• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పెగాసస్ నిఘా కుట్ర: తొలిసారి బాధితుల ఫిర్యాదు -సుప్రీంకోర్టులో ఐదుగురు జర్నలిస్టుల పిటిషన్ -చిక్కుల్లో కేంద్రం

|

పెగాసస్ స్పైవేర్ నిఘా ఉదంతానికి సంబంధించి కీలక పరిణామం జరిగింది. ఇజ్రాయెల్ దేశానికి చెందిన ఎన్ఎస్ఓ సంస్థ తయారు చేసిన 'పెగాసస్'అనే స్పైవేర్ ను ఉపయోగించి, భారత్ లో వివిధ రంగాలకు చెందిన వందల మందిపై కేంద్ర ప్రభుత్వమే నిఘాకు పాల్పడిందనే వివాదంలో తొలిసారి బాధితులు నేరుగా ముందుకొచ్చారు.

ఏపీకి గుడ్ బై చెప్పనున్న అమరరాజా -చిత్తూరు నుంచి చెన్నైకి బ్యాటరీ ప్లాంట్ -గల్లా జయదేవ్ సంచలనం, స్టాలిన్ ఓకే?ఏపీకి గుడ్ బై చెప్పనున్న అమరరాజా -చిత్తూరు నుంచి చెన్నైకి బ్యాటరీ ప్లాంట్ -గల్లా జయదేవ్ సంచలనం, స్టాలిన్ ఓకే?

పెగాసస్ ఉదంతంపై ఇప్పటిదాకా రాజకీయ నేతలు, థర్డ్ పార్టీ వ్యక్తులు విమర్శలు చేయడం, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అయితే పబ్లిక్ మీటింగ్ లోనే 'మోదీ నా మీటింగ్స్ పై నిఘా పెట్టాడు, అందుకే నా ఫోన్ కెమెరాకు ప్లాస్టర్ వేశాను..''అని చెప్పడం తెలిసిందే. పెగాసన్ నిఘా కుట్ర అసలు జరగలేదని వాదిస్తోన్న కేంద్రం.. విపక్షాలు ఆరోపణలను తిప్పికొడుతోంది. కానీ పార్లమెంటు వేదికగా, బయట కూడా ఈ అంశంపై రాజకీయ రచ్చ కొనసాగుతున్నది. ఈ క్రమంలోనే ప్రముఖ జర్నలిస్ట్, ది హిందూ పత్రిక ఎడిటర్ ఎన్. రామ్ సుప్రీంలో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ ఈనెల 5న విచారణకు రానుండగా తొలిసారి..

Pegasus spyware:After N Ram, 5 other journalists On Potential Snoop List Move Supreme Court

ప్రముఖ జర్నలిస్టులు ఎన్.రామ్, శశికుమార్ లు వేసిన పిటిషన్లపై ఈనెల 5న విచారణ జరుగనుండగా, పెగాసస్ నిఘా అనుమానిత బాధితులైన మరో ఐదుగురు జర్నలిస్టులు సైతం సుప్రీంకోర్టు తలుపుతట్టారు. కేంద్ర ప్రభుత్వం నిఘాకు పాల్పడిందంటూ ఆమ్నెస్టీ సహా పలు మీడియా సంస్థలు 500 పేర్లను వెల్లడించగా, ఆ జాబితాలో ఈ ఐదుగురు జర్నలిస్టుల పేర్లు కూడా ఉన్నాయి. తద్వారా పెగాసస్ నిఘా ఉదంతంపై బాదితులే తొలిసారి ఫిర్యాదు చేసినట్లయింది.

ఏపీకి గుడ్ బై చెప్పనున్న అమరరాజా -చిత్తూరు నుంచి చెన్నైకి బ్యాటరీ ప్లాంట్ -గల్లా జయదేవ్ సంచలనం, స్టాలిన్ ఓకే?ఏపీకి గుడ్ బై చెప్పనున్న అమరరాజా -చిత్తూరు నుంచి చెన్నైకి బ్యాటరీ ప్లాంట్ -గల్లా జయదేవ్ సంచలనం, స్టాలిన్ ఓకే?

  YS Jagan's Bail - Shocking Turn |Raghu Rama Krishnam Raju | CBI Court | Oneindia Telugu

  పెగాసస్ స్పైవేర్ వాడకానికి సంబందించి కేంద్రం కచ్చితంగా సమాధానం చెప్పేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఐదుగురు జర్నలిస్టులు సోమవారం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. థార్డ్ పార్టీకి చెందిన సంస్థతో తమ ఫోన్లను చెక్ చేయించగా, స్పైవేర్ చొరబడినట్లు, నిఘా జరిగినట్లు వెల్లడైందని జర్నలిస్టులు ప్రేమ్ శంకర్ ఝా, ఆర్కే సింగ్, ప్రాంజయ్ తకుర్తా, ఎస్ఎన్ అబీదీ, ఇప్సా షతక్సిలు తమ పిటిషన్లలో పేర్కొన్నారు. పెగాసస్ నిఘా ఉదంతంపై ఇప్పటికే పలు పిటిషన్లను విచారిస్తోన్న సుప్రీంకోర్టు.. దీన్ని కూడా స్వీకరించే అవకాశముంది. అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరగడంతో కేంద్రం చిక్కుల్లో పడినట్లయింది..

  English summary
  In a significant development in the Pegasus spyware controversy, five journalists who are reported to be in the potential list of snoop targets have filed writ petitions in the Supreme Court contending that the unauthorized use of surveillance by government agencies have violated their fundamental ights guaranteed under the Constitution. This is the first instance of persons approaching the Court claiming to be directly affected and personally aggrieved by the alleged hacking of their mobile phones using Pegasus spyware.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X