వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అయోధ్య పై త్వరలో శుభవార్త వింటారు : ఆధ్యాత్మిక గురువు రవిశంకర్

|
Google Oneindia TeluguNews

దశాబ్దాలుగా నానుతున్న అయోధ్య భూ వివాదానికి ఫుల్ స్టాప్‌ పడనుందా...నలబై రోజుల పాటు సుదీర్ఘ విచారణ జరిపిన కోర్టు ఎలాంటీ తీర్పునిస్తుంది. మరో కొద్ది రోజుల్లో పదవి విరమణ పొందుతున్న చీఫ్ జస్టీస్ రంజన్ గగోయ్ దీనిపై తీర్పు వెలువరించిన తర్వాతే ఆయన పదవి విరమణ పొందుతారని అంతా భావిస్తున్న తరుణంలో మధ్యవర్తిత్వ కమిటీ లో సభ్యుడుగా ఉన్న ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

అయోధ్య రామజన్మభూమీకి సంబంధించి త్వరలోనే భారత దేశ ప్రజలు శుభవార్త వింటారని ఆయన తెలిపారు. దీపావళీ సంధర్భంగా నాసిక్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గోన్నారు. అనంతరం మీడీయాతో మాట్లాడిన ఆయన త్వరలో ప్రజలు శుభవార్త వింటారని అన్నారు. కాగా అయోధ్య వివాదంపై ఉత్తరప్రదేశ్ కోర్టు ఇచ్చిన తీర్పులతో పాటు పలు కేసులను చీఫ్ జస్టీస్ రంజన్‌గోగోయ్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల బృందం నలబై రోజుల పాటు వాదనలు కొనసాగాయి. దీంతో వివాదానికి సంబంధించి తీర్పును వెలువరుస్తారని దేశ ప్రజలు భావిస్తున్నారు.

people of India will soon hear good news regarding the Ayodhya

ఇక వాదనల కంటే ముందే వివాదంపై సుప్రిం కోర్టు మధ్యవర్తిత్వ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ ఇరువర్గాలను సంప్రదించి సరైన పరిష్కారంతో కోర్టుకు నివేదిక పంపించాలని కోరింది. అందులో రవిశంకర్ కూడ ఒకరు. అయితే సుమారు రెండు నెలల పాటు సంప్రదింపులు జరిపిన మధ్యవర్తిత్వ కమిటీ చివరకు చేతులు ఎత్తివేసింది. వివాదం పరిష్కారాన్ని తిరిగి కోర్టుకు అప్పగించింది. ఈ నేపథ్యంలోనే జస్టీస్ రంజన్ గగోయ్ అయోధ్యపై తీర్పును వెలువరుస్తారని భావిస్తున్న తరుణంలో రవిశంకర్ వ్యాఖ్యలు మరింత ఉత్కంఠను రేపాయి.

English summary
The people of India will soon hear good news regarding the Ayodhya Ramajanmabhoomi dispute ravishanker said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X