వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Janata Curfew: ఐక్యత చాటిచెప్పారిలా..చప్పట్లతో మారుమోగిన దేశం, వారికి థ్యాంక్స్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనావైరస్‌పై భారత్ పోరు ఊపందుకుంది. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ మార్చి 22న ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దేశ ప్రజలంతా జనతా కర్ఫ్యూ పాటించాలని పిలుపునిచ్చారు. ఎవరూ బయటకు రాకూడదని అంతా ఇళ్లకే పరిమితమై మహమ్మారిపై పోరు చేయాలని చెప్పారు. సాయంత్రం ఐదుగంటలకు అంతా తమ ఇళ్లల్లోని బాల్కనీలోకి వచ్చి కరోనావైరస్‌పై పోరాటం చేస్తున్న వైద్యసిబ్బంది, ఇతర సిబ్బందిని ధన్యవాదాలు తెలుపుతూ చప్పట్లు, గంటలు మోగించాలని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు.

 People stay at home with Modis call for Janata curfew,here are the live updates

ప్రధాని మోడీ పిలుపునందుకున్న దేశ ప్రజలు స్వచ్చందంగా స్వీయ నిర్బంధంలో ఉండి మద్దతు తెలుపుతున్నారు. ఇటు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ప్రధాని ఇచ్చిన పిలుపును అందుకుని ఇళ్లకే పరిమితమయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఉదయం ఆరుగంటల నుంచి సోమవారం ఉదయం ఆరుగంటల వరకు జనతా కర్ఫ్యూను పాటించాలని తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. అంతా సహకరిస్తేనే ఈ మహమ్మారిపై పోరాడి విజయం సాధించగలమని చెప్పారు. ఇక ఈ రోజు జరిగే జనతా కర్ఫ్యూపై మినిట్-టూ-మినిట్ అప్‌డేట్స్ మీకోసం

Newest First Oldest First
9:26 PM, 22 Mar

కరోనా వైరస్‌ను అంతమొదించిందేందుకు ప్రధాని ఇచ్చిన జనతా కర్ఫ్యూ పిలుపునకు దేశ ప్రజలందరూ ముందుకు వచ్చారని, వారందరికీ హృదయపూర్వక అభినందలని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు. కరోనాను ఎదుర్కొనేందుకు దేశ ప్రజలంతా దృఢ సంకల్పంతో ఉన్నారని చాటి చెప్పామని అన్నారు.
9:23 PM, 22 Mar

భారతదేశం కరోనాపై కలిసికట్టుగా పోరాడుతుందని ఆదివారం నిర్వహించిన జనతా కర్ఫ్యూ ద్వారా స్పష్టమైందని భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్యర్ వ్యాఖ్యానించారు. అత్యవసర సేవలందిస్తున్న వారందరికీ భారత ప్రజలు ధన్యవాదాలు తెలిపారని, ఇదే స్ఫూర్తిని కరోనాను అంతమొందించేవరకూ చూపాలని సచిన్ పిలుపునిచ్చారు.
9:16 PM, 22 Mar

కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ చప్పట్లు కొట్టి కరోనాను ఎదుర్కొనేందుకు అత్యవసర సేవలందిస్తున్న వారందరికీ సంఘీభావం తెలిపారు.
9:09 PM, 22 Mar

కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ప్రాణాలను రిస్క్‌లో పెట్టి మరీ అత్యవసర సేవల్లో నిరంతరం పనిచేస్తూ దేశానికి సేవలు అందిస్తున్నవారికి ప్రజలంతా చప్పట్లతో సంఘీభావం ప్రకటించిన సంగతి తెలిసిందే.కేంద్రమంత్రి హర్షవర్దన్ కూడా చప్పట్లతో వారికి సంఘీభావం ప్రకటించారు.
8:44 PM, 22 Mar

మార్చి 31 వరకు ఏపీలో లాక్ డౌన్ నిర్వహిస్తున్నట్లు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు.
8:32 PM, 22 Mar

గోవా గవర్నర్ సత్యపాల్ మాలిక్, అధికారులు, సిబ్బంది చప్పట్లు కొట్టి సంఘీభావం తెలిపారు.
8:22 PM, 22 Mar

అస్సాం ప్రజలు చప్పట్లతో ఇలా సంఘీభావం తెలిపారు.
8:14 PM, 22 Mar

సినీహీరో జూనియర్ ఎన్టీఆర్ తన కుమారుడితో కలిసి గంట మోగించారు.
8:13 PM, 22 Mar

టాలీవుడ్ హీరో వెంకటేశ్ గంట మోగించి సంఘీభావం ప్రకటించారు.
8:10 PM, 22 Mar

గోవాలో మరో మూడు రోజులపాటు జనతా కర్ఫ్యూ ఉంటుందని సీఎం ప్రమోద్ సావంత్ ప్రకటించారు.
8:04 PM, 22 Mar

