• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కాషాయ వస్త్రం ధరించి.. ఆలయాల్లో పాడుపని... దిగ్గీ రాజా మరోసారి హాట్ కామెంట్స్ (వీడియో)

|
  కాషాయ వస్త్రం ధరించి.. ఆలయాల్లో పాడుపని... దిగ్గీ రాజా మరోసారి హాట్ కామెంట్స్ (వీడియో)

  భోపాల్ : మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మరోసారి నోరుజారారు. బీజేపీ లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశంలో జరుగుతున్న లైంగికదాడులకు బీజేపీతో సంబంధం ఉన్నదని పరోక్షంగా ప్రస్తావించారు. అయితే మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ సమక్షంలోనే దిగ్గీ ఈ వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతుంది.

  నోరుజారిన ..

  ఇటీవల మధ్యప్రదేశ్‌లో లైంగికదాడులు ఎక్కువవుతున్నాయి. మృగాళ్లు రెచ్చిపోతున్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే భోపాల్‌లో మంగళవారం సంత్ సంగమ్ అనే ఆధ్యాత్మిక సంస్థ ఆద్యాత్మిక వైభగ్ అనే కార్యక్రమం నిర్వహించింది. వేదికపై మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్, సీనియర్ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న లైంగికదాడులను తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పారు దిగ్విజయ్ సింగ్. రాష్ట్రంలో లైంగికదాడికి పాల్పడేవారు కాషాయా వస్త్రాలు ధరిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారని ఫైరయ్యారు.

  కాషాయ వస్త్రాలు ధరించి ..

  కాషాయ వస్త్రాలు ధరించి ..

  రాష్ట్రంలో కాషాయ వస్త్రాలు ధరించిన వారే లైంగికదాడి చేస్తున్నారని హాట్ కామెంట్స్ చేశారు దిగ్విజయ్ సింగ్. వారు గుడిలోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడటం శోచనీయమన్నారు. తర్వాత పౌడర్ చల్లి అపవిత్ర పనిని .. మంచి పని చేస్తున్నారని దుయ్యబట్టారు. అలాంటి వారిని దేవుడు కూడా క్షమించబోడని తేల్చిచెప్పారు. సనాతన ధర్మాలను సంపూర్ణంగా మారుస్తున్నారని పేర్కొన్నారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం జై శ్రీరాం నినాదాన్ని కూడా వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. వాస్తవానికి జై శ్రీరాం నినాదం... జై సియా రామ్ అని కానీ దానిని రాముడి కోసం మార్చివేశారని మండిపడ్డారు. వారు సీతాదేవి మరచిపోయి 'జై సియ రామ్‘ కాస్త ‘జై శ్రీరాంగా మార్చారని పేర్కొన్నారు.

  సాధువుల డిమాండ్లు

  సాధువుల డిమాండ్లు

  మరోవైపు కార్యక్రమంలో నర్మద మందాకిని ట్రస్ట్ చైర్మన్ కంప్యూటర్ బాబా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాధువులకు ఆవాసం కల్పించాలని కోరారు. ప్రస్తుతం కడుతున్న ఆలయాల్లోనే కాస్త భూమి కేటాయించాలని కోరారు. ఆలయానికి ఇప్పటికే ఉచితంగా విద్యుత్ అందిస్తున్నామని కంప్యూటర్ బాబా కల్పించుకొని చెప్పారు. సాధు వృద్ధులకు పెన్షన్ కూడా ఇస్తున్నామని చెప్పారు. వేదిక వద్ద సాధువుల సమస్యలను ఆలకించిన సీఎం కమల్‌నాథ్ .. పరిశ్రమలు, వ్యాపారుల కోసం స్థలాలు ఇస్తున్నామని పేర్కొన్నారు. సాధువులకు భూమి ఎందుకని .. దాంతో వారు భవిష్యత్‌లో ఏం చేస్తారని ప్రశ్నించారు. మీరు అలాంటి కోరికలు కోరడం తప్పని పేర్కొన్నారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  former Madhya Pradesh Chief Minister Digvijay Singh on Tuesday sparked yet another controversy by claiming that people wearing saffron robes were committing rapes inside temples and selling 'churan' [powder]. Digvijaya Singh was speaking at the Sant Samagam organised by the Madhya Pradesh Adhyatmik Vibhag (Spiritual Department in Bhopal. "Even God will not spare those who have defamed the ancient Sanatana Dharma. People wearing saffron robes are committing rapes inside temples and selling churan," Digvijaya Singh said in the presence of Madhya Pradesh Chief Minister Kamal Nath.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more