వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కశ్మీర్ ప్రజలకు మద్దతుగా దేశం మొత్తం నిలిచింది : నరేంద్ర మోడి

|
Google Oneindia TeluguNews

కశ్మీర్ విభజనపై కొద్దిమంది తప్ప, దేశం మొత్తం పార్టీలకు అతితంగా కేంద్రానికి మద్దతుగా నిలబడ్డారని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. తన 75రోజుల పాలనపై మీడీయాతో మాట్లాడిన మోడీ కశ్మీర్ పై పలు అంశాలను వివరించారు. ఈ నేపథ్యలోనే ఆర్టికల్ 370 రద్దును గుప్పెడు మంది వ్యతిరేకిస్తే...దేశంలో చాలమంది ఆహ్వానించారని అన్నారు.

కశ్మీర్‌లో ప్రస్థుతం ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నట్టు కనిపిస్తోందని, ఇలాంటీ సంధర్భంలో జమ్ము కశ్మీర్ ప్రజలు మీకు ఎందుకు మద్దతు ఇవ్వాలి అన్న ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. కశ్మీర్ విభజన, ఆర్టికల్ రద్దు కశ్మీర్‌ అంశాన్ని వ్యతిరేకించినవారి లిస్టు చూస్తే... అందులో కొద్ది మంది రాజవంశీకులతోపాటు, ఉగ్రవాదుల సానుభూతి పరులు, ప్రతిపక్షంలోని కొంతమంది నేతలు మాత్రమే వ్యతిరేకించారని, కాని పార్టీలకు అతీతంగా మెజారీటి నాయకులు, ప్రజలు ఈ నిర్ణయాన్ని స్వాగతించారని అన్నారు. దీంతో ఇంతకు ముందు పరిష్కారం కాని సమస్యలుగా ఉన్న వాటిని పరిష్కరిస్తూ వాటిని వాస్తవ రూపంలోకి తీసుకువస్తుండడాన్ని ప్రజలు చూస్తున్నారని అన్నారు.

people of India have supported the steps taken in Jammu, Kashmir : PM Modi said

ఆర్టికల్స్ 370 మరియు 35 (ఎ) జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్ ప్రజలను ఎలా పూర్తిగా విడదీశారో ఇప్పుడు అందరికీ స్పష్టమైందన్నారు.. ఏడు దశాబ్దాల్లో ఆర్టికల్ 370 ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేకపోయిందని తెలిపారు. కశ్మీర్ పాలకులు, పౌరులను అభివృద్ధి ఫలాలకు దూరంగా ఉంచారని పేర్కోన్నారు. ఆదాయాలను పెంచడానికి సరైన ఆర్థిక మార్గాలు లేకపోవడంతో ప్రజలు ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కోన్నారని చెప్పారు...కాని కేంద్ర ప్రభుత్వ ప్రస్థుతం విధానం, అందుకు భిన్నంగా ఉండడంతోపాటు ప్రజలకు ఎక్కువ ఆర్థిక అవకాశాలు కల్పిస్తామని చెప్పారు...ఇన్ని సంవత్సరాలుగా, బెదిరింపులతో పరిపాలించారని, ఇక ఇప్పుడు కశ్మీర్ అభివృద్ధికి అవకాశం ఇద్దాం అని పిలుపునిచ్చారు.

English summary
The people of India have supported the steps taken in Jammu, Kashmir and Ladakh, PM Modi said Article 370 and 35(A) fully isolated Jammu, Kashmir and Ladakh Modi said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X