వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విద్యార్థుల మధ్య ర్యాట్ రేస్: ఎన్నాళ్లు పాత విధానాలు: సంస్కరణలతో సరికొత్త భారత్: మోడీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన మేధావులు, నిపుణుల సలహాలను తీసుకుని నూతన జాతీయ విద్యావిధానానికి రూపకల్పన చేశామని ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలిపారు. ప్రాథమిక విద్య స్థాయి నుంచి ఉన్నత విద్య వరకూ సమూల మార్పులను ప్రవేశపెట్టామని అన్నారు. ఫలితంగా.. విద్యా రంగంలో అద్భుత ఫలితాలను సాధించగలుగుతామని తాను ఆశిస్తున్నట్లు మోడీ చెప్పారు. ఒకే దేశం.. ఒకే విద్యావిధానం ఉండాలనేది తమ అభిమతమని తెలిపారు.

కరోనా కొత్త రికార్డు: దిమ్మ తిరిగేలా: ఒక్కరోజే 62 వేలకు పైగా: 20 లక్షలను దాటి: భయానకంగాకరోనా కొత్త రికార్డు: దిమ్మ తిరిగేలా: ఒక్కరోజే 62 వేలకు పైగా: 20 లక్షలను దాటి: భయానకంగా

విద్యా నైపుణ్యాన్ని పెంపొందించేలా..

విద్యా నైపుణ్యాన్ని పెంపొందించేలా..

జాతీయ నూతన విద్యావిధానంపై ఏర్పాటు చేసిన కాంక్లేవ్‌ను ఉద్దేశించి ఆయన శుక్రవారం ప్రసంగించారు. జాతీయ విద్యా విధానాన్ని తాము ఏకపక్షంగా రూపొందించలేదని అన్నారు. విద్యారంగానికి చెందిన మేధావులతో సహా వేర్వేరు సెక్టార్లకు చెందిన వారి అభిప్రాయాలను తీసుకున్నామని చెప్పారు. యువతలో విద్యా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. సిలబస్ పేరుతో భారీ పుస్తకాలు, బ్యాగులను మోయాల్సిన పరిస్థితి ఇన్నేళ్లు కొనసాగిందని, ఇకపై ఈ అవసరం ఉండబోదని తాను భావిస్తున్నట్లు మోడీ చెప్పారు.

21వ శతాబ్దానికి అనుగుణంగా..

21వ శతాబ్దానికి అనుగుణంగా..

21వ శతబ్దానికి అనుగునంగా పాఠ్యపుస్తకాల్లో భారీ సంస్కరణలను ప్రవేశపెట్టామని తెలిపారు. ఒకే దేశం.. ఒకే విద్యావిధానం కొనసాగించాల్సిన అవసరం ఉందని తాము భావిస్తున్నామని మోడీ పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో నూతన విద్యా విధానాన్ని రూపొందించడానికి తాము ఆరేళ్ల పాటు శ్రమించామని అన్నారు. దీనిపై ఆరోగ్యకరమైన చర్చ సాగిందని, చెప్పారు. వాటిని మధించిన తరువాతే తాము నూతన విద్యావిధానాన్ని రూపొందించామని స్పష్టం చేశారు.

విద్యా బోధనలో వివక్ష ఉండకూడదు..

విద్యా బోధనలో వివక్ష ఉండకూడదు..

విద్యా బోధనలో ఇకపై ఎలాంటి వివక్ష ఉండకూడదని భావిస్తున్నట్లు మోడీ తెలిపారు. ఈ విద్యా విధానం వల్ల దీర్ఘకాల ప్రయోజనాలను ముంద తరాల వారు అనుభవిస్తారని అన్నారు. నూతన జాతీయ విద్యావిధానంపై ఎలాంటి ఆందోళనలు పెంచుకోవద్దని సూచించారు. పిల్లలు తమకు ఇష్టమైన విద్యను అంతే ఇష్టంగా చదువుకోవాలని అన్నారు. ఇలాంటి సరికొత్త అంశాలతో కూడిన విద్యా విధానం అమల్లోకి రాగలుగుతుందా? అనే అనుమానాలు పలువురు వ్యక్తం చేస్తున్నారని, అలాంటి సందేహాలేవీ అక్కర్లేదని మోడీ తెలిపారు. ఈ విద్యా విధానం ద్వారా అద్భుత ఫలితాలను సాధించగలుగుతామనే నమ్మకం తనకు ఉందని చెప్పారు.

Recommended Video

Ayodhya Ram Mandir Bhoomi Pujan : PM Modi Speech Highlights || Oneindia Telugu
 కొన్నేళ్లుగా పాత విధానాలతోనే విద్య

కొన్నేళ్లుగా పాత విధానాలతోనే విద్య

జాతీయ విద్యా విధానంలో కొన్నేళ్లుగా ఎలాంటి మార్పూ రాలేదని నరేంద్ర మోడీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. విద్యార్థుల్లో సృజనాత్మక అనేది కనుమరుగైపోతుందని, ర్యాట్ రేస్‌లా మారారని అన్నారు. పుస్తకాలను బట్టీ పట్టాలనే ధోరణికి అలవాటు పడ్డారని చెప్పారు. ఈ విధానాన్ని సమూలంగా మార్చేయడానికి ప్రయత్నిస్తున్నామని మోడీ చెప్పారు. విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలను తీసుకుని రావాల్సిన అవసరాన్ని గుర్తించామని, దీనికి అనుగుణంగా అడుగులు వేశామని అన్నారు. 21వ శతాబ్దంలో ఓ సరికొత్త భారత్ ఆవిర్భవిస్తుందని మోడీ చెప్పారు.

English summary
Prime Minister Narendra Modi addresses ‘Conclave on transformational reforms in higher education under National Education Policy’ on Friday. He said that National Education Policy is being discussed across the nation today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X