వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాగ్దాదీతో పాటు హతమైంది ముగ్గరు చిన్నారులు కాదు: పెంటగాన్

|
Google Oneindia TeluguNews

అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ హతమైన ఐసిస్ చీఫ్ అబు బకర్ అల్ బాగ్దాదిపై జరిగిన అటాక్‌కు సంబంధించిన వీడియోలు, ఫోటోలను విడుదల చేసింది. డిఫెన్స్ శాఖ విడుదల చేసిన ఫోటోలు ఒక్కింత గ్రే మరియు బ్లాక్ కలర్‌లో ఉన్నాయి. బాగ్దాదిని పట్టుకునేందుకు అమెరికా బలగాలు నడుచుకుంటూ అతను ఉన్న కాంపౌండ్‌లోకి అడుగుపెట్టిన దృశ్యాలున్నాయి. ఇక కొంతమంది ఐసిస్ ఉగ్రవాదులపై అమెరికా బలగాలు జరిపిన ఎయిర్‌స్ట్రైక్స్‌కు సంబంధిచిన వీడియోను విడుదల చేసింది పెంటగాన్. అమెరికా బలగాలకు చెందిన హెలికాఫ్టర్లపై ఉగ్రవాదులు దాడి చేసేందుకు ప్రయత్నించగా దాడులను బలగాలు తిప్పికొట్టే దృశ్యాలు అందులో ఉన్నాయి.

అబూ బకర్ పిరికివాడిలా చచ్చాడు: డేంజరస్ ఆపరేషన్ అంటూ డొనాల్డ్ ట్రంప్అబూ బకర్ పిరికివాడిలా చచ్చాడు: డేంజరస్ ఆపరేషన్ అంటూ డొనాల్డ్ ట్రంప్

 ముగ్గురు కాదు.. ఇద్దరు చిన్నారులు మృతి

ముగ్గురు కాదు.. ఇద్దరు చిన్నారులు మృతి

ఇక దాడులకు ముందు దాడుల తర్వాత బాగ్దాది నివసించిన కాంపౌండ్ ఫోటోలను కూడా పెంటగాన్ విడుదల చేసింది. ఇక దాడులు జరిగిన తర్వాత కాంపౌండ్ ఒక పార్కింగ్‌లాట్‌లా మారిపోయిందని చెప్పారు అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ జనరల్ కెనెత్ మెకెంజీ. ఇక మెకెంజీ ఆదివారం జరిగిన దాడులకు సంబంధించి అనేక ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్లుగా ముగ్గురు చిన్నారులు మృతి చెందలేదని ఇద్దరు మాత్రమే మృతి చెందినట్లు ధృవీకరించారు. బాగ్దాది తప్పించుకునే ప్రయత్నంలో ఇద్దరు పిల్లలతో పాటు టనెల్‌లోకి దూరి ఇక అక్కడే ఇరుక్కుపోవడంతో తనతో ఉన్న బాంబులను పేల్చుకుని ఆత్మాహుతికి పాల్పడ్డారని మెకెంజీ చెప్పారు. ఆ సమయంలోనే అతనితో పాటు ఉన్న ఇద్దరు చిన్నారులు మృతి చెందినట్లు మెకెంజీ స్పష్టం చేశారు. ఈ ఇద్దరు చిన్నారులు 12 ఏళ్ల లోపు వయస్సున్నవారని చెప్పారు.

హెలికాఫ్టర్లపైకి కాల్పులు జరిపిన ఉగ్రమూకలు


బాగ్దాది, ఇద్దరు చిన్నారులతో పాటుగా నలుగురు మహిళలు ఒక వ్యక్తి కాంపౌండ్‌లో మృతి చెందారని మెకెంజీ వివరించారు. మహిళ బెదిరించే ధోరణిలో వ్యవహరించిందని ఆమె సూసైడ్ వెస్ట్ ధరించి ఉందని చెప్పారు. ఇక అమెరికా హెలికాఫ్టర్లపై కాల్పులకు తెగబడగా వారందరినీ సైన్యం మట్టుబెట్టిందని చెప్పారు. ఆ సమయంలో నేలపై డజనుకుపైగా వ్యక్తులు ఉన్నట్లు పెంటగాన్ తెలిపింది. ప్రాణాలతో పట్టుకున్న ఇద్దరి వ్యక్తుల గురించి చెప్పేందుకు మెకెంజీ నిరాకరించారు. అయితే కాంపౌండ్ నుంచి కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు ఇతర డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఇక బాగ్దాదిని తన డీఎన్ఏ ద్వారా గుర్తించడం జరిగిందని చెప్పారు.

గాయపడ్డ కుక్క తిరిగి విధుల్లోకి..

గాయపడ్డ కుక్క తిరిగి విధుల్లోకి..

బాగ్దాది మృతి చెందిన 24 గంటల్లోనే ఇస్లాం మతాచారం ప్రకారం సముద్రం దగ్గరే శవాన్ని పూడ్చినట్లు మెకెంజీ చెప్పారు.ఇక బాగ్దాదిని టనెల్‌లోకి పారిపోయేలా చేసిన జాగిలం గురించి కూడా మెకెంజీ ప్రస్తావించారు. టనెల్ పేలడంతో ఆ కుక్క గాయాలపాలైందని ప్రస్తుతం కోలుకుని విధుల్లో చేరినట్లు మెకెంజీ చెప్పారు. ఇది దాదాపు 50 యుద్ధమిషన్లలో పనిచేసిందని మెకెంజీ చెప్పారు. బాగ్దాది హతం అవడంతో ఐసిస్ అంతం అయినట్లు భావించలేమని చెప్పిన మెకెంజీ ఇంకా ఆపరేషన్ పూర్తిగా ముగించాల్సి ఉందని చెప్పారు.

English summary
The Pentagon released video and photos on Wednesday of the US special forces raid that resulted in the death of Islamic State group leader Abu Bakr al-Baghdadi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X