వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సావర్కార్‌ను అవమానించిన వారిని బహిరంగంగా కొట్టండి... శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే

|
Google Oneindia TeluguNews

వీర సావర్కర్‌ను అవమానించిన వారిని బహిగరంగంగా శిక్షించాలని శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే పిలుపునిచ్చాడు. భారతమాతను విదేశీ సంకెళ్ల నుండి తెంపిన వీరా సావర్కర్ పోరాటలను తక్కువగా చూసే వారికి ఇదే సరైన శిక్ష అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి. కాగా ఢిల్లీ విశ్వవిద్యాయంలోని ఏబీవీపీ విద్యార్థి విభాగం యూనివర్సిటీలో వీరా సావర్కర్ విగ్రహం ఏర్పాటు చేయడంతో ఎన్ఎస్‌యూఐ దాన్ని అడ్డుకుంది. దీంతో విగ్రహానికి చెప్పుల దండ వేయడంతోపాటు ముఖానికి నల్ల రంగు పూశారు.

దీంతో పాటు యూనివర్సిటి క్యాంపస్ అవరణలో నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్‌ల విగ్రహాలు ఉన్న చోట సావర్కర్ విగ్రహాలు ఉండడాన్ని ఎన్ఎస్‌యూఐ వ్యతిరేకించింది. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఉద్దవ్ ఠాక్రే స్పందించారు. ఆయన్ను అవమానించిన వారిని బహిరంగంగా దాడి చేసినప్పుడే సావర్కర్ విలువ తెలుస్తుందని ఆయన పిలుపునిచ్చారు. కాగా సావర్కార్ గురించి కనీసం రాహుల్ గాంధీకి కనీస అవగాహాన లేదని అన్నారు. అందుకే రాహుల్ గాంధీ కూడ సావర్కార్‌ను విమర్శించారని అన్నారు.

people who do not believe in Veer Savarkar must be beaten up in public:Uddhav Thackeray

ఈ నేపథ్యంలోనే సావర్కర్ సేవలను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కొనియాడారు. ఆయన స్వాతంత్రోద్యంలో ఎన్నోపోరాటాలకు నాంది పలికారని తెలిపారు. కాగా భారతమాత స్వేఛ్చా వాయువులు పీల్చుకోవడంలో ఆయన ఎనలేని కృషి చేశారని తెలిపారు. కాగా సావర్కార్ కుటుంభం కూడ దేశ సేవకు అంకితమైందని అన్నారు.అలాంటి మహనీయ వ్యక్తిని అవమానించిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. భావోద్వేగాలను రెచ్చగొడుతూ శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిని ఉపేక్షించకూడదన్నారు.

English summary
people who do not believe in Veer Savarkar must be beaten up in public. Justifying his comment, Uddhav Thackeray said that the people should be beaten up because, he said, they won't realise the struggle and importance of Veer Savarkar in the Indian independence movement. Veer Savarkar was an Indian independence activist and a politician.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X