలెత్తుతోన్న అనుమానాలకు బలం కలిగించినట్టయిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. బీజేపీని భారతీయ జాసూసీ పార్టీగా ప్రత్యర్థులు విమర్శిస్తోన్నారు.

ఆరోపణలను తోసిపుచ్చిన ఎన్ఎస్ఓ గ్రూప్

ఆరోపణలను తోసిపుచ్చిన ఎన్ఎస్ఓ గ్రూప్


ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్ రూపొందించిన స్పైవేర్ పెగాసస్‌‌ను హ్యాకింగ్ కోసం వినియోగించినట్లు ది వైర్ వెబ్‌సైట్ స్పష్టం చేసింది. తాము రూపొందించిన స్పైవేర్ పెగాసస్‌ను ప్రయోగించి ఈ హ్యాకింగ్‌కు పాల్పడినట్లు వచ్చిన వార్తలను ఎన్ఎస్ఓ గ్రూప్ తోసిపుచ్చింది. పెగాసస్ స్పైవేర్‌ను తాము ఇదివరకే విక్రయించామని, ప్రభుత్వ అవసరాల కోసం మాత్రమే పరిమితంగా దాన్ని వినియోగిస్తోన్నారని స్పష్టం చేసింది. నిరాధార ఆరోపణలను చేసినందు వల్ల తాము పరువు నష్టం దావా వేసే ఆలోచనలో ఉన్నట్లు ఎన్ఎస్ఓ గ్రూప్ హెచ్చరించింది. ఫోన్ల హ్యాకింగ్ వార్తలను కేంద్ర ప్రభుత్వం కూడా తోసిపుచ్చింది. 300 మందికి పైగా ప్రముఖుల ఫోన్లు హ్యాక్ అయ్యాయనడానికి సరైన ఆధారాలు లేవని స్పష్టం చేసింది.

English summary
Congress leader Rahul Gandhi, poll strategist Prashant Kishor and new IT Minister Ashwini Vaishnaw are among the big names revealed today as potential targets of Israeli spyware 'Pegasus' in the latest set of explosive revelations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X