వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శుభవార్త :రద్దుచేసిన నగదు నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు మరో అవకాశం..!

రద్దుచేసిన పాత నగదునోట్లను మరోసారి బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకొనేందుకు ఆర్ బి ఐ మరోసారి అవకాశం కల్పించే అవకాశం ఉంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

ముంబాయి: రద్దుచేసిన పాత నగదు నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకొనేందుకుగాను మరోసారి ఆర్ బి ఐ అవకాశాన్ని కల్పించే అవకాశం ఉంది.ఇప్పటివరకు బ్యాంకుల్లో డిపాజిట్ చేయకుండా రద్దుచేసిన నగదును మార్పిడి చేసుకొనేందుకు ప్రయత్నించేవారికి ఇది మంచి అవకాశమే.అయితే దీనిపై త్వరలోనే ఆర్ బి ఐ నుండి స్పష్టమైన ప్రకటన వెలువడనుంది.

గత ఏడాది నవంబర్ 8వ, తేది రాత్రి ప్రధానమంత్రి నరేంద్రమోడీ పెద్ద నగదు నోట్లను రద్దుచేస్తూ నిర్ణయాన్ని తీసుకొన్నారు.

ఈ మేరకు రద్దుచేసిన ఐదువందలు, వెయ్యి రూపాయాల నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకొనేందుకుగాను గత ఏడాది డిసెంబర్ 30వ, తేదివరకు అవకాశాన్ని కల్పించారు.

అయితే గత ఏడాది డిసెంబర్ 30వ, తేదివరకు రద్దుచేసిన నగదు నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయకుండా బయట ఉన్న నగదు కూడ ఇంకా ఉండే అవకాశం ఉందని ఆర్ బి ఐ భావిస్తోంది. ఈ మేరకు మరో అవకాశాన్ని ఇవ్వనుంది.

 పాత నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ కు మరో అవకాశం

పాత నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ కు మరో అవకాశం

రద్దుచేసిన పాత నగదు నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు మరో అవకాశం ఇవ్వనుంది ఆర్ బి ఐ . వాస్తవానికి గత ఏడాది డిసెంబర్ 30వ, తేదినే ఈ గడువు ముగిసింది. కాని, ఈ గడువు ముగిసిన తర్వాత కూడ ఇంకా రద్దుచేసిన నగదు బ్యాంకుల్లో డిపాజిట్ చేయకుండా ఉందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. ఇంకా ఆర్ బి ఐ కి వినతులు వస్తూనే ఉన్నాయి.దీంతో మరోసారి రద్దుచేసిన నగదును డిపాజిట్ చేసుకొనే అవకాశాన్ని కల్పించాలని ఆర్ బి ఐ భావిస్తోంది.

 తక్కువ డిపాజిట్టునే అనుమతించేఅవకాశం

తక్కువ డిపాజిట్టునే అనుమతించేఅవకాశం

గత ఏడాది డిసెంబర్ 30వ, తేదితో రద్దుచేసిన పెద్ద నగదు నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసే కాలపరిమితి ముగిసింది.అయితే ఈ గడువు ముగిసిన తర్వాత కూడ ప్రజల నుండి వస్తోన్న వినతుల దృష్ట్యా మరోసారి గడువును ఇచ్చే ప్రయత్నం చేయాలని ఆర్ బి ఐ భావిస్తోంది. అయితే తక్కువ కాలపరిమితి మాత్రమే ఉంటుంది.గతంలో యాభై రోజుల సమయం ఇవ్వగా, ఈ ఏడాది మాత్రం అంత సమయాన్ని ఇచ్చే అవకాశాలు మాత్రం లేవని ఆర్ బి ఐ అధికారులు చెబుతున్నారు.

 ఆర్ బి ఐ కార్యాలయాల్లో డిపాజిట్ చేయవచ్చు

ఆర్ బి ఐ కార్యాలయాల్లో డిపాజిట్ చేయవచ్చు

రద్దుచేసిన పాత నగదు నోట్లను ఎంపిక చేసిన ఆర్ బి ఐ కార్యాలయాల్లో ఈ ఏడాది మార్చి 31వ, తేది వరకు డిపాజిట్ చేసుకొనే అవకాశం ఉంది.అయితే గత ఏడాది డిసెంబర్ 30వ, తేది వరకు ఎందుకు బ్యాంకుల్లో ఈ నగదును డిపాజిట్ చేయలేకపోయారనే విషయాన్ని స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది. ఈ వివరణకు ఆర్ బి ఐ అధికారులు సంతృప్తి చెందితేనే రద్దుచేసిన నగదును స్వీకరించే అవకాశం ఉంటుంది.

 నల్ల ధనం నిర్మూలనకు నోట్ల రద్దు

నల్ల ధనం నిర్మూలనకు నోట్ల రద్దు

నల్లధనం నిర్మూలించే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం పెద్ద నగదునోట్లను రద్దుచేసింది . అయితే రానున్న రోజుల్లో పెద్ద నగదునోట్లను రద్దుచేసే సమయానికి దేశవ్యాప్తంగా చలామణి ఉన్న రద్దుచేసిన నగదు నోట్లలో పూర్తిస్థాయిలో బ్యాంకుల్లో డిపాజిట్ కాలేదని సమాచారం.ఇంకా 2.5 లక్షల కోట్ల రూపాయాలు బ్యాంకుల్లోకి చేరలేదు.దీంతో మరోసారి గడువిస్తే బ్యాంకులకు చేరని నగదు కూడ తిరిగి బ్యాంకులకు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

English summary
the reserve bank of india may allow citizens another chance to deposit the scrapped Rs 500 and Rs 1,000 banknotes but the exchange would be for a limited sum
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X