• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

గోసంరక్షల చేతిలో మృతి చెందిన పెహ్లుఖాన్ పేరు చార్జిషీట్లో చేర్చిన గెహ్లాట్ ప్రభుత్వం

|

రాజస్థాన్ : పెహ్లు ఖాన్.. ఈ పేరు గుర్తు ఉండి ఉంటే ఉంటుంది. గోవులను స్మగ్లింగ్ చేశాడన్న ఆరోపణలపై 2017లో రాజస్థాన్‌లోని అల్వార్‌లో అతన్ని కొందరు గోసేవకులు కొట్టి చంపారు. ఇప్పుడు గెహ్లాట్ ప్రభుత్వం పెహ్లు ఖాన్ కుమారులు ఇర్సద్, ఆరిఫ్‌లపై కేసులు నమోదు చేసింది. అంతేకాదు రాజస్థాన్ జంతు సంరక్షణ చట్టం కింద మృతుడు పెహ్లు ఖాన్‌పై కూడా సెక్షన్ 6 కింద కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే పెహ్లు ఖాన్ పై రాజస్థాన్ ప్రభుత్వం కేసు నమోదు చేసి క్రెడిట్ తీసుకున్నందుకు బీజేపీ నేత గ్యాన్ దేవ్ అహుజా కాంగ్రెస్ పై మండిపడ్డారు.

"పెహ్లుఖాన్ తన వాహనంలో గోవులను స్మగ్లింగ్ చేస్తుండగా స్థానికులు పట్టుకున్నారు. అయితే పోలీసు కస్టడీలో పెహ్లుఖాన్ మృతి చెందాడు. స్థానికులు అతన్ని కొట్టలేదు. ఇప్పుడు చార్జిషీట్ దాఖలు చేయగానే కాంగ్రెస్ క్రెడిట్ తీసుకుంటోంది. ఆ సమయంలో కాంగ్రెస్ పెహ్లుఖాన్ కుటుంబానికి ఆర్థిక సహాయం చేసింది" అని బీజేపీ నేత గ్యాన్ దేవ్ అహుజా అన్నారు. ఇదిలా ఉంటే గతేడాది డిసెంబర్ 30వ తేదీన పెహ్లూ ఖాన్‌పై రాజస్థాన్ ప్రభుత్వం కేసు నమోదు చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 13 రోజుల్లోనే కేసు నమోదు చేసింది.

Pehlu Khans name in charge sheet, the man beaten to death by cow vigilants in 2017 in Alwar

రాజస్థాన్ బొవైన్ యానిమల్ యాక్ట్‌లోని సెక్షన్ 5 ప్రకారం జంతువులను మరో ప్రాంతానికి తరలించి వధించాలని భావిస్తే నేరమని చెబుతోంది. ఎవరైతే ఈ పశువులను అక్రమంగా రవాణా చేస్తున్నారో అట్టివారు కూడా సెక్షన్ 6 కింద అదే శిక్ష పడుతుందని చట్టం చెబుతోంది. సెక్షన్ 8 జరిమానా గురించి చెబుతుండగా సెక్షన్ 9 ఎలాంటి శిక్ష విధించాలో చెబుతోంది. 2018లో పెహ్లు ఖాన్‌ మనుషులపై అప్పటి బీజేపీ సర్కార్ కేసులు నమోదు చేసింది. వారిని కూడా స్థానికులు చితకబాదారు.

ఈ ఘటనలో రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. ఒకటి ఖాన్‌ను కొట్టి చంపిన వారిపై రెండోది పెహ్లు ఖాన్ గోవులను రవాణా చేసినందుకు ఆయనపై కేసు నమోదైంది. అయితే ఖాన్‌ను కొట్టి చంపిన ఆరుగురికి పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారు. గోసంరక్షణ సిబ్బంది ఇచ్చిన సమాచారం, ఫోన్ రికార్డింగులను పరిశీలించిన మీదట ఆరుగురికి పెహ్లు ఖాన్ కేసుతో సంబంధం లేదని పోలీసులు నిర్ణయించారు. 2017 ఏప్రిల్ 1న పెహ్లూ ఖాన్ గోవులను అక్రమంగా మరో రాష్ట్రానికి తరలిస్తున్నారన్న విషయం తెలుసుకున్న గోసంరక్షకులు వాహనాన్ని అడ్డుకుని 55 ఏళ్ల పెహ్లుఖాన్‌ను చితకబాదారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పెహ్లూ ఖాన్ ఏప్రిల్ 3న మృతిచెందాడు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Rajasthan Police filed a chargesheet for cow smuggling against Pehlu Khan and his two sons in Alwar for transporting cattle. Khan was allegedly lynched in 2017 by a mob of “gau rakshaks”.While the police chargesheeted Khan’s sons Irsad (25) and Arif (22) under sections 5, 8 and 9, charges have been framed against the deceased under section 6 of the Rajasthan Bovine Animal Act 1995.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more