వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజ్యాంగాన్ని రక్షించాలని.. ఇండియా గేట్ వద్ద విద్యార్థుల సాముహిక ప్రతిజ్ఞ...

|
Google Oneindia TeluguNews

పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. న్యూ ఇయర్ సందర్భంగా కూడా బ్రేక్ ఇవ్వలేదు. బుధవారం కొందరు సీఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద సాముహికంగా ప్రతిజ్ఞ చేశారు. రాజ్యాంగాన్ని రక్షించండి అంటూ పెద్ద ఎత్తున నినాదించారు. ఈ ఆందోళనలో వివిధ వర్సిటీలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.

పౌరసత్వ సవరణ చట్టం ఎఫెక్ట్ : ముస్లిం కుటుంబాలకు పోలీసుల వేధింపులుపౌరసత్వ సవరణ చట్టం ఎఫెక్ట్ : ముస్లిం కుటుంబాలకు పోలీసుల వేధింపులు

ఇండియా గేట్ వద్దకొచ్చిన విద్యార్థులు, ఆందోళనకారులు న్యూ ఇయర్ జరుపుకొంటామని చెప్పారు. కానీ అందుకు తాము ఎన్ఆర్సీ, ఎన్పీఆర్‌కు ఎలాంటి పత్రాలు ఇవ్వబోమని పేర్కొన్నారు. ఈ రోజు కొత్త ఏడాదిని ప్రారంభిస్తున్నాం.. తమకు అణచివేత నుంచి విముక్తి కల్పించాలని కోరుతున్నాం అని విద్యార్థులు పేర్కొన్నారు.

People take mass pledge at Delhi’s India Gate to ‘defend Constitution’

తమ పౌరసత్వాన్ని నిరూపించడానికి ఎలాంటి ధ్రువీకరణ పత్రం చూపించబోమని ప్రమాణం చేస్తున్నామని స్టూడెంట్స్ తెలిపారు. భారతదేశ పౌరులుగా సార్వభౌమత్వం కలిగి ఉన్నానని, రాజ్యాంగం కల్పించిన హక్కులతో జీవిస్తున్నామని పేర్కొన్నారు. కానీ తమపై వివక్ష చూపడం మాత్రం సరికాదని అంటున్నారు. జాతి, లింగ, వర్ణం, భాష, లింగ, కుల, మతం ఆధారంగా తమను విభజించడంపై భగ్గుమన్నారు. దేశంలో సమానత్వం, న్యాయం.. అందరికీ ఓకేలా ఉండాలని కోరారు.

విద్యార్థుల ఆందోళనతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ప్ల కార్డులు పట్టుకున్న విద్యార్థులు సీఏఏకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమకు స్వేచ్చ ప్రసారించాలని కోరారు. మరోవైపు న్యూ ఇయర్ సందర్భంగా ఇండియా గేట్ వద్ద వీరి ఆందోళనతో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది.

English summary
Citizenship Amendment Act Wednesday took a mass pledge to “defend the Constitution” at Delhi’s India Gate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X