వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

370,35ఏ ఆర్టికల్ వివాదం... ప్రజలకు ఇచ్చిన హామీని బీజేపీ నిలబెట్టుకుంటుందా ..?

|
Google Oneindia TeluguNews

దేశంలో జరగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తిరుగులేని విజయం సాధించడంతో.. కశ్వీర్‌ ప్రజలకు ప్రత్యేక అధికారాలు కట్టబెడుతున్న ఆర్టికల్ 370,35ఏ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన బీజేపీకి అటు జమ్ము ,లద్దాక్ ప్రాంతాల్లో బీజేపీ అధిక ఓట్లను ఓట్లను సాధించింది.దీంతో మూడు ఎంపీ స్థానాలకు పార్టీ కైవసం చేసుకుంది. ఈనేపథ్యంలోనే ప్రత్యేక హక్కుల ఆర్టికల్స్‌ను తొలగించాలని రాష్ట్ర్ర ప్రజలు కొరుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర్ర శాఖ నాయకులు మరోసారి తెరపైకి తెచ్చారు.

మోడీ 370,35ఏలను తొలగించలేరు..ఫరూఖ్ అబ్ధుల్లా

మోడీ 370,35ఏలను తొలగించలేరు..ఫరూఖ్ అబ్ధుల్లా

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కశ్మీర్‌లో ఫలితాలు వెలువడిన అనంతరం రాష్ట్ర్రంలోని మొత్తం ఆరు స్థానాలకు గాను మూడు స్థానాలను కైవసం చేసుకున్న నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా ఆర్టికల్స్ తొలగింపుపై స్పందించారు. ఈనేపథ్యంలోనే జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక హక్కులను సాధించిపెడుతున్న రాజ్యంగంలోని ఆర్టికల్ 370 మరియు ఆర్టికల్ 35-a ను ప్రధాని నరేంద్ర మోడీ తొలగించలేరని ఫరూక్ అబ్దుల్లా అన్నారు. రెండు ఆర్టికల్స్ రాష్ట్ర్ర ప్రజల హక్కులను కాపాడుతున్నాయని అన్నారు. ఇవి మాకు చాల ముఖ్యమని, జమ్ము కశ్మీరీలుగా దేశానికి సైనికుల్లాంటీ వారని వారు దేశానికి శత్రువులు కాదని అన్నారు.

ఆర్టికల్స్ తొలగింపును ప్రజలు కొరుకుంటున్నారు..బీజేపీ

ఆర్టికల్స్ తొలగింపును ప్రజలు కొరుకుంటున్నారు..బీజేపీ

కాగా ఫరూఖ్ అబ్దుల్లా వ్యాఖ్యలపై కశ్మీర్ బీజేపీ శాఖ నేతలు స్పందించారు. ఎన్నికల్లో జమ్ము,ఉద్దంపూర్,లద్దక్ పార్లమెంట్ స్థానాలను బీజేపీ కైవసం చేసుకోవడంతో అక్కడి ప్రజలు 370,35ఏలను తొలగింపును కోరుకుంటున్నారని అన్నారని అన్నారు. వీటి తొలగింపును ప్రజలు కోరుకుంటుండడంతోనే ప్రజలు నేషనల్ కాన్ఫరెన్స్ తోపాటు పీడీపీని ప్రజలు తిరస్కరించారని ఈనేపథ్యంలోనే బీజేపీకి పట్టం గట్టారని అన్నారు.

జమ్ము కశ్మీర్‌లో 46.4శాతం ఓట్లను సాధించిన బీజేపీ

జమ్ము కశ్మీర్‌లో 46.4శాతం ఓట్లను సాధించిన బీజేపీ

ఈనేపథ్యంలోనే మొత్తం 3,479,155 ఓట్లకు గాను 16,48,041 ఓట్లను బీజేపీకి పడ్డాయి. దీంతో మొత్తం పోలైన ఓట్లకు గాను 46.4శాతం సాధించింది. రాష్ట్ర్రంలోని జమ్ము,ఉద్దంపూర్, లద్దాక్ పార్లమెంట్ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. కాగా గత 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 34.40శాతం ఓట్లను సాధించింది. అయితే కశ్మీర్ రిజియన్‌లోని మిగిలిన మూడు స్థానాలను నేషనల్ కాన్ఫరెన్స్ సాధించింది. కాగా ఎన్‌సీ మూడు స్థానాలు సాధించినా 7.9 ఓట్ల శాతాన్ని సాధించింది. కాగా అయిదు స్థానాల్లో పోటి చేసిన కాంగ్రెస్ పార్టీ మొత్తం 1,011,527 సాధించి 28.5 శాతం ఓటు షేరింగ్‌ను పొందింది.

English summary
The Jammu and Kashmir unit of the BJP claimed that the people of Jammu and Ladakh regions want immediate removal of Article 370 and Article 35A of the Constitution by voting for the party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X