వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మర్కాజ్..డేంజర్ మార్క్: లాక్‌డౌన్‌పై మత ప్రార్థనల పిడుగు: అండమాన్ సహా..!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భయానక కరోనా వైరస్‌ వ్యాప్తి చెందడాన్ని నియంత్రించడానికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ పరిస్థితులు కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో దేశ రాజధానిలో చోటు చేసుకున్న మత ప్రార్థనలు పిడుగుపాటులా మారాయనే ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి. ఈ ప్రార్థనల్లో పాల్గొని వచ్చిన ఆరుమంది తెలంగాణవాసులకు కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారించడం కలవరానికి గురి చేస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని.. ప్రార్థనల్లో పాల్గొన్న వారందర్నీ ఆసుపత్రులకు తరలిస్తోంది ఢిల్లీ సర్కార్.

తెలంగాణలో లాక్‌డౌన్‌ను బ్రేక్ చేస్తే.. జేబులు ఖాళీ: మూడుసార్లు బయట కనిపిస్తే జరిమానాతెలంగాణలో లాక్‌డౌన్‌ను బ్రేక్ చేస్తే.. జేబులు ఖాళీ: మూడుసార్లు బయట కనిపిస్తే జరిమానా

క్వారంటైన్ తప్పనిసరి..

క్వారంటైన్ తప్పనిసరి..

ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ నుంచి పెద్ద సంఖ్యలో బస్సులను ఏర్పాటు చేసింది. మంగళవారం తెల్లవారు జాము నుంచే వారందర్నీ అదుపులోకి తీసుకున్నారు ఢిల్లీ పోలీసులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారుల. ప్రత్యేక బస్సుల్లో వారందర్నీ వేర్వేరు ఆసుపత్రులకు తరలిస్తున్నారు. 14 రోజుల పాటు తప్పనిసరి క్వారంటైన్‌లో ఉండాలంటూ ఆదేశాలను జారీ చేశారు. ఢిల్లీలోని ప్రఖ్యాత హజ్రత్ నిజాముద్దీన్ మసీదు సమీపంలోని మార్కజ్ వద్ద నిర్వహించిన ఈ ప్రార్థనల్లో వేలాదిమంది పాల్గొన్న విషయం తెలిసిందే.

నిఘా లోపమేనా?

నిఘా లోపమేనా?

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఇంట్లో నుంచి అడుగు బయటపెట్టలేని పరిస్థితి లేదు. ఎలాంటి రవాణా వసతులు అందుబాటులో లేవు. అయినప్పటికీ- వేలమంది ఈ ప్రార్థనల్లో ఎలా పాల్గొన్నారనే విషయంపై ఢిల్లీ సర్కార్ వద్ద సమాధానం లేదు. నిఘా లోపమే దీనికి కారణమనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. లాక్‌డౌన్ కొనసాగుతున్న సమయంలో వేలాదిమందిని ఒకేచోటికి చేర్చడం, ఈ ప్రార్థనలు నిర్వహించడం వంటి కారణాలపై మసీదు మౌలానాపై కేసు నమోదు చేయనున్నారు ఢిల్లీ పోలీసులు.

 డ్రోన్ కెమెరాల సహాయంతో..

డ్రోన్ కెమెరాల సహాయంతో..

ప్రార్థనలను నిర్వహించిన మర్కాజ్ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. డ్రోన్‌ కెమెరాల సాయంతో జనాల కదలికలు లేకుండా లాక్‌డౌన్‌ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. ఈ ప్రార్థనల్లో పాల్గొనడానికి మలేషియా, ఇండోనేషియా, సౌదీ అరేబియా సహా దేశంలోని పలు రాష్ట్రాల నుంచి హాజరైన సుమారు 500 మంది తమ సొంత ప్రాంతాలకు చేరుకున్నారని అధికారిక వర్గాల సమాచారం.

Recommended Video

Telangana SSC Students Response on Final Examination Arragements.
అండమాన్ సహా..

అండమాన్ సహా..

అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో ఆరుమందికి కరోనా సోకినట్లు నిర్ధారించిన వారంతా ఈ ప్రార్థనల్లో పాల్గొన్నట్లు అధికారులు ధృవీకరించారు. ఈ ఆరు మంది కోల్‌కతా మీదుగా విమానంలో పోర్ట్‌బ్లెయిర్‌‌కు చేరుకున్నారని అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి హాజరై, తన స్వస్థలానికి తిరిగి వెళ్లిన జమ్మూ కాశ్మీర్‌కు చెందిన వృద్ధుడొకరు కరోనా వైరస్‌తో మరణించడం ప్రాధాన్యతను సంతరించరుకుంది.

English summary
People continue to board buses in the Nizammudin area, to be taken to different hospitals for a checkup. A religious gathering was held in Markaz, that violated lockdown conditions and several COVID 19 positive cases have been found among those who attended the gathering.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X