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గంట మోగించి, చప్పట్లు కొట్టి కరోనా పోరాటంలో అత్యవసర సేవలందిస్తున్న వారికి సంఘీభావం తెలిపారు.
8:03 PM, 22 Mar

చెన్నైలో ప్రజలు చప్పట్లు, గంటా నాదంతో సంఘీభావం తెలుపుతున్న దృశ్యం.
7:34 PM, 22 Mar

కరోానాపై పోరాడుతున్న అత్యవసర సేవల విభాగం సిబ్బందికి సంఘీభావం తెలుపుతూ ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ పటేల్ తన నివాసం ముందు గంట మోగించారు.
7:17 PM, 22 Mar

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తన కుటుంబసభ్యులతో కలిసి చప్పట్లు కొట్టి అత్యవసర సేవలందిస్తున్నవారికి సంఘీభావం తెలిపారు.
7:03 PM, 22 Mar

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, తన కుటుంబసభ్యులతో కలిసి కరోనా పోరాటంలో కృషి చేస్తున్న వారందరికీ చప్పట్లతో సంఘీభావం తెలిపారు.
6:55 PM, 22 Mar

కేంద్రంతో సమన్వయం చేసుకుని పనిచేస్తాం: సీఎం కేసీఆర్
6:55 PM, 22 Mar

ప్రజారవాణా పూర్తిగా నిలిపివేస్తున్నాం: సీఎం కేసీఆర్
6:49 PM, 22 Mar

అన్ని వైన్ షాపులు బంద్: కేసీఆర్
6:44 PM, 22 Mar

ఈ రోజు ఐదు పాజిటివ్ కేసులు బయటపడ్డాయి: సీఎం కేసీఆర్
6:44 PM, 22 Mar

ఒకవారం రోజుల నియంత్రణ భవిష్యత్ తరాలను కాపాడుతుంది: సీఎం కేసీఆర్
6:36 PM, 22 Mar

గంట మోగించి వైద్యసిబ్బంది, పోలీసు మీడియా సిబ్బందికి అభినందనలు తెలిపిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్
6:30 PM, 22 Mar

తెల్లరేషన్ కార్డు దారులకు ఉచితంగా 12 కిలోల బియ్యం అందజేస్తామన్న సీఎం కేసీఆర్
6:28 PM, 22 Mar

మార్చి 31వరకు జనతా కర్ఫ్యూ కొనసాగుతుంది: సీఎం కేసీఆర్
6:27 PM, 22 Mar

జనతా కర్ఫ్యూ విజయవంతం చేసిన ప్రజలకు ధన్యవాదాలు: సీఎం కేసీఆర్
6:17 PM, 22 Mar

అకుంఠిత దీక్షతో పనిచేస్తున్న వైద్యసిబ్బంది, పోలీసులు,జవాన్లకు సెల్యూట్ చేస్తున్నానంటూ ఏపీ సీఎం వైయస్ జగన్ ట్వీట్
6:05 PM, 22 Mar

కరోనావైరస్ వ్యాధిపై పోరాటంలో భాగంగా వైద్యసిబ్బందిని అభినందిస్తూ సింగపూర్‌లోని భారతీయులు చప్పట్లు కొట్టారు
5:21 PM, 22 Mar

వైద్య సిబ్బందికి పోలీసులకు మీడియా వారు అందించిన సేవలను అభినందిస్తూ బెల్ కొడుతూ ఆనందం వ్యక్తం చేసిన బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా
5:15 PM, 22 Mar

ఇళ్లల్లోని బాల్కనీలకు చేరుకుని చప్పట్లతో వైద్య సిబ్బందిని, పోలీసులను, మీడియా సిబ్బందిని అభినందించిన దేశ ప్రజలు
5:08 PM, 22 Mar

చప్పట్లు కొట్టి వైద్యసిబ్బంది, పోలీస్ సిబ్బంది, మీడియాసిబ్బందికి ధన్యవాదాలు తెలిపిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్ మరియు కేసీఆర్
5:07 PM, 22 Mar

కరోనా మహమ్మారిని వెళ్లగొట్టేందుకు ఒక్కటైన దేశప్రజలు
READ MORE

English summary
Amid the Coronavirus outbreak, With PM Modi's call to the nation to participate voluntarily in the Janata Curfew, People of the country are following and are staying at home.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X