వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Lockdown: హే హే హేయ్, ఢాం ఢూం జాతర, నాతొక్కాలో కరోనా, ఎడ్ల బండి పోటీలు, వేలాది మంది !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి తాండవం చేస్తోంది. ఇక భారతదేశంలో రోజురోజుకు కరోనా వైరస్ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 11, 458 కరోనా కేసులు నమోదైనాయి. భారతదేశంలో నేటి వరకు 3, 08, 993 కరోనా కేసులు నమోదైనాయి. కరోనా వైరస్ కట్టడికి దేశంలో 5.0 లాక్ డౌన్ అమలులో ఉంది. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని 144 సెక్షన్ అమలు చేశారు.

అయితే భౌతిక దూరం పాటించకుండా, కనీసం ముఖాలకు మాస్క్ లు కూడా వేసుకోకుండా వేలాది మంది ప్రజలు గుమికూడి ఢాం ఢూం అంటూ జాతర నిర్వహించి ఏకంగా ఎడ్ల బండి పోటీలు నిర్వహించారు. ఈ దెబ్బతో కరోనా వైరస్ ఎక్కడ వ్యాపిస్తుందో అనే భయంతో జాతర నిర్వహకులపై కేసులు పెట్టి విచారణ చెయ్యాలని పోలీసులకు ఆ జిల్లా కలెక్టర్ కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేశారు.

అత్త కూతురితో పెళ్లి: ఫస్ట్ నైట్ బెడ్ రూంలో అరుపులు, కేకలు, సరసాలు కాదు, గడ్డపారతో మానవ మృగం !అత్త కూతురితో పెళ్లి: ఫస్ట్ నైట్ బెడ్ రూంలో అరుపులు, కేకలు, సరసాలు కాదు, గడ్డపారతో మానవ మృగం !

కర్ణాటక ఏం తక్కువ ?

కర్ణాటక ఏం తక్కువ ?

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య 3 లక్షలు దాటిపోయింది. ఇక కర్ణాటకలో రోజురోజుకు కరోనా వైరస్ కేసులు పెరిగిపోవడంతో అక్కడి బీఎస్. యడియూరప్ప ప్రభుత్వం ఆ వ్యాధిని అరికట్టడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నది. అయినా బెంగళూరు నగరంతో సహ కర్ణాటకలోని అనేక జిల్లాల్లో కరోనా వైరస్ రోజురోజుకు పెరిగిపోతున్నాయి.

 ప్రసిద్ది చెందిన జాతర

ప్రసిద్ది చెందిన జాతర

కర్ణాటకలోని హావేరి జిల్లా కర్జగి ప్రాంతంలో ప్రతి సంవత్సరం కారుమణ్ణిమ ( కర్ణాటకలో జూన్ లో వచ్చే ప్రత్యేక రోజులు) తరువాత శ్రీ బ్రహ్మలింగేశ్వర జాతర వైభవంగా నిర్వహిస్తారు. బ్రహ్మలింగేశ్వర జాతర మూడు రోజుల పాటు స్థానికులు ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. హావేరి జిల్లాతో పాటు కర్ణాటకలోని అనేక జిల్లాల ప్రజలు ఈ జాతరలో పాల్గొంటారు.

 లాక్ డౌన్ దెబ్బతో ఒక్కరోజు !

లాక్ డౌన్ దెబ్బతో ఒక్కరోజు !

ప్రతి సంవత్సరం మూడు రోజుల పాటు రంగరంగ వైభవంగా జరిగే జాతరను లాక్ డౌన్ సందర్బంగా ఒక్కరోజు మాత్రమే నిర్వహించాలని స్థానికులు నిర్ణయించారు. లాక్ డౌన్ ఆంక్షలు అమలులో ఉన్న సమయంలో ఒక్కరోజు జాతరకు అనుమతి ఇవ్వాలని ఆలయ కమిటీ నిర్వహకులు స్థానిక తహసిల్దార్ శంకర్ కు వినతి పత్రం సమర్పించారు.

 జిల్లా కలెక్టర్ ఎంట్రీతో సీన్ సిఢేల్ !

జిల్లా కలెక్టర్ ఎంట్రీతో సీన్ సిఢేల్ !

జాతర నిర్వహించడానికి తాను అనుమతి ఇచ్చే అంత సీన్ లేదని, జిల్లా కలెక్టర్ అనుమతి తీసుకోవాలని తహసిల్దార్ శంకర్ జిల్లా కలెక్టర్ కృష్ణ భాజ్ పేయికి లేఖ రాశారు. కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతుంటే లాక్ డౌన్ నియమాలు పక్కనపెట్టి జాతరకు ఎలా అనుమతి ఇవ్వాలని హావేరి జిల్లా కలెక్టర్ కృష్ణ భాజ్ పేయి అధికారులను, స్థానికులను ప్రశ్నించారు. ఎండ్ల బండి పోటీలు, జాతరకు అనుమతి ఇవ్వలేమని జిల్లా కలెక్టర్ కృష్ణ భాజ్ పేయి తేల్చి చెప్పారు.

హే హే హేయ్... ఢాం ఢూం అంటూ జాతర

జిల్లా కలెక్టర్ అనుమతి ఇవ్వపోయినా పర్వాలేదని, ప్రతి ఏడాది నిర్వహించే జాతర మాత్రం తాము ఆపలేమని స్థానికులు తేల్చి చెప్పారు. అధికారుల అనుమతి లేకపోయినా జోరుగా హే హే హేయ్ అంటూ ఎడ్ల బండి పందాలు నిర్వహించారు. స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కొన్ని వేల మంది జాతరలో పాల్గొన్నారు. అయితే ఏ ఒక్కరూ కూడా ముఖానికి మాస్కూలు వేసుకోకుండా, భౌతిక దూరం పాటించకుండా జాతరలో పాల్గొన్నారు.

Recommended Video

AP Govt Changed SSC ఎక్జామ్ Pattren to Reduce strain To స్టూడెంట్స్
 సీన్ రివర్స్ తో జాతర నిర్వహకులు !

సీన్ రివర్స్ తో జాతర నిర్వహకులు !

జోరుగా జాతర జరిగిన విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ కృష్ణ భాజ్ పేయి ఎలాంటి అనుమతులు లేకుండా లాక్ డౌన్ నియమాలు ఉల్లంఘించి జాతర నిర్వహించిన వారిపై కేసులు నమోదు చేసి విచారణ చెయ్యాలని స్థానిక పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. స్థానిక పోలీసులు జాతర నిర్వహకుల మీద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఆ ప్రాంతంలో ఎవరైనా అనారోగ్యానికి గురౌవుతున్నారా ? అంటూ ఆరా తీస్తున్నారు.

English summary
Lockdown: Coronavirus cases are increasing in karnataka. To controll virus, government has restricted people gathering in functions. But in karjagi village of haveri, villagers gathered in a large number and break social distance, celebrated kara hunnime fair
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